Elections 2024 : పోస్టల్ బ్యాలెట్లపై సీఈవో ఆదేశాలు కరెక్టే - వైసీపీ అభ్యంతరాలు తోసిపుచ్చిన సీఈసీ
Anhdra Politics : పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో వైసీపీ అభ్యంతరాలను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. సీఈవో ఆదేశాలు సరైనవేనని స్పష్టం చేసింది.
Andhra Postal Ballots Issue : పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో వైసీపీ నేతలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీ అభ్యంతరాలపై ఈసీ రిప్లై ఇచ్చింది. డిక్లరేషన్ పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి, సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేస్తూ లేఖ పంపింది. పోస్టల్ బ్యాలెట్లను వాలీడ్ చేయాలని రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు జారీ చేిసంది. ఏపీ సీఈవోకు లేఖ రాసిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు.
ఈసీకి ఈ మెయిల్ ఫిర్యాదు పంపిన ఎంపీ నిరంజన్ రెడ్డి
వైసీపీ ఎంపీ నిరంజన్ రె్డి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిఇటీవల ఇచ్చిన ఆదేశాలను పునఃసమీక్షించాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు ఎస్.నిరంజన్ రెడ్డి సీఈసీకు బుధవారం ఈమెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశారు. అటెస్టింగ్ అధికారుల నమూనా సంతకాలను సేకరించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడం వల్ల చెల్లుబాటు అయ్యే పోస్టల్ బ్యాలెట్లు తిరస్కరణకు గురవుతాయని, ఎన్నికల ప్రక్రియ సమగ్రతకు భంగం వాటిల్లుతుందని నిరంజన్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ పత్రాలపై సంతకాలు చేసిన అటెస్టింగ్ అధికారుల నమూనా సంతకాల సేకరణకు సంబంధించి మే 25న జారీ చేసిన ఆదేశాలు గతంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నాయని ఈసీఐ ఏర్పాటు చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తక్షణమే సమీక్షించి పునఃసమీక్షించాలని కోరారు.
సీఈవో మీనా ఇచ్చిన ఆదేశాలు ఇవీ
ఆర్వో సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్స్ చెల్లుబాటవుతాయి. 'ఫామ్ 13ఏ'పై ఆర్వో సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలి. అలా ఉండి స్టాంప్ లేకపోయినా ఆ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుంది. ఆర్వో సంతకంతో పాటు బ్యాలెట్ ధ్రువీకరించే రిజిస్టర్‌తో సరిపోల్చుకోవాలి. ఫామ్ 13ఏలో ఓటరు, ఆర్వో సంతకం, బ్యాలెట్ సీరియల్ నెంబర్ లేకుంటే వాటిని తిరస్కరించవచ్చు. అలాగే, పోస్టల్ బ్యాలెట్ పేపర్‌పై నిబంధనల ప్రకారం ఓటు నమోదు చేయకపోయినా, ఆ ఓటు తిరస్కరించవచ్చు.' అని ఈసీ పేర్కొంది. పోస్టల్ బ్యాలెట్‌ను తిరస్కరించాల్సిన పరిస్థితి వస్తే లోపలి కవర్ తెరవకుండా తిరస్కరించాలని, అది కూడా ఫారం-13ఏలోని డిక్లరేషన్, ఫారం-13సీ లోని కవర్ బీ లోపల కనిపించని పక్షంలో తిరస్కరించవచ్చంటూ ఈసీ సూచించింది. అలాగే డిక్లరేషన్‌పై ఓటర్లు సక్రమంగా సంతకం చేయకపోయినా, లోపభూయిష్టంగా ఉన్నా తిరస్కరించవచ్చని తెలిపింది. అంతేతప్ప ఆర్వో సంతకానికి, బ్యాలెట్ చెల్లుబాటుకి సంబంధం లేదని స్పష్టం చేసింది.
హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్
సీఈసీ అభ్యంతరాలను తోసిపుచ్చినట్లుగా తెలియడంతో వైసీపీ వెంటనే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. నిబందనలు ఒక్క ఏపీకే అమలు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.