Assembly Elections 2022: ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో బహిరంగ ర్యాలీలకు ఈసీ అనుమతి
ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో బహిరంగ సభలపై ఎన్నికల సంఘం కాస్త ఊరట కల్పించింది. షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది.
ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తిపై ఎన్నికల సంఘం పరిశీలించింది. అక్కడ ప్రస్తుతం రిజిస్టర్ అవుతున్నకేసులు వివరాలు ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులను అడిగి తెలుసుకుంది.
కేసులు తగ్గుముఖం పడుతున్న పరిస్థితుల్లో బహిరంగ సభలకు అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించింది. గ్రౌండ్‌లో యాభై శాతానికి మించకుండా లేదా వెయ్యి మందితో పార్టీలు ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించుకోవచ్చని ఈసీ ప్రకటించింది.
ఎన్నికల సంఘం చెప్పిన ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈసీ ఆదేశాలతో ఉత్తర్‌ప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్‌లో ప్రచారం పీక్స్‌కు చేరుకోనుంది.
EC reviews projected trends of COVID pandemic in 5 poll-bound states, decides to allow physical public meetings of political parties or contesting candidates in designated open spaces with maximum of 1000 persons or 50% of the capacity of the ground with effect from today.
— All India Radio News (@airnewsalerts) February 5, 2022
రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో తొలి రెండు దశలకు అభ్యర్థులను ఆయా పార్టీలు ఖరారు చేశాయి. పార్టీ ప్రముఖలు, నేతల, మద్దతుదారుల ప్రచారానికి ప్లాన్స్ వేస్తున్నాయి. ఇలాంటి టైంలో ఈసీ ఆదేశాలు వాళ్లకు మరింత ఉత్సాహాన్నిచ్చాయి.
ప్రస్తుతానికి పార్టీలు ఇంటింటి ప్రచారం చేస్తున్నాయి. వర్చువల్‌గా కూడా ఓట్లు అభ్యర్థిస్తున్నారు నేతలు.
ఐదు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి కరోనా కేసులు పెరుగుతుండేవి. అందుకే అప్పట్లే బహిరంగ సభలు ర్యాలీలను ఎన్నికల సంఘం నిషేధించింది. ఫిబ్రవరి 11 వరకు నిషేధం విస్తూ ఉత్తర్వులు పొడిగించింది.
ఇప్పుడు కేసులు తగ్గుతున్నాయిన సమీక్షలో తేలడంతో కొంత సడలింపు ఇచ్చింది. గరిష్టంగా 1000 మంది వ్యక్తులతో ర్యాలీలకు అనుతి ఇచ్చింది. 500 మందితో ఇండోర్ సమావేశాలు నిర్వహించుకోవచ్చని పేర్కొంది.
ఇంటింటికీ ప్రచారానికి ఇరవై మందిని అనుమతించింది. కోవిడ్ పరిస్థితిపై రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులతో చర్చించిన తర్వాత ఎన్నికల సంఘం అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.