అన్వేషించండి

Vijay poll promises: విజయ్ మేనిఫెస్టో అమలు చేయడం అంత ఈజీ కాదు - ఏడాదికి లక్ష కోట్లకుపైగా ఖర్చు చేయాల్సిందే!

Vijay : టీవీకే విజయ్ ఇచ్చిన హామీల విలువ రూ. లక్ష కోట్ల పైమాటే ఉంది. ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయడం ఇప్పుడు కత్తి మీద సాములాంటిది.

Tamil Nadu Vijay poll promises : తమిళనాడు రాజకీయాల్లో జననాయగన్ గా ఎదగాలని ఆశిస్తున్న స్టార్ హీరో విజయ్ తన పార్టీ  తమిళగ వెట్రి కళగం  పార్టీ పెట్టి సంచనల విజయం సాధించారు. ఆయన  మేనిఫెస్టో ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది.  ఉచిత విద్యుత్, రుణమాఫీ, మహిళలకు నగదు బదిలీ వంటి ఆకర్షణీయమైన హామీలను ఆయన గుప్పించారు. అయితే, ఈ హామీలన్నీ అమలు చేయాలంటే రాష్ట్ర ఖజానాపై ఏడాదికి రూ. 1 లక్ష కోట్లకు పైగా భారం పడుతుందని అంచనా. ఇప్పటికే భారీ అప్పుల్లో ఉన్న తమిళనాడు ఆర్థిక వ్యవస్థపై ఈ నిర్ణయాలు ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మహిళలకు నెలవారీ సాయానికే రూ.47 వేల కోట్లు అవసరం

విజయ్ ప్రకటించిన హామీలలో అత్యంత భారీ వ్యయంతో కూడుకున్నది మహిళలకు ఇచ్చే నెలవారీ నగదు సాయం. రాష్ట్రంలోని దాదాపు 1.57 కోట్ల మంది మహిళలకు నెలకు రూ. 2,500 చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీనివల్ల ప్రభుత్వంపై ఏటారూ. 47,100 కోట్ల  భారం పడనుంది. దీనికి తోడు రాష్ట్రంలోని 1.85 కోట్ల కుటుంబాలకు ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు, దీనికి ఏడాదికి రూ. 9,990 కోట్లు ఖర్చవుతుంది.

రైతులకు, విద్యార్థలుకు ఏటా రూ. 15వేల సాయం

రైతులు , వ్యవసాయ కూలీల కోసం కూడా టీవీకే భారీ పథకాలను ప్రకటించింది. 79.4 లక్షల మంది రైతులకు ఏడాదికి  రూ. 15,000  చొప్పున ఆదాయ మద్దతు రూ. 11,910 కోట్లు, అలాగే 96 లక్షల మంది వ్యవసాయ కూలీలకు ఏడాదికి  రూ. 10,000  చొప్పున ఆర్థిక సాయం  రూ. 9,600 కోట్లు  అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 56.25 లక్షల మంది విద్యార్థుల తల్లులు లేదా సంరక్షకులకు ఏడాదికి  రూ. 15,000  గ్రాంట్ ఇస్తామని విజయ్ వాగ్దానం చేశారు, దీని వ్యయం సుమారు రూ. 8,438 కోట్లు.

నిరుద్యోగ భృతి సహా అనేక హామీలు

నిరుద్యోగ యువతను ఆకట్టుకునేలా.. 5 లక్షల మంది యువతకు ఇంటర్న్‌షిప్ స్టైపెండ్ నెలకు రూ. 8,000 నుండి రూ. 10,000 ,  10 లక్షల మందికి నెలకు  రూ. 4,000  నిరుద్యోగ భృతిని ప్రతిపాదించారు. వీటివల్ల ఖజానాపై మరో రూ. 10,200 కోట్ల అదనపు భారం పడనుంది. వీటితో పాటు మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయం, ఆరోగ్య బీమా ప్రీమియం పెంపు వంటి మరిన్ని పథకాలు కూడా విజయ్ మేనిఫెస్టోలో ఉన్నాయి.

ఏడాదికి లక్ష కోట్లు పైనే ఖర్చు చేయాలి

గణాంకాల ప్రకారం చూస్తే, విజయ్ హామీల మొత్తం ఖర్చు రూ. 1 లక్ష కోట్లు దాటుతుంది. ఇది  గత  స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ఖర్చు చేస్తున్న  రూ. 65,000 కోట్ల  కంటే సుమారు 52 శాతం ఎక్కువ. తమిళనాడు మొత్తం రెవెన్యూ రాబడులు  రూ. 3.31 లక్షల కోట్లు లో విజయ్ ప్రతిపాదించిన సంక్షేమ ఖర్చులే దాదాపు  30 శాతం వాటాను ఆక్రమిస్తాయి. కేవలం ప్రసంగాల వరకే కాకుండా, ఆచరణలోకి వచ్చేసరికి ఈ భారీ ఆర్థిక సవాలును విజయ్ ఎలా అధిగమిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

టాప్ హెడ్ లైన్స్

New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
IND VS SL Saransh Jain Debut: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. కుల్దీప్  ప్లేస్ లో సారాంశ్ ఎంట్రీ, కొలంబో టెస్ట్ కు టీమిండియాలో మార్పు!
12 ఏళ్ల నిరీక్షణకు తెర.. కుల్దీప్  ప్లేస్ లో సారాంశ్ ఎంట్రీ, కొలంబో టెస్ట్ కు టీమిండియాలో మార్పు!
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget