BC Reservations Issue: ఎన్నికలకు వెళితే నవ్వులపాలు.. సుప్రీంలో తేల్చుకుందాం..! బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్ సరికొత్తవ్యూహం
బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో తెలంగాణ సర్కార్ పరిస్దితి ముందు నుయ్యి ,వెనుక గొయ్యిలా మారింది.సుప్రీం తప్ప మరోదారి లేదనే ఆలోచనలో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసి,ఈసారి సరికొత్త వ్యూహంతో సై అంటోంది.

BC Reservations Issue: హైకోర్టు బ్రేక్ వేసినా, బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనక్కు తగ్గేదే లేదంటోంది తెలంగాణ ప్రభుత్వం. తాజాగా సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. తెలంగాణలో స్దానిక సంస్దల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 9పై ఇటీల హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. పూర్తి ఆర్డీర్ కాపీని పరిశీలించిన తరువాత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న పరిస్దితుల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా స్దానిక ఎన్నికలకు వెళితే పరువుపోవడం ఖాయమనే అభిప్రాయంలో హస్తం నేతలున్నట్లు సమాచారం. అలా అని స్దానికసంస్దల ఎన్నికలను వాయిదా వేస్తే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విషయంలో నష్టపోతామనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
బీసీలకు 42శాతం రిజర్వేన్ల హామీలో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన సర్వే చేపట్టారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సర్వే నివేదిక ఆధారంగా రాష్ట్రంలో బీసీలు 57.6శాతం ఉన్నట్లు లెక్కలు తేల్చారు. ఈ లెక్కల ఆధారంగానే 42శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ జీవో9 విడుదల చేశారు. ఇంతా చేసీ ఇప్పుడు హైకోర్టు తీర్పుతో ఆగిపోాతే , చేసిందంతా వృథా అని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఎన్నికలకు వెళితే రిజర్వేషన్ల తంటా, కాదని వదిలేస్తే నిధుల కొరత. ఇవి రెండూ కాకుండా ముచ్చటా మూడో ఆప్షన్ బెస్ట్ అని భావించింది రేవంత్ సర్కార్. సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ వేయడం ద్వారా హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయడంతోపాటు 42శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించేేందుకు వ్యూహాాత్మకంగా ముందుకెళుతోంది.
ఏం చేద్దాం.. సుప్రీం కోొర్టులో మళ్లీ ఎదురుదెబ్బ తగలకుండా ఎలా ముందుకెళదామంటూ తాజాగా జూమ్ మీటింగ్ నిర్వహించారు సీఎం, మంత్రులు, పార్టీ ముఖ్యనేతలు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాాల్లో భాగంగా ఈరోజు పీసీసీ ఛీఫ్ తోపాటు ఇద్దరు మంత్రులు ఢిల్లీ వెళ్లారు. ఇప్పటికే అడ్వకేట్ జనరల్ తోపాటు న్యాయనిపుణులతో చర్చించిన తరువాత హైకోర్టు తీర్పుపై ఆగాల్సిన అవసరం లేదని భావించినట్లు సమాచారం. రాష్ట్రంలో స్దానిక ఎన్నికల నిర్వహణలో సుప్రీం కోర్టుకు వెళ్లడం సరైన నిర్ణయమని న్యాయనిపుణులు ఇచ్చిన సలహాల ఆధారంగా స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
రిజర్వేషన్లపై 16వ తేదీన మంత్రివర్గ సమావేశం
ఎస్సీ 15, ఎస్టీ 10 ,బీసీలకు 25 శాతం రిజర్వేషన్లు ఇస్తూ స్దానిక సంస్దల ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు స్పెషల్ లీవ్ పిటీషన్ పై సుప్రీం కోర్టు ఎలా స్పందింస్తో చూసిన తరువాత , సుప్రీం తీర్పుపై ఈనెల 16వ తేదిన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి, తదుపరి కార్యచరణపై చర్చించాలని భావిస్తోంది. అన్ని కులాలకు కలపి 50శాతంకు మంచి రిజర్వేేషన్లు దాటరాదని అనేక కేసుల్లో ఇప్పటికే సుప్రీం కోర్టు తెలిపింది. అయితే బీసీలకు రిజర్వేషన్లు పెంచే క్రమంలో కమిషన్ ఏర్పాటు చేయడం, బీసీ లెక్కలు సర్వే ఆధాారంగా తేల్చడం ఇక్కడి వరకూ పద్దతి ఫాలో అయిన ప్రభుత్వం , మూడో చిక్కుముడి వద్దే ప్రస్తుతం ఆగిపోంది. అదే కొత్త రిజర్వేషన్ల మొత్తం ఏకంగా 67శాతానికి చేరుతున్నాయి. 50శాతం దాటకూడదని సుప్రీం చెప్పింది. ఈ చిక్కుముడి వీడేందుకు న్యాయసలహాలను తీసుకుని , తమ వాదనలు సుప్రీం సమర్దించే లెక్కలతో ఈసారి పక్కాగా ముందుకెళుతోంది తెలంగాణ ప్రభుత్వం.ఇదిలా ఉంటే అధికార పార్టీ బీసీ నేతలల్లో మాత్రం స్దానిక ఎన్నికలకు వెళ్లామంటే అది బీసీలకు 42శాతం రిజర్వేషన్లతోనే అనే పట్టుదల కనిపిస్తోంది. లేదంటే ఇంతా చేసి ఇతర పార్టీలకు విమర్శనాస్త్రాలు మనమే ఇచ్చినట్లవుతుందని భావిస్తున్నారు.
మేము ఏం చేయాలో చెప్పండి.. ఈసీ
రిజర్వేషన్లపై ప్రభుత్వం పాట్లు ఇలా ఉంటే, స్దానిక ఎన్నికలు ఆపాల్సిన పనిలేదని, 42శాతంలో బీసీలకు ఇప్పటికే ఉన్న 25శాతం రిజర్వేషన్లు కొనసాగిస్తూ మిగతా 17శాతం జనరల్ కేటాయించి ఎన్నికలు నిర్విహించుకోవచ్చని హైకోర్టు తీర్పులో స్పష్టం చేసిన నేపధ్యంలో ఎన్నికల కమిషన్ ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే స్దానిక ఎన్నికల నిర్వహణ ఆలస్యం జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇంకా మరిం సాగదీయడం సరికాదని భావించిన ఎన్నికల సంఘం హైకోర్టును సంప్రదించిన తరువాత ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.





















