(Source: ECI/ABP News/ABP Majha)
Gandi Babji Back To TDP : విశాఖలో టీడీపీకి ఊరట - రాజీనామా వాసప్ తీసుకున్న కీలక నేత
Andhra Politics : సీటు దక్కలేదని టీడీపీకి రాజీనామా చేసిన గండి బాబ్జీ మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. చంద్రబాబు, లోకేష్‌ను కలిసి పార్టీకి మద్దతు ప్రకటించారు.
Gandi Babji returned to TDP : విశాఖ సౌత్ ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు అన్న అసంతృప్తితో జాబితా ప్రకటించిన రోజున టీడీపీకి రాజీనామా చేసిన గండి బాబ్జీ తన రాజీనామాను ఉపసహరించుకున్నారు. అమరావతిలో చంద్రబాబును, లోకేష్ ను కలశారు. విశాఖలో పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రయత్నం చేస్తానన్నారు. రాజీనామా చేసినప్పుడు తాను ఎమ్మెల్యేగా పోటీలో ఉంటాను ఏ పార్టీ అన్నది చెబుతాను అని మీడియా ముందు చెప్పారు.. ఆయన వైసీపీలో చేరుతారని అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. కొణతాల రామకృష్ణకు శిష్ణుడైన గండి బాబ్జీ 2014లో ఆయన పెందుర్తి నుంచి ఆ పార్టీ టికెట్ మీద వైసీపీ నుంచిపోటీ చేశారు. అనంతరం జరిగిన పరిణామాల క్రమంలో ఆయన వైసీపీని వీడారు.
టీడీపీలో ఆయనకు టిక్కెట్ లభించే అవకాశాలు కనిపించకపోవడంతో రాజీనామా చేశారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే వర్కవుట్ అవదని తేలడం.. ఇతర పార్టీల్లో కూడా టిక్కెట్ దక్కదని క్లారిటీ రావడంతో మళ్లీ టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అందుకే రాజీనామా చేసి పది రోజులు కూడా గడవకముందే గోడకు కొట్టిన బంతిలా టీడీపీ గూటికి చేరారు. ఆయనను తీసుకుని విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్ధి శ్రీభరత్ నారా లోకేష్ సమక్షంలో మరోసారి పార్టీ కండువా వేయించారు. ఇక తాను టీడీపీ విజయానికి కృషి చేస్తాను అని గండి బాబ్జీ ప్రకటించారు. నారా లోకేష్ టీడీపీ అధికారంలోకి వస్తే పదవి ఇస్తామని హామీ ఇచ్చారట. దాంతో గండి బాబ్జీ సంతృప్తి చెందారు అని అంటున్నారు.
గండి బాబ్జీ విశాఖ సౌత్ లో కొంత ఫాలోయింగ్ ఉంది. ఇపుడు ఆ సీటుని జనసేనకు ఇచ్చినా అక్కడ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. దాంతో సీనియర్ నేతగా గండి బాబ్జీని అక్కడ ఉంచితే సౌత్ సీటుతో పాటు ఎంపీ గా కూడా గెలుచుకునేందుకు వీలు ఉంటుందని శ్రీ భరత్ ఆలోచించి గండి బాబ్జీని తిరిగి పార్టీలోకి తీసుకుని వచ్చారు అని అంటున్నారు.
గత మూడేళ్లుగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి బాబ్జీగారు చేసిన కృషి మరువలేనిది. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత బాబ్జీ గారికి తగిన ప్రాధాన్యత ఉంటుంది. బాబ్జీగారితో వ్యక్తిగతంగా నాకు మంచి అనుబంధం ఉంది. ఈ అనుబంధం భవిష్యత్తులోను ఇలానే కొనసాగుతుంది. దక్షిణ నియోజకవర్గం ఇంచ్చార్జ్ గా తిరిగి బాభ్జీ గారు కోనసాగుతారు, పార్టీ కోసం కష్టపడే వ్యక్తులకు ఎప్పుడు అండగా ఉండటం నా బాధ్యత అని ఎంపీ అభ్యర్థి భరత్ ట్వీట్ చేశారు.
మిత్రపక్షాల పొత్తులో భాగంగా టిక్కెట్ కోల్పోయిన గండి బాబ్జీ గారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని లోకేష్ గారు హామీ ఇవ్వడం సంతోషంగా ఉంది. గత మూడేళ్లుగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి బాబ్జీగారు చేసిన కృషి మరువలేనిది. పార్టీ అధికారంలోకి వచ్చిన త… pic.twitter.com/PVtTwZWOCw
— Bharat Mathukumilli (@sribharatm) March 22, 2024