అన్వేషించండి

Sajjala Land Titling Act : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై భయపెట్టేలా టీడీపీ ప్రచారం - సజ్జల విమర్శలు

Andhra Politics : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజల్ని భయపెట్టేలా ప్రచారం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. ఈ చట్టం వద్దని మోదీ, అమిత్ షాతో చెప్పించాలని డిమాండ్ చేశారు.

Elections 2024 :  ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.  రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు క్రియేట్ చేసి విషప్రచారం చేస్తున్నారన్నారని తాడేపల్లిలోని వైసీపీ ఆఫీసులో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో వ్యాఖ్యానించారు.  2019లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు టీడీపీ  మద్దత్తిచ్చిందన్నారు.  ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో రాష్ట్రంలో అసత్యలు ప్రచారం చేసి భయభ్రాంతులను సృష్టించి దాని ద్వారా లబ్ధి పొందాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 

చంద్రబాబు అండ్ ముఠా అత్యంత దిగజారుడు రాజకీయం చేస్తోందన్ని వీళ్లు  మనుషులా పిశాచాలా అని ప్రశ్నించారు.  చంద్రబాబు   హయాంలోనే ప్రారంభమైన ఈ-స్టాంపింగ్ విధానాన్ని బాబు జిరాక్స్ కాపీలంటున్నారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని చంద్రబాబు.. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాతో ఎందుకు చెప్పించలేదని ప్రశ్నించారు.  స్టాంపింగ్‌ విధానాన్ని కేంద్రం మార్చాలని నిర్ణయించింది. ఈ-‍స్టాంపింగ్‌ పత్రాలు జిరాక్స్‌ కాపీలు అయితే వాటిని చంద్రబాబు చించేయాలి. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేస్తామని మోదీ, అమిత్‌ షాతో ఎందుకు చెప్పించలేదు?. 

చంద్రబాబు ఇరకాటంలో పెట్టిన చుక్కల భూములు, ఇనామ్‌ భూములు సమస్యను సీఎం జగన్‌ పరిష్కరించారు. బాలకృష్ణ, పవన్‌ కల్యాణ్‌ కూడా భూములు కొన్నారు. మరి పత్రాలు జిరాక్స్‌ కాపీలేనా అని ప్రశ్నించారు. భూముల సమగ్ర సర్వే మొత్తం పూర్తి అయ్యాక ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అమల్లోకి వస్తుందని ఇంకా అమల్లోకి రాలేదన్నారు.  మొత్తం సర్వే పూర్తయిన తర్వాతనే అమల్లోకి వస్తుందని చెప్పారు. అయితే ఈ చట్టం విషయంలో టీడీపీ పేర్కొన్న ప్రధాన అభ్యంరతారలపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించలేదు. అసెంబ్లీలో చట్టం పెట్టినప్పుడు ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ గా ఎవరు ఉండాలన్న ది వేరుగా ఉందని.. తర్వాత చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు.. హడావుడిగా చట్టంలో మార్పులు చేసి ఏ వ్యక్తినైనా నియమించవచ్చునని  మార్చారని అంటున్నారు. దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి ఎలాంటి వివరణ ఇవ్వలేదు.                                            

ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వివాదాస్పదంగా మారింది.  చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో రాష్ట్రంలోని భూములను సీఎం జగన్ దోచుకుంటారని వారు ఆరోపిస్తున్నారు.  ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో మీ ఇల్లు మీది కాదు.. మీ భూములు మీవి కావంటూ లోకేశ్ కూడా ఆరోపణలు చేశారు. ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు. ఈ చట్టం ద్వారా జగన్ మోహన్ రెడ్డి మీ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టే అవకాశముందని లోకేశ్ పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.                                 

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Embed widget