Adilabad Counting arrangements : ఆదిలాబాద్‌లో సమస్యల్లేకుండా కౌంటింగ్ - పక్కా ఏర్పాట్లు చేసిన అధికారులు
Counting Day : ఆదిలాబాద్‌లో సమస్యలు లేకుండా కౌంటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది.
Adilabad counting : ఆదిలాబాద్ జిల్లాలో కౌంటింగ్‌కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 4 న నిర్వహించనున్న లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా శుక్రవారం అదిలాబాద్ జిల్లాలో మూడు కేంద్రాలైన టీటీడీసి, సోషల్ వెల్ఫేర్ స్కూల్, సంజయ్ గాంధీ పాల్ టెక్నికల్ కాలేజ్ లలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారి పూర్తి చేశారు. జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఇసిఐ నియమ నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం కౌంటింగ్ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. చిన్న పొరపాటు కూడా జరగకూడదని హె్చచరించారు.
పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి జూన్ 4 వ తేదీన అదిలాబాద్ జిల్లాలోని కౌంటింగ్ కేంద్రాలలో కొనసాగే కౌంటింగ్ ప్రక్రియలో ఎక్కడ కూడా పొరపాట్లకు తావివ్వకుండా, ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాలన్నారు. కౌంటింగ్ లో ఎలాంటి జాప్యం లేకుండా సమన్వయంతో పనిచేయాలని, కౌంటింగ్ కేంద్రాల వద్ద సంబంధిత ఏఆర్వోలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ కేంద్రాలలో గట్టి బందోబస్తుతో పాటు బారికెడ్స్, ఎన్నికల కౌంటింగ్ కు వచ్చే అధికారులు, సిబ్బందికి మౌళిక వసతులు కల్పించాలని, త్రాగునీరు ఏర్పాటు, టాయిలెట్స్, వైద్య సిబ్బంది మెడికల్ కిట్ తో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
కౌంటింగ్ కేంద్రాలలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు స్ట్రాంగ్ రూమ్ ల వద్దకు ఇతరులను అనుమతించరాదని స్పష్టం చేశారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద రౌండ్ ది క్లాక్, మూడంచెల పటిష్ట భద్రత, సిసి కెమెరాల పర్యవేక్షణ పై ఆరా తీశారు.
సిట్టింగ్ స్థానం చేజారకుండా... బీజేపీ ప్రయత్నం చేస్తోంది, అదిలాబాద్ ( పార్లమెంటు సీటును ఎలాగైనా రెండోసారి కైవసం చేసుకోవడానికి బీజేపీ కృషి చేస్తోంది. ఎట్టి పరిస్థితులలో రెండోసారి పాగా వేయడానికి కసరత్తు చేస్తుంది. అదేవిధంగా ఆదివాసి గోండులను(Gond) కాంగ్రెస్ (Congress)తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రతి కార్యక్రమాన్ని ఆదిలాబాద్ నుంచి ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఓటర్లను ఆకర్షించే పనిలో ఉన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆదివాసి కావడంతో స్థానిక ఓట్లు కాంగ్రెస్ వైపే వస్తాయని ఆశిస్తున్నారు. మరోవైపు అదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ బీజేపీ టికెట్ ఆశించి భంగపడడం ఎస్టీ లంబాడలకు ప్రధాన పార్టీలు టికెట్ ఇవ్వకపోవడంతో రెబల్ గా పోటీలో నిల్చోని లంబాడ ఓట్లను, జనరల్ ఓట్లను చీల్చే ప్రయత్నం చేశారు. ఆయన చీల్చే ఓట్లు ఎవరికి నష్టం చేస్తాయన్నది రాజకీయవర్గాలకు అంతుబట్టడం లేదు.