అన్వేషించండి

YS Sharmila: వైఎస్ షర్మిల ప్రకటనపై టీ కాంగ్రెస్ రియాక్షన్, ఏమందంటే?

Telangana Congress: తమ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నట్లు షర్మిల చేసిన ప్రకటనపై టీ కాంగ్రెస్ స్పందించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో రెస్పాండ్ అయింది.

YS Sharmila: ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపులు చోటుచేసుకుంటుున్నాయి. ఎన్నికల నామినేషన్లు ఈ రోజు నుంచి ప్రారంభం కాగా.. పార్టీలన్నీ ఇప్పటికే ప్రచారంలో వేగం పెంచాయి. అలాగే అభ్యర్థులను కూడా దాదాపు పార్టీలన్నీ ప్రకటించాయి. ఎన్నికల పోలింగ్‌కు కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో పొత్తులపై కూడా క్లారిటీ వస్తుంది. కాంగ్రెస్‌తో సీపీఎం, సీపీఐ పొత్తు ఖరారు అవుతుందని అందరూ భావించగా.. సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోవడంతో కుదరలేదు. ఈ సమయంలో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.

తొలుత కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం చేయాలని షర్మిల భావించగా.. హస్తం పార్టీతో అవగాహన కుదరకపోవడంతో వెనక్కి తగ్గారు. కానీ ఇవాళ అనూహ్యంగా షర్మిల ఊహించని ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన షర్మిల.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌టీపీ పోటీ చేయడం లేదని, కాంగ్రెస్‌కు సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్‌టీపీ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులందరూ కాంగ్రెస్‌కు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఓటు బ్యాంక్ చీలకూడదనే కారణంతో కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. మీడియా ముందు ప్రకటించడమే కాకుండా.. కాంగ్రెస్‌కు మద్దతివ్వడంపై రాహుల్ గాంధీకి షర్మిల లేఖ కూడా రాశారు.

ఈ క్రమంలో షర్మిల చేసిన ప్రకటనపై తెలంగాణ కాంగ్రెస్ స్పందించింది. థ్యాంక్యూ షర్మిల గారు అంటూ తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ పెట్టింది. ఈ సందర్భంగా షర్మిలకు ధన్యవాదాలు తెలిపింది. కాంగ్రెస్‌కు మద్దతివ్వడంతో రాహుల్ గాంధీకి రాసిన లేఖను వైఎస్ షర్మిల తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దీనిని షేర్ చేసి టీ కాంగ్రెస్.. థ్యాంక్యూ షర్మిల గారు అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.

అయితే కేసీఆర్ నీచ పాలనను అంతమొందించేందుకే కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నట్లు షర్మిల మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని, కేసీఆర్‌ను అధికారం నుంచి దించడానికి ఎలాంటి కఠిన నిర్ణయానికైనా సిద్దమని స్పష్టం చేశారు. తెలంగాణ భవిష్యత్ కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా త్యాగం చేస్తున్నట్లు షర్మిల తెలిపారు. కేసీఆర్ ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, కాంగ్రెస్ గెలుపు అవకాశాలను అడ్డుకోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ విషయాన్ని వైఎస్సార్‌టీపీ శ్రేణులందరూ అర్దం చేసుకోవాలని సూచించారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని వైఎస్సార్ అనుకున్నారని షర్మిల గుర్తు చేశారు. ఢిల్లీలో తాను సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కలిసినప్పుడు తనను కుటుంబసభ్యురాలిగా చూశారని పేర్కొన్నారు.

కాగా కాంగ్రెస్‌లో విలీనం కుదరకపోవడంతో షర్మిల ఒంటరిగా బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. 119 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతున్నామని, ఆశావాహులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విలీనానికి రేవంత్ రెడ్డి అడ్డుకట్ట వేశారని, అందుకే షర్మిల విలీనంపై వెనక్కి తగ్గారనే ప్రచారం నడిచింది. కానీ ఏమైందో ఏమో కానీ చివరికి మళ్లీ కాంగ్రెస్‌కే షర్మిల జై కొట్టడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget