అన్వేషించండి

Vijay CM Swearing-in Ceremony Delayed: విజయ్‌కు షాక్ ఇచ్చిన గవర్నర్‌! తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటులో బిగ్ ట్విస్ట్! 

తమిళనాడు ముఖ్యమంత్రిగా తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ ప్రమాణస్వీకారంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖ సమర్పించాలని గవర్నర్‌ స్పష్టం చేశారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం అతిపెద్ద పార్టీగా అవతరించింది.
  • ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.
  • కాంగ్రెస్ మద్దతుతో 112 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.
  • మిగిలిన మద్దతు కోసం విజయ్ గవర్నర్‌ను సమయం కోరారు.

Vijay CM Swearing-in Ceremony Delayed: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర రాజకీయాలు అత్యంత ఉత్కంఠభరితమైన మలుపు తిరిగాయి.  నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ స్పష్టమైన మెజారిటీకి స్వల్ప దూరంలో నిలిచింది. బుధవారం మధ్యాహ్నం 3.15 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ను కలిసిన విజయ్‌, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే, తగిన సంఖ్యాబలంపై గవర్నర్‌ సంతృప్తి  చెందకపోవడంతో గురువారం జరగాల్సిన ప్రమాణస్వీకారం నిలిచిపోయినట్టు తెలుస్తోంది. 

తమిళనాడు అసెంబ్లీలో మొత్తం స్థానాలపరంగా మెజారిటీ మార్కు 118 ఉంది. గవర్నర్‌కు విజయ్‌ సమర్పించిన జాబితాలో కేవలం 112 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే కనిపిస్తోంది. దీనికి కారణం విజయ్ తన పార్టీ తరఫున 107 మంది ఎమ్మెల్యేల మద్దతును కలిగి ఉన్నారు. వాస్తవానికి ఆయన రెండు నియోజకవర్గాల నుంచి విజయం సాధించడంతో పార్టీ ప్రభావంతమైన సంఖ్యాబలం 107ా ఉంది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఇప్పటికే టీవీకేకి అధికారికంగా మద్దతు ప్రకటించింది. తమ ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు లేఖలను విజయ్‌కు అందించారు. ఈ రెండు కలిపితే 112 అవుతుండగా, మ్యాజిక్ ఫిగర్‌ 118ని చేరుకోవడానికి మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు విజయ్‌కు అత్యవసరం. 

Also Read: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు.. 2 మంత్రి పదవులకు విజయ్‌తో డీల్!

ప్రభుత్వ ఏర్పాటుపై చర్చల సందర్భంగా గవర్నర్‌ రాజేంద్ర అర్లేకర్‌ రాజ్యాంగబద్ధమైన నిబంధనలను గుర్తు చేశారు. మెజారిటీ నిరూపించుకోవడానికి అవసమరైన 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన మద్ధతు లేఖలు ఉంటేనే తదుపరి చర్యలు తీసుకోవడం సమంజసమని ఆయన విజయ్‌కు సూచించారు. దీంతో మిగిలిన మద్దతును కూడట్టుకోవడానికి విజయ్ గవర్నర్‌ను మరికొంత సమయం  కోరారు. 

Also Read: TVK విజయ్ కి శని వదిలింది, విజయం వరించింది, తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం నుంచి రాజయోగమేనా?

ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న పార్టీలు, స్వతంత్రుల నిర్ణయం అత్యంత కీలకంగా మారింది. విజయ్‌ ఇప్పటికే వివిధ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న విదుతలై చిరుతైగల్ కట్జి తమ నిర్ణయాన్ని గురువారం వెల్లడిస్తామని తెలిపింది. నలుగురు ఎమ్మెల్యేల బలం ఉన్న లెఫ్ట్ ఫ్రంట్‌ పార్టీలు మే 8 నాటికి తమ తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నాయి. పట్టాలి మక్కల్ కట్చికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు విజయ్‌ను కలిసిప్పటికీ, ఇప్పటి వరకు వారు అధికారికంగా మద్దతు లేఖను అందజేయలేదు. మరో ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే మాత్రం విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. 

విజయ్ వెంట పార్టీ సీనియర్ నేతలు బుస్సి ఎన్ ఆనంద్, అదవ్, అర్జున కేఏ సెంగోట్టయన్, సీటీ నిర్మల్‌ కుమార్ వంటి వారు ఉన్నప్పటికీ సంఖ్యాబం సమకూర్చుకోవడం ఇప్పుడు సవాలుగా మారింది. మే 7న జరగాల్సిన ప్రమాణస్వీకారం వాయిదా పడటంతో అటు అభిమానుల్లో, ఇటు రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలలో విజయ్‌ను గౌరనీయ తమిళనాడు ముఖ్యమంత్రి గా పేర్కొంటూ జన నాయకన్ అనే టైటిల్ కార్డ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. 

తమిళనాడు రాజకీయ చరిత్రలో సినిమా రంగం నుంచి వచ్చిన నేతలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. విజయ్‌ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన తొలి ఎన్నికల్లోనే అతి పెద్ద పార్టీగా అవతరించడం గొప్ప విషయం. కానీ రాజ్యాంగపరమైన సంఖ్యాబలం నిరూపించుకోవడంలో తలెత్తిన ఈ అడ్డంకిని ఆయన ఎలా అధిగమిస్తారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. గవర్నర్ ఇప్పుడు ఇచ్చే అవకాశం ఉండటంతో రాబోయే 24 నుంచి 48 గంటలు రాష్ట్ర రాజకీయాలకు అత్యంత కీలకం కానున్నాయి. 

Frequently Asked Questions

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన విజయ్‌ నేతృత్వంలోని పార్టీ ఏది?

తమిళగ వెట్రి కళగం (టీవీకే) తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించింది. దీనికి విజయ్‌ నేతృత్వం వహిస్తున్నారు.

ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ మార్క్ ఎంత?

తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ మార్క్ 118. విజయ్‌ ప్రస్తుతానికి 112 మంది ఎమ్మెల్యేల మద్దతును మాత్రమే కలిగి ఉన్నారు.

విజయ్‌ తన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌కు మరింత సమయం కోరారా?

అవును, తగిన సంఖ్యాబలం లేకపోవడంతో విజయ్‌ ప్రభుత్వం ఏర్పాటుపై చర్చల సందర్భంగా గవర్నర్‌ను మరికొంత సమయం కోరారు.

చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతు ప్రభుత్వ ఏర్పాటులో ఎంత కీలకంగా మారాయి?

మెజారిటీ మార్క్‌ను చేరుకోవడానికి విజయ్‌కు మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాబట్టి, చిన్న పార్టీలు, స్వతంత్రుల నిర్ణయం అత్యంత కీలకంగా మారింది.

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget