Sonia Gandhi: మీకు నిజాయతీ పాలనను అందించడానికి మేం సిద్ధం - సోనియా గాంధీ వీడియో విడుదల
Telangana Congress News: తెలంగాణ ప్రజలకు నిజమైన, నిజాయితీ గల ప్రభుత్వాన్ని, పాలనను అందించడానికి మేం సిద్ధంగా ఉన్నామని సోనియా అన్నారు. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అని అన్నారు.
తనను సోనియమ్మ అని పిలిచి తెలంగాణ ప్రజలు తనకు చాలా గౌరవం ఇచ్చారని, ఈ ప్రేమ, అభిమానాలకు తాను ఎప్పటికి మీకు రుణపడి ఉంటానని సోనియా గాంధీ అన్నారు. తెలంగాణ సోదరులు, అమ్మలు, బిడ్డలకు తన విన్నపాన్ని తెలియజేశారు. మార్పు కోసం కాంగ్రెస్ కి ఓటేయాలని పిలుపు ఇచ్చారు. మీకు నిజమైన, నిజాయితీ గల ప్రభుత్వాన్ని, పాలనను అందించడానికి మేం సిద్ధంగా ఉన్నామని అన్నారు. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అని అన్నారు. ఎప్పటికీ మీకు అంకితమై ఉంటానని అన్నారు.
‘‘నమస్కారం నా సోదరీమణులు మరియు ప్రియమైన తెలంగాణ సోదరులారా, నేను మీ అందరి మధ్యకు రాలేకపోయాను కానీ మీ హృదయాలకు చాలా దగ్గరయ్యాను. ఈ రోజు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. తెలంగాణ తల్లి.. అమరుల పుత్రుల కల నెరవేరేలా చూడాలని అన్నారు. మనం అందరం దొరల తెలంగాణను ప్రజా తెలంగాణగా మార్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీ కలలను నిజం చేసుకోండి. మీకు నిజమైన, నిజాయితీ గల ప్రభుత్వాన్ని, పాలనను అందించడానికి మేం సిద్ధంగా ఉన్నాము. మీరు నన్ను సోనియమ్మా అని పిలిచి అపారమైన గౌరవం, అప్యాయత ఇచ్చారు. నన్ను తల్లిలా చూసుకున్నారు. ఈ ప్రేమ, గౌరవానికి నేను ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞుతగా ఉంటాను. ఎప్పటికీ మీకు అంకితమై ఉంటాను. తెలంగాణలోని మన సోదరీమణులు, తల్లులు, కొడుకులు, కుమార్తెలు, సోదరులు ఈసారి తమ శక్తినంతా వినియోగించి మార్పు తీసుకురావాలని అభ్యర్థిస్తున్నాను. కాంగ్రెస్కు ఓటు వేయండి’’ అని సోనియా గాంధీ ఓ వీడియోను విడుదల చేశారు.
तेलंगाना की मेरी बहनों और प्यारे भाइयों नमस्कारम,
— Congress (@INCIndia) November 28, 2023
मैं आप सबके बीच नहीं आ पाई लेकिन मैं आप सबके दिल के बहुत करीब हूं।
आज मैं आपसे कुछ कहना चाहती हूं।
तेलंगाना मां के शहीद बेटों का सपना पूरा होते देखना चाहती हूं। मैं दिल से चाहती हूं कि दोराला तेलंगाना को हम सब प्रजाला… pic.twitter.com/FjmmUYSp8H