AP News: కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులుగా 15 మంది నియామకం
Congres party spokespersons list released : కాంగ్రెస్ పార్టీలోని కీలక విభాగాలను బలోపేతం చేసే దిశగా అధిష్టానం చర్యలు చేపడుతోంది. 15 మంది అధికార ప్రతినిధులతో జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.
Congres Party Spokespersons List Released : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు జోరందుకున్నాయి. అధిష్టానం కూడా పార్టీని బలోపేతం చేయడం పై దృష్టి సారించింది. షర్మిలకు పూర్తిస్థాయిలో సహకారాన్ని అందిస్తున్న అధిష్టానం.. పార్టీలోని కీలక విభాగాలను బలోపేతం చేసే దిశగా చర్యలను చేపడుతోంది. అందులో భాగంగానే సోమవారం 15 మంది అధికార ప్రతినిధులతో ఒక జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.
ఇదీ అధికార ప్రతినిధుల జాబితా..
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమితులైన వారిలో కొలు జిల్లాలకు చెందిన నేతలు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి చింతాడ దిలీప్, విజయనగరం జిల్లా నుంచి మువ్వల శ్రీనివాసరావు, విశాఖపట్నం జిల్లా నుంచి గూనూరు వెంకటరావు, తూర్పుగోదావరి జిల్లా నుంచి పర్వతి శివ గణేష్, పశ్చిమగోదావరి జిల్లా నుంచి సోడదాసి గంగయ్య, కృష్ణాజిల్లా నుంచి రాణి మేకల సతీష్, గుంటూరు జిల్లా నుంచి డబ్బుగొట్టు రామకృష్ణ, ప్రకాశం జిల్లా నుంచి శ్రీపతి సతీష్, నెల్లూరు జిల్లా నుంచి సురేష్ బాబు, అనంతపురం జిల్లా నుంచి పి రాంభూపాల్ రెడ్డి, వైయస్సార్ కడప జిల్లా నుంచి ఎన్డి విజయ జ్యోతి, కర్నూలు జిల్లా నుంచి వూకోట శ్రీనివాసులు, బాపట్ల నుంచి తాడికొండ వెంకటేశ్వరరావు, విశాఖపట్నం నుంచి ఏబీఎన్ వర్మ నియమితులయ్యారు.