News
News
X

Mosquitoes: చలికాలంలో దోమలు ఎక్కడికి వెళ్తాయి?

Mosquitoes: దోమలు రక్తం పీలుస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే అవి ఎందుకు రక్తం తాగుతాయి. వేసవి కాలంలో కంటే శీతాకాలంలో ఎందుకు తక్కువగా ఉంటాయి అనే విషయాలు తెలుసుకుందాం.

FOLLOW US: 

Mosquitoes: దోమలు రక్తాన్ని పీలుస్తాయని అందరికీ తెలిసిన విషయమే. కాలంతో సంబంధం లేకుండా దోమలు వస్తూనే ఉంటాయి. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా కుడుతూనే ఉంటాయి. అయితే వేసవి కాలంలో ఎక్కువగా ఉండే దోమలు.. చలికాలం వచ్చేసరికి తక్కువగా కనపడతాయి. అసలు దోమలు రక్తాన్ని ఎందుకు పీలుస్తాయి? శీతాకాలంలో ఎందుకు తక్కువగా ఉంటాయి? దోమలపై శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ఫలితాలు ఏంటి? వీటన్నింటికీ జవాబులు ఈ కథనంలో చూద్దాం.

మొదట్లో దోమలకు రక్తం తాగే అలవాటు లేదు. ఈ మార్పు నెమ్మదిగా వచ్చింది. దోమలు జీవించడానికి మనుషులలాగే నీరు అవసరం. వేసవి కాలంలో వాటికి, వాటి సంతానానికి నీరు లభించనప్పుడు అవి మానవులు, జంతువుల రక్తం తాగడం ప్రారంభించాయి. అందుకనే ఎండాకాలంలో అవి ఎక్కువగా ఉంటాయి. .

దోమలపై అధ్యయనం 

న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఆఫ్రికాలోని ఈడిస్ ఈజిప్ట్ దోమలపై అధ్యయనం చేశారు. ఇవి జికా వైరస్, డెంగ్యూ, పసుపు జ్వరం కలిగించే దోమలు. న్యూ సైంటిస్ట్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం, ఆఫ్రికాలోని దోమలలో అనేక రకాల ఈడిస్ ఈజిప్ట్ దోమలు నివసిస్తాయి. ఈ జాతి దోమలన్నీ రక్తం తాగవు. 

News Reels

ఆఫ్రికాలోని సబ్-సహారా ప్రాంతంలోని 27 ప్రాంతాల నుంచి ఈడిస్ ఈజిప్ట్ దోమ గుడ్లను తీసుకుని వాటి నుంచి దోమలు బయటకు వచ్చేలా చేశామని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ పరిశోధకుడు నోహ్ రోస్ చెప్పారు. వాటిని మనుషులు నివసించే చోట, లాక్ చేసిన కంపార్ట్ మెంట్లలో వదిలేసి.. అవి రక్తం తాగే విధానాన్ని పరిశీలించామని తెలిపారు. దీని ద్వారా ఈడిస్ ఈజిప్ట్ దోమల జాతుల ఆహార విధానం గురించి తెలిసిందని చెప్పారు. 

దోమల్లో రక్తం తాగే మార్పు కొన్ని వేల సంవత్సరాల క్రితమే వచ్చింది. పెరుగుతున్న నగరాల కారణంగా దోమలు నీటి కొరతతో పోరాడటం ప్రారంభించాయి. చివరికి మనుషులు, జంతువుల రక్తాన్ని తాగడం మొదలుపెట్టాయి. అయితే, మనుషులు నీటిని నిల్వ చేసే చోట అనాఫిలిస్ దోమలకు (మలేరియా దోమ) ఎలాంటి సమస్య ఉండదు. కూలర్లు, పడకలు, కుండలు వంటి ప్రదేశాలలో అవి  సౌకర్యవంతంగా పునరుత్పత్తి చేస్తాయి. నీటి లభ్యత లేనప్పుడు రక్తం తాగేందుకు మనుషులు, జంతువులపై దాడిచేస్తాయి. 

Published at : 02 Nov 2022 04:09 PM (IST) Tags: mosquito Mosquito story special story on Mosquitos Article on Mosquiots

సంబంధిత కథనాలు

స్మార్ట్‌వాచ్‌లు సేఫా లేక డేంజరా? ఇంతకూ నిపుణులు ఏం అంటున్నారు.!

స్మార్ట్‌వాచ్‌లు సేఫా లేక డేంజరా? ఇంతకూ నిపుణులు ఏం అంటున్నారు.!

డోపింగ్‌ టెస్ట్‌ అంటే ఏమిటి.? ఈ టెస్ట్‌ చేసేటప్పుడు బట్టలన్నీ విప్పేయాలా?

డోపింగ్‌ టెస్ట్‌ అంటే ఏమిటి.? ఈ టెస్ట్‌ చేసేటప్పుడు బట్టలన్నీ విప్పేయాలా?

GATE Exam Centers: 'గేట్' అభ్యర్థులకు 'గ్రేట్' న్యూస్, పెరిగిన పరీక్ష కేంద్రాలు - ఆ జిల్లాల్లోనూ సెంటర్లు!

GATE Exam Centers: 'గేట్' అభ్యర్థులకు 'గ్రేట్' న్యూస్, పెరిగిన పరీక్ష కేంద్రాలు - ఆ జిల్లాల్లోనూ సెంటర్లు!

KNRUHS BDS Counselling: ఎంబీబీఎస్, బీడీఎస్‌ రెండో విడత కౌన్సెలింగ్‌, ఆప్షన్లు ఇచ్చుకోండి!

KNRUHS BDS Counselling: ఎంబీబీఎస్,  బీడీఎస్‌ రెండో విడత కౌన్సెలింగ్‌,  ఆప్షన్లు ఇచ్చుకోండి!

OU Phd: వెబ్‌సైట్‌లో ఓయూ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లు, పరీక్ష షెడ్యూలు ఇదే!

OU Phd: వెబ్‌సైట్‌లో ఓయూ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లు, పరీక్ష షెడ్యూలు ఇదే!

టాప్ స్టోరీస్

Medaram Mini Jatara : వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మేడారం మినీ జాతర

Medaram Mini Jatara : వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మేడారం మినీ జాతర

AP New CS Jawahar Reddy: ఏపీ సీఎస్‌గా జవహర్ రెడ్డి నియామకం, ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్

AP New CS Jawahar Reddy: ఏపీ సీఎస్‌గా జవహర్ రెడ్డి నియామకం, ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్

Green Signal To Sharmila Padayatra : షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ - వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని షరతు !

Green Signal To Sharmila Padayatra :   షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ - వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని షరతు !

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు