Asaduddin vs Navneet rana : 15 సెకన్లు చాలన్న నవనీత్ రాణా - గంట సమయం తీసుకోమన్న అసదుద్దీన్ ! ఈ విమర్శలకు చాలా చరిత్ర ..
Telangana Politics : నవనీత్ కౌర్, అసదుద్దీన్ మధ్య విమర్శలు చోటు చేసుకున్నాయి. గతంలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు నవనీత్ రాణా కౌంటర్ ఇవ్వడంతో వివాదం ప్రారంభమయింది.
Elections 2024 : నవనీత్ కౌర్ గా తెలుగు ప్రజలకు పరిచయమైన లీడర్ నవనీత్ రాణా. తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా చేసి మహారాష్ట్ర రాజకీయ నేతను పెళ్లి చేసుకున్నారు. తర్వాత తాను రాజకీయాల్లోకి వచ్చారు. ఈ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. బీజేపీ తరపున ప్రచారం చెయడానికి తెలంగాణకు వచ్చారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా లో బీజేపీ నేత నవనీత్‌రాణా.. ఎంఐఎం పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పదేళ్ల కిందట అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు కౌంటర్
2013లో అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 15 నిమిషాలు పోలీసులు తప్పుకుంటే 100 కోట్ల మంది హిందువుల అంతు చూస్తామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత నవనీత్ రానా కౌంటరిచ్చారు. 15 నిమిషాలు కాదు… కేవలం 15 సెకన్లలో అడ్రస్ లేకుండా చేస్తామని హెచ్చరించారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో… మళ్లీ ఎక్కడికి వెళ్తారో మీకే తెలియదంటూ వ్యాఖ్యానించారు. హైద్రాబాద్ మరో పాకిస్థాన్ కాకుండా బిజెపి అభ్యర్థి మాధవి లత అడ్డుకుటుందని ఎంపీ నవనీత్ కౌర్ తెలిపారు. నవనీత్ రాణా వ్యాఖ్యలు సోషల్ మీడియలో వైరల్ అయ్యాయి.
గట్టిగా బదులిచ్చిన అసదుద్దీన్
నవనీత్ రానా వ్యాఖ్యలకు అసదుద్దీన్ కౌంటర్ ఇచ్చారు. మీరు 15 సెకండ్లు అడుగుతున్నారు... ప్రధాని మోదీని ఒకటి అడుగుతున్నాను, గంట సమయం ఇవ్వండని కోరుతున్నానన్నారు. అప్పుడు మీలో ఎంత మానవత్వం మిగిలి ఉందో తెలుసుకోవాలనుకుంటున్నామన్నారు. ఎవరు భయపడేవాళ్లు ఉన్నారు? మేం సిద్ధంగానే ఉన్నామని వ్యాఖ్యానించారు. ప్రధాని మీవారు... ప్రభుత్వం మీది... ఆరెస్సెస్ మీది... ఎవరు ఆపుతున్నారు... ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తానని సవాల్ చేశారు. ఏం చేస్తారో చేయండన్నారు.
Aap 15 Second mein kya karenge? Kaun Darr raha hai aapse? Aap Ikhlaq, Pehlu khan, Rakbar aur Mukhtar Ansari jaisa haal karenge? Hum tayyar hain
— Asaduddin Owaisi (@asadowaisi) May 9, 2024
pic.twitter.com/lQqMDBJht3
మహారాష్ట్రలోనూ మజ్లిస్ ప్రభావం - అక్కడ కూడా హిందూత్వ వాదిగా నవనీత్
మజ్లిస్ కు మహారాష్ట్రలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నలుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ కూడా ఉన్నారు. అక్కడ ముస్లిం వర్గాల బలం మజ్లిస్ కు ఉండటంతో.. బీజేపీలో చేరిన నవనీత్ రాణా హైదరాబాద్ లో మజ్లిస్ ను టార్గెట్ చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. అదే సమయంలో హైదరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి మాధవీ లత .. గట్టి పోటీ ఇస్తున్నారు.