Convoy Attack: కేంద్రమంత్రి కాన్వాయ్‌పై దాడి- 'Z' కేటగిరీ భద్రత కల్పించిన సర్కార్
ఉత్తర్‌ప్రదేశ్ కర్హాల్ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్‌పై పోటీ చేస్తోన్న కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ బఘేల్‌కు 'Z' కేటగిరీ భద్రతను కల్పించింది కేంద్ర హోంశాఖ
కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ బఘేల్‌కు 'Z' కేటగిరీ భద్రతను కల్పించింది కేంద్ర హోంశాఖ. ఉత్తర్‌ప్రదేశ్ మెయిన్‌పురి జిల్లా కర్హాల్ నియోజకవర్గంలో సత్యపాల్ సింగ్ కాన్వాయ్‌పై కొందరు దాడి చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది హోంశాఖ.
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌కు ప్రత్యర్థిగా కర్హాల్ నియోజకవర్గంలో బఘేల్ పోటీ చేస్తున్నారు. దీంతో బఘేల్‌పై దాడికి కారణం ఎస్పీ గూండాలేనని భాజపా ఆరోపించింది.
ఈ దాడి జరిగిన 4 రోజుల ముందే అంటే ఫిబ్రవరి 11నే బఘేల్‌కు 'Z' కేటగిరీ భద్రతను కల్పించాలని కేంద్రం నిర్ణయించినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొంది. అంతకుముందు బఘేల్‌కు 'Y+' కేటగిరీ భద్రత ఉండేది.
హత్యానేరం
కర్హాల్ పోలీస్ స్టేషన్‌లో కేంద్రమంత్రి బఘేల్ హత్యానేరం కింద కేసులు పెట్టారు. కబ్‌రాయి నుంచి కర్హాల్ వెళ్లే సమయంలో తన కాన్వాయ్‌పై సమాజ్‌వాదీ కార్యకర్తలు మాటు వేసి దాడి చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎస్పీపై ఆరోపణలు
श्री अखिलेश यादव जी चुनाव में हार के डर से आपने अपने पालतू गुंडों के द्वारा भाजपा प्रत्याशी केन्द्रीय मंत्री प्रोफ़ेसर SP सिंह बघेल और भाजपा नेताओं पर हमला करवाते हो,आपने हमला नहीं अपनी पराजय सुनिश्चित की है,क्या यही नई सपा है जो आपके ख़िलाफ़ चुनाव लड़े उस पर हमला कराओगे!
— Keshav Prasad Maurya (@kpmaurya1) February 15, 2022
ఈ ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందించారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకులే దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఎస్పీ పార్టీ నిజ స్వరూపాన్ని ఇప్పుడు అందరూ చూశారని ట్వీట్ చేశారు. భాజపా ఎంపీ గీతపై సోమవారం దాడి జరిగిందని మౌర్య తెలిపారు. ఈ రెండు ఘటనలకు సంబంధించిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతోనే అఖిలేశ్ యాదవ్ ఇలాంటి పనులు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: New Road Safety Rules: బండిపై పిల్లల్ని తీసుకెళ్తున్నారా? అయితే ఇక ఈ రూల్స్ పక్కా
Also Read: Ravidas Jayanti 2022: పంజాబ్ ఎన్నికల వేళ ప్రధాని మోదీ భక్తి పారవశ్యం!