అన్వేషించండి

Paripurnananda Swamy : రేవంత్‌ను ప్రోత్సహించారు, నన్ను పట్టించుకోలేదు : ఏబీపీ దేశంతో పరిపూర్ణానంద స్వామి

Hindu Puram : భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా ధర్మాన్ని కాపాడేందుకు హిందువే ప్రధానిగాఉండాలని పరిపూర్ణానంద స్వామి పేర్కొన్నారు.

Andhra Pradesh News : భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా ధర్మాన్ని కాపాడేందుకు హిందువే ప్రధానిగా ఉండాలని పరిపూర్ణానంద స్వామి పేర్కొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దిగేందుకు పరిపూర్ణానంద స్వామి సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏబీపీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక అంశాలను పంచుకున్నారు ఆ వివరాలు ఆయన మాటల్లోనే. 

మతాలకు అతీతంగా రిజర్వేషన్లు ఉండాలి. అసలు రిజర్వేషన్లు ఇంకెన్నాళ్లు కొనసాగిస్తారని ప్రశ్నించారు. రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని పేర్కొన్న పరిపూర్ణానంద.. దేవాలయాలను ద్వంసం చేశారు కాబట్టి రిజర్వేషన్లు ఇవ్వాలా..? అని ప్రశ్నించారు. 75 ఏళ్లుగా ఇస్తున్న రిజర్వేషన్లు ఇంకెన్నాళ్లు ఇవ్వాలి. దీపావళి పండగ చేస్తే పొల్యూషన్‌ అంటారు. గ్రామ దేవతలకు బలి ఇస్తే జంతు ప్రేమికులు బటయకు వస్తారు. మిగిలిన మత పండగల సందర్భంగా జరిగే హింస, పొల్యూషన్ వాళ్లకు గుర్తుకురాదు.  హిందూ మతం, హిందూ అనాథలా మిగలకూడదు. అదే తన అభిమతం. రాజ్యాంబద్ధంగా ధర్మాన్ని కాపాడాలి. హిందువే ప్రధానంగా ఉండాలి. హిందువు ప్రధానిగా ఉంటేనే దేశాన్ని తాకట్టు పెట్టకుండా ఉంటారు. దేశంలో రెండు రకాల ఆధార్‌ కార్డులు ఇవ్వాలి.  ఒకటి హిందూ దేశంలో పుట్టిన వాడికి, రెండోది హిందుత్వాన్ని గౌరవించే వాడికి. ఈ ధర్మం, ఈ దేశం వారసత్వ సంపద. హిందూ ధర్మాన్ని ఆచరించకపోయినా గౌరవించాలి. అని కుడంబద్దలు కొట్టారు. 

హిందుత్వవాది దేశానికి ప్రధాని కావాలి

హిందుత్వవాది దేశానికి ప్రధాని కావాలి. వివాద రహితంగా అయోధ్య ప్రస్తుతం మారింది. వ్యక్తిగత బాధలు చాలా మందికి ఉంటాయి. వ్యవస్థ, ధర్మం, చట్టం చెప్పేదే ఆచరించాలి. హిందూ సమాజం గతంతో పోలిస్తే మేల్కొంది. ముస్లింలు ప్రార్థనలు చేసే మసీదుల్లో నంది ఎందుకు ఉంటోందన్న విషయాన్ని వాళ్లే ప్రశ్నించుకోవాలి. విగ్రహారాధన లేనప్పుడు నంది ఎందుకు ఉండాలి. ఈ తరహా మసీదులను హిందువులకు అప్పగించాలి. ఈ మేరకు ప్రిపరేషన్‌ జరుగుతోంది. ఎన్నికలు ముందు మాత్రమే రాజకీయం చేయాలి. మిగిలిన సమయాల్లో ఎవడి పని వాళ్లు చేసుకోవాలి. తాను ఎప్పుడూ ప్లే గ్రౌండ్‌లో ఉంటాను. పేపర్‌లో ఉండను. తెలంగాణలో గత ఎన్నికల్లో తనను అడిగి వారి నియోజకవర్గాల్లో ప్రచారం చేశాను. తానెప్పుడూ క్రెడిట్‌ కోసం పని చేయలేదు. పోటీ చేయమని గత ఎన్నికల్లో అడిగినా తిరస్కరించాను. ఆ ఎన్నికల్లో 64 సభలు నిర్వహించా. సీఎం క్యాండిడేట్‌గా తానెప్పుడూ భావించలేదు. ఏపీని ప్రజాక్షేత్రంగా ఎనుకున్నా. రానున్న ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటా. తాను ఎక్కడ పార్టీకి అవసరం అనుకుంటే అక్కడకు వెళతాను. 2018 తెలంగాణ ఎన్నికల్లో నేను తిరిగి ఉంటే మంచి ఫలితాలు వచ్చేవి. ఎన్నికల్లో బీజేపీ వాడుకుని ఉంటే బాగుండేది. తెలంగాణలో కేసీఆర్ రేవంత్ రెడ్డిని, నన్ను ఇబ్బందులకు గురి చేశారు. కాంగ్రెస్లో చేరిన రేవంత్ రెడ్డిని వినియోగించుకుని ఆ పార్టీ మైలేజ్ పొందింది. అదే స్థాయిలో నన్ను వాడుకుంటే బీజేపీకి మంచి ఫలితాలు వచ్చి ఉండేవి. రేవంత్‌కు, నాకు ఒకేలా కేసిఆర్ ఇబ్బందులకు గురి చేశాడన్న భావన ఉందన్నారు. ఏపీలో నన్ను దింపితే మోదీకి ఉన్న విలువను తెలియజేస్తాను. ప్రతి ఇంటికి కేంద్ర ప్రభుత్వం నల్లా వేయిస్తోంది. దీన్ని స్థానిక బీజేపీ నేతలు వెళ్లి ప్రజలకు చెప్పాలి. 

హిందూ శబ్ధం వల్లే హిందూపురంలో పోటీ

హిందూ అన్న శబ్ధం ఉండడం వల్లే హిందూపురాన్ని పోటీకి ఎంచుకున్నాను. దేశంలోని 542 నియోజకవర్గాల్లో ఒక్క హిందూపురంలో తప్పా మరో నియోజకవర్గానికి హిందూ శబ్ధం లేదు. ఈ నియోజకవర్గం తీవ్రంగా వెనుకబడి ఉంది. ఈ వెనుకబాటుతనాన్ని నిర్మూలించేందుకు కేంద్రం నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇక్కడి నాయకులు కేంద్ర పెద్దలను కలవకపోవడం వల్లే ఇబ్బంది అవుతోంది. లాంగ్వేజ్‌ సమస్య, స్థానిక ముఖ్య నేతల అనుమతి లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతోంది. హిందూపురం నియోజకవర్గంలో 14 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 12 లక్షల మంది హిందువులు.. రెండు లక్షల మంది ముస్లింలు ఉన్నారు. తనకు ముస్లింలు ఓట్లు వేయరు అని కొందరు అనుకుంటున్నారు. హిందువులంతా ఓట్లేసినా గెలుస్తాను. ఇక్కడ పోటీ చేస్తానని తెలిసిన తరువాత ముస్లింలు కూడా వచ్చి కలిశారు. నేనుంటే అభివృద్ధి జరుగుతందన్న భావనను ఇక్కడి ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జాబ్‌ ఫెయిర్‌ ఏర్పాటు చేశారు. 60 కంపెనీలు వచ్చాయి. కూటమి నేతలు కలవడం కాదు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కలిసి పని చేసేలా చూడాలి.

కాంగ్రెస్‌ మాయలో 

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంటూ ఒక మాయలో పడేసింది. రాజకీయ స్వలాభం కోసం ప్రత్యేక హోదా అనే బ్రహ్మ పదార్థాన్ని కాంగ్రెస్‌ పార్టీ సృష్టించింది. దాని కోసం కొట్టుకునేలా చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే వేలాది కోట్లు రూపాయలు రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది. హిందూపురానికి బుందేల్‌ ఖండ్‌ తరహా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఇక్కడి నాయకుడు వెళ్లి అడగాలి. ఇక్కడి నేతలు అడగనప్పుడు కేంద్రం ఎందుకు ఇస్తుంది. జీవితంలో చాలెంజెస్‌ ఫేస్‌ చేయడం అంటే చాలా ఇష్టం. సవాళ్లు స్వీకరిస్తూనే విజయాలను సాధించాను. ఆరాధించే అమ్మవారి దయతో అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తాను. ఎన్నికల్లో డబ్బు, కులం శాసిస్తాయని చాలా మంది భావిస్తారు. ఇష్టమైన వ్యక్తులు విషయంలో ఈ రెండూ పని చేయవు. మిగిలిన వారితో పోలిస్తే తాను ఇక్కడ బెటర్‌ అని భావిస్తాను. కులం ఓట్లే కీలకంగా ఉంటే కాశీలో మోదీ, హిందూపురంలో ఎన్‌టీఆర్‌ గెలిచేవారు కాదు. 

ప్రకృతి పరిరక్షణకు యోగాలు

రాజకీయ నాయకుల పదవులు కోసం, వ్యక్తిగత లబ్ధి కోసం యోగాలు చేయను. ప్రకృతి పరిరక్షణకు మాత్రమే యోగం చేయాలి. ఇంట్లో యోగం చేసి.. వీధిలో ఆగం చేస్తే సరికాదు. యోగాలతో సత్ఫలితాలు వస్తాయంటే కేసీఆర్‌ ఓడిపోడు కదా. పూర్వం రాజ శ్యామల యాగాన్ని ప్రతికూల పరిస్థితుల్లో, ఆత్మ రక్షణకు, అనుకూలమైన వాటిని ధృడం చేసుకునేందుకు చేసేవారు. కానీ, ఇప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలు కోసం చేస్తున్నారు. ప్రకృతి పరిరక్షణ, లోక కల్యాణం, సమాజ ఉద్ధరణకు మాత్రమే యాగాలు చేయాలి. చంద్రబాబుతో 2013 చివరి భాగంలో పరిచయం అయింది. 2016-17లో మోదీతో విభేదించి వెళ్లినప్పుడు ఆయనతో ఉండే వ్యక్తి అడిగితే చెప్పాను. మోదీ 300 సీట్లతో వస్తారని చెప్పాను. అదే జరిగింది. 

పది ఎకరాలు ఇస్తానంటే వద్దని చెప్పా

కేసీఆర్‌తో నాకు విభేదాలు లేవు. ఆశ్రమానికి పది ఎకరాలు ఇస్తానన్నారు. కానీ, వద్దన్నారు. ప్రస్తుతం ఆ భూమి విలువ రూ.500-600 కోట్లు విలువజేస్తుంది. తెలంగాణలో అభివృద్ధికి సహకరిస్తానని చెప్పారు. బ్లూ ఫ్రింట్‌ ఇవ్వాలని అడిగారు. బీజేపీలోకి వెళతానని తెలిసిన తరువాత నన్ను బహిష్కరించారు. తానంటే కేసీఆర్‌కు అభిమానమున్నా.. బీజేపీలోకి వెళ్లిన తరువాతే గ్యాప్‌ పెరిగింది. బహిష్కరణపై కోర్టులో గెలిచాను. ఏపీలో జగన్‌కు 151 సీట్లు వచ్చాయి. ప్రధాని మోదీ, ఎన్‌టీఆర్‌, వైఎస్‌ఆర్‌కు కూడా రాలేదు. రాగద్వేషాలను పక్కనపెట్టి మూడు కోట్ల మంది తన వెనుక ఉన్నారన్న భావనతో పాలన సాగించి ఉంటే బాగుండేది. ఇప్పుడు మీటింగ్‌ల్లో మాట్లాడేటప్పుడు కూడా వ్యక్తులను టార్గెట్‌ చేస్తున్నారు. ఈ ప్రభుత్వ హయాంలో రోడ్లు దారుణంగా ఉన్నాయి. నిర్మాణ రంగం వెనుకబడింది. కొత్త కంపెనీలు లేవు. అప్పులు పెరిగాయి. అభివృద్ధి లేదు. మొండిగా వెళతానన్న భావన జగన్‌ది. ఇది అన్ని సందర్భాల్లో కరెక్ట్‌ కాదు. అమ్మమ్మతో చిన్నప్పుడు ఉండేవాడిని. అప్పుడు వంట పట్ల ఆసక్తి పెరిగింది. గురువులకు వంటలు చేసేవాడిని. రుచిగా వండడం నేర్చుకున్నా. వంట నాకు రిలాక్స్‌ను ఇస్తుంది. హాబీగా మారిపోయింది. ఒక్కపూటే భోజనం తింటాను. భోజనంలో తప్పనిసరిగా కార్బోహైడ్రేట్స్‌, న్యూట్రీసియస్‌ విలువలు, విటమిన్లు, ప్రోటీన్స్‌, ఫైబర్‌ ఉండాలి. 400 రకాల వంటలు వండతాను. వంకాయ చాలా మందిది. కేన్సర్‌కు వంకాయ ఆన్సర్‌గా పని చేస్తుందని పరిశోధనలో తేలింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
Adilabad News: ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
Jr NTR : క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ -  అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ - అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
Crime News: పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Embed widget