Lok Sabha Election Results 2024 LIVE: వారణాసిలో ప్రధాని మోదీ హ్యాట్రిక్ విజయం - దేశంలోనే అత్యధిక మెజార్టీ ఎక్కడంటే?
Lok Sabha Election Results 2024: దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఏపీ, ఒడిశా అసెంబ్లీతో పాటు 543 లోక్ సభ స్థానాలకు లెక్కింపు జరగనుంది.
LIVE

Background
Lok Sabha Election Results 2024 LIVE Updates: దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఎవరి భవిష్యత్ ఏంటో తేలిపోనుంది. ఏపీలో మరో ఐదేళ్లు ఎవరి పాలించనున్నారో స్పష్టం కానుంది. ఏపీ అసెంబ్లీ, తెలంగాణ లోక్ సభతో పాటు మొత్తం 543 లోక్ సభ స్థానాలకు మంగళవారం (జూన్ 4) కౌంటింగ్ జరగనుంది. ఇప్పటికే ప్రజలు తమ తీర్పును ఈవీఎంల్లో నిక్షిప్తం చేశారు. ఏ గట్టున ఎవరో జూన్ 4న తెలిసిపోనుంది.
ప్రజల మనసులు గెలుచుకుంది ఎవరు... అధికారాన్ని స్థాపించేది ఎవరనే విషయంలో క్లారిటీ రానుంది. కేంద్రంలో ఎవరు అధికారంలోకి రానున్నారు, ప్రధాని మోదీ హ్యాట్రిక్ కొడతారా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా.. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను ఈసీ పూర్తి చేసింది. అటు, కౌంటింగ్ నేపథ్యంలో కేంద్ర బలగాలు, సహా రాష్ట్రాల పోలీసులు సైతం కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
రాయ్ బరేలీ ప్రజల రుణం తీర్చుకోలేనిది - ప్రియాంక గాంధీ
Loksabha Election Results 2024: లోక్ సభ ఎన్నికల్లో రాయబరేలీ నుంచి రాహుల్ గాంధీ గెలుపొందడంపై ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. 'మీ ప్రేమ, అభిమానంతో మరోసారి ఆశీర్వదించారు. మీ రుణం తీర్చుకోలేనిది.' అని ట్వీట్ చేశారు.
रायबरेली के परिवारीजन और मेरे प्यारे कार्यकर्ता साथियों,
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 4, 2024
आपने एक बार फिर हमें अपने स्नेह और आशीर्वाद से निहाल कर दिया है। रिश्तों का यह कर्ज़ हम कभी नहीं उतार पाएंगे, मगर हमारी पूरी कोशिश होगी कि हम आपकी सेवा में कोई कसर न छोड़ें और इस रिश्ते को हमेशा के लिए निष्ठा से क़ायम…
ఇండోర్ బీజేపీ అభ్యర్థి రికార్డ్ విక్టరీ
Loksabha Election Results 2024: ఇండోర్ బీజేపీ అభ్యర్థి లల్వాని చరిత్ర సృష్టించారు. బీఎస్పీ అభ్యర్థి సంజయ్‌పై 12,26,751 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. బీఎస్పీ అభ్యర్థికి 51,659 ఓట్లు పోల్ అయ్యాయి.
ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తాం - ప్రధాని మోదీ
Loksabha Election Results 2024: లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు. 'ప్రజలు వరుసగా మూడోసారి ఎన్డీయేపై విశ్వాసం ఉంచారు. దేశ చరిత్రలోనే ఇదో చారిత్రక ఘట్టం. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి గత దశాబ్దంలో చేసిన మంచిని కొనసాగిస్తామని హామీ ఇస్తున్నా. ఈ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలందరికీ సెల్యూట్ చేస్తున్నా.' అని పేర్కొన్నారు.
People have placed their faith in NDA, for a third consecutive time! This is a historical feat in India’s history.
— Narendra Modi (@narendramodi) June 4, 2024
I bow to the Janata Janardan for this affection and assure them that we will continue the good work done in the last decade to keep fulfilling the aspirations of…
251 స్థానాల్లో ఎన్డీయే గెలుపు - 174 స్థానాల్లో కాంగ్రెస్ విజయం
Loksabha Election Results 2024: దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే 252 స్థానాల్లో విజయం సాధించగా.. 39 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అటు, I.N.D.I.A కూటమి 174 స్థానాల్లో విజయం సాధించగా.. 26 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 46 స్థానాల్లో విజయం సాధించగా.. 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
బుధవారం I.N.D.I.A కూటమి కీలక భేటీ - రాహుల్ గాంధీ
Loksabha Election Results 2024: దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. I.N.D.I.A కూటమి తదుపరి కార్యాచరణపై బుధవారం కీలక భేటీలో చర్చించనున్నట్లు చెప్పారు. వయనాడ్, రాయ్ బరేలీ రెండు చోట్ల రాహుల్ విజయం సాధించగా.. ఏ స్థానాన్ని వదులుకోవాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని అన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

