Sri Sathya Sai MLA Winner List 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల 2024 ఫలితాల్లో సత్యసాయి జిల్లాను పూర్తిగా వైసీపీని తుడిచిపెట్టేసిన టీడీపీ, బీజేపీ.
Sri Sathya Sai Jilla Assembly Election Results 2024: సత్యసాయి జిల్లాలో టీడీపీ బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఎక్కడా ప్రత్యర్థికి ఛాన్స్ ఇవ్వకుండా ప్రతిపక్షం అనేది లేకుండా ఊడ్చిపడేసింది.
Andhra Pradesh Assembly Election Result MLA Winner List 2024: శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ, బీజేపీ పూర్తిగా వైసీపీని తుడిచిపెట్టేసింది. ఆరింటికి ఆరును గెలుచుకున్నాయి. టీడీపీ ఐదు స్థానాల్లో విజయం సాధిస్తే... ఒక్క సీటులో బీజేపీ విజయకేతనం ఎగరేసింది. బీజీపీ అభ్యర్థి వై సత్యకుమార్ ధర్మవరం నుంచి విజయం సాధించారు.
నియోజకవర్గం |
విజేత |
పార్టీ |
మడకశిర |
ఎంఎస్ రాజు |
టీడీపీ |
పెనుగొండ, |
|
టీడీపీ |
హిందూపురం, |
|
టీడీపీ |
పుట్టపర్తి |
|
టీడీపీ |
ధర్మవరం |
|
|
కదిరి, |
|
టీడీపీ |
రాయలసీమ ప్రాంతంలోని మరో జిల్లా శ్రీ సత్యసాయి. ఈ జిల్లాలో ఆరు అసెంబ్లీ స్థానాలు ఉండగా, అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం ఇదే జిల్లాలోని హిందూపురం పార్లమెంట్ స్థానం పరిధిలో ఉంది. ఈ జిల్లా తెలుగుదేశం పార్టీ ఏర్పాటైన తరువాత నుంచి ఆ పార్టీకి అండగా ఉంటూ వస్తోంది. గడిచిన ఎన్నికల్లో మాత్రం ఈ జిల్లాలోని ఒకే ఒక్క స్థానం మినహా.. మిగిలిన స్థానాలను వైసీపీ కైవశం చేసుకుని అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ జిల్లా, హిందూపురం పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో విజయం సాధించగా, ఐదు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఒకే ఒక్క స్థానంలో విజయం సాఽధించగా, టీడీపీ ఆరు స్థానాల్లో గెలుపొందింది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఒకే ఒక్క స్థానానికి పరిమితం కాగా, వైసీపీ ఆరు స్థానాలను దక్కించుకుంది. 2018లో మడకశిర అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికలు అత్యంత ఆసక్తిని రేకెత్తించాయి. ఇటు కూటమి, అటు వైసీపీ అభ్యర్థులు మధ్య హోరాహోరీ పోరు సాగింది. తాజా సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 84.82 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే పెరిగిన పోలింగ్ ఈసారి ఏ పార్టీకి అనుకూలంగా మారుతుందో చూడాల్సి ఉంది. మెజార్టీ స్థానాలను తామే దక్కించుకుంటామని వైసీపీ చెబుతుండగా, జిల్లాలోని స్థానాలను క్లీన్‌స్వీప్ చేస్తామని కూటమి నేతలు చెబుతున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా
|
2009 |
2014 |
2019 |
మడకశిర |
కాంగ్రెస్ |
టీడీపీ |
వైసీపీ |
పెనుగొండ, |
టీడీపీ |
టీడీపీ |
వైసీపీ |
హిందూపురం, |
టీడీపీ |
టీడీపీ |
టీడీపీ |
పుట్టపర్తి |
టీడీపీ |
టీడీపీ |
వైసీపీ |
ధర్మవరం |
కాంగ్రెస్ |
టీడీపీ |
వైసీపీ |
కదిరి, |
టీడీపీ |
వైసీపీ |
|
రాప్తాడు |
వైసీపీ |