అన్వేషించండి

Devineni Uma: దేవినేని ఉమాతో కాంగ్రెస్‌ చర్చలు - పోటీకి ఆఫర్‌?

Andhrapradesh Politics: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత దేవినేని ఉమాపై కాంగ్రెస్‌ పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Congress Talks With Devineni Uma: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత దేవినేని ఉమాపై కాంగ్రెస్‌ పార్టీ కన్నేసినట్లు తెలుస్తోంది. అధికార వైసీపీ, తెలుగుదేశం పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలను కాంగ్రెస్‌లోకి ఆ పార్టీ నాయకులు ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని ఆ పార్టీ నేతలు చెబుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్న వారు ఎక్కువగా వైసీపీకి చెందిన వారే ఉన్నారు. మిగిలిన పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలపైనా కాంగ్రెస్‌ దృష్టి సారించినట్టు సమాచారం. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావును పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలిసింది. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల సూచన మేరకు కీలక నేతలు రంగంలోకి దిగి దేవినేనితో చర్చలు జరుపుతున్నట్టు చెబుతున్నారు. చర్చలు సఫలం అయితే ఒకటి, రెండు రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీలో చేరికపై దేవినేని స్పష్టత ఇచ్చే అవకాశముంది. 

అసంతృప్తిలో దేవినేని.?

దేవినేని ఉమా మహేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నేత. గత ప్రభుత్వ హయంలో మంత్రిగా కూడా పని చేశారు. గడిచిన ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసిన దేవినేని తన ప్రత్యర్థి వసంత కృష్ణ ప్రసాద్‌పై ఓటమి చెందారు. ఓటమి పాలైనప్పటికీ రాజకీయంగా యాక్టివ్‌గానే ఉమా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో తనపై గెలిచిన వసంత కృష్ణ ప్రసాద్‌పైనా అంతే స్థాయిలో విమర్శలు గుప్పించారు. వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగానూ పలుమార్లు విమర్శలు చేసుకున్నారు. అయితే, అనూహ్యంగా వసంత కృష్ణ ప్రసాద్‌ తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. గత ఎన్నికల్లో గెల్చిన మైలవరం టికెట్‌ను పొందారు. ఇదే ఇప్పుడు మాజీ మంత్రి దేవినేని ఆగ్రహానికి కారణమైంది. తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నేతగా, అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెలిగే తనకే టికెట్‌ కేటాయించకపోవడం పట్ల దేవినేని అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకానొక దశలో పార్టీని వీడేందుకు సిద్ధపడ్డారు. మళ్లీ వెనక్కి తగ్గారు. కానీ, పార్టీ మార్పుపై ఆయన పునరాలోచిస్తున్నట్టు తెలిసింది. అదే ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ చర్చలకు కారణమైనట్టు చెబుతున్నారు. 

కీలక నేతలు రంగంలోకి

పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలా రెడ్డి సూచనలు మేరకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావును పార్టీలోకి తీసుకువచ్చేందుకు చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్న ఒక సీనియర్‌ నేతకు దేవినేని సన్నిహితంగా ఉంటారు. సదరు నేత ద్వారానే కాంగ్రెస్‌ పార్టీ ఈ చర్చలను సాగిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేయాలంటూ సదరు నేతలు రాయబారం చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీని గెలిపించే బాధ్యతలను దేవినేని భుజస్కందాలపై పెట్టేందుకు సదరు కాంగ్రెస్‌ నేతలు హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. కాంగ్రెస్‌లో చేరికపై ఆలోచిస్తున్న దేవినేని ఒకటి రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. దేవినేని వంటి సీనియర్‌ నేత పార్టీని వీడితో మాత్రం తెలుగుదేశం పార్టీకి కొంత ఇబ్బందికరంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. చూడాలి దేవినేని ఉమా మహేశ్వరరావు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో. 

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Embed widget