అన్వేషించండి

MP Quota in KV’s: కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా సీట్ల పునరుద్ధరణ, ఊహాగానాలపై కేంద్రం క్లారిటీ ఇలా!

కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఎంపీ కోటాను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రతిపాదనేదీ పరిశీలనలో లేదు అని కేంద్రమంత్రి అన్నపూర్ణాదేవి స్పష్టం చేశారు..

కేంద్రీయ విద్యాలయాల ప్రవేశాల్లో ఎంపీ కోటాను గతేడాది కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల(కేవీ) ప్రవేశాల్లో ఎంపీ కోటాను మళ్లీ పునరుద్ధరిస్తున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. అలాంటి ప్రతిపాదనేదీ లేదని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి సోమవారం (ఆగస్టు 7) రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో స్పష్టం చేశారు.

''కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఎంపీ కోటాను పునరుద్ధరించాలనే ప్రతిపాదన ఏదీ లేదు. రక్షణ, పారా మిలిటరీ, కేంద్ర స్వయంప్రతిపత్తి సంస్థలు, పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌టేకింగ్స్‌, సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ వంటి కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే సిబ్బంది తరచూ బదిలీలపై వెళ్తుంటారు. కాబట్టి, వారి పిల్లల చదువుకు ఆటంకం కలగకుండా దేశవ్యాప్తంగా ఒకే విధమైన విద్యను నేర్చుకునేందుకు వీలుగా కేవీలను ప్రారంభించారు. కేవీల్లో ప్రవేశాలకు ఎంపీ సహా ఇతర కోటాలను అనుమతించడం వల్ల తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా సెక్షన్‌కు 40 మంది విద్యార్థుల కంటే సంఖ్య పెరిగిపోతోంది. ఇది బోధనపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అందుకే వాటిని రద్దు చేశాం. ఎంపీ కోటాను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రతిపాదనేదీ పరిశీలనలో లేదు'' అని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు విద్యార్థులను సిఫార్సు చేసే పలు కోటాలను కేంద్రం గతేడాది ఏప్రిల్‌లో రద్దు చేసింది. ఇందులో ఎంపీ కోటా కూడా ఉంది. వీటిని తొలగించడం వల్ల కేంద్రీయ విద్యాలయాల్లో ఆయా కోటాల పరిధిలో ఉన్న 40 వేలకు పైగా సీట్లు సాధారణ విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 వందల కేవీలు ఉన్నాయి. వీటిల్లో 14.35 లక్షల విద్యార్థులు చదువుతున్నారు. గతేడాది వరకు ఒక్కో ఎంపీ 10 మంది పిల్లల చొప్పున 788 మంది ఎంపీలు 7,880 మంది విద్యార్థులను సిఫార్సు చేసే వీలుండేది. జిల్లా మేజిస్ట్రేట్‌లకు కూడా 17 మంది విద్యార్థులను సిఫార్సు చేసే అధికారం ఉండేది. మరోవైపు విద్యా మంత్రిత్వ శాఖ ఉద్యోగుల పిల్లలు, ఎంపీల పిల్లలు, మనవళ్లు, కేంద్రీయ విద్యాలయాల విశ్రాంత ఉద్యోగుల సంతానం, స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్‌ కోటా.. ఇలా వివిధ కోటాల్లో ప్రత్యేక ప్రవేశాలను కల్పించేవారు. వీటన్నింటినీ కేంద్రం రద్దు చేసింది.

వారికి మాత్రమే వెసులుబాటు..
అయితే జాతీయ శౌర్య పురస్కార గ్రహీతల పిల్లలకు, రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌ ఉద్యోగుల సంతానానికి, విధి నిర్వహణలో మరణించిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు, కళల్లో ప్రత్యేక ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే కోటాలను మాత్రం కొనసాగించనుంది. కొవిడ్‌ కారణంగా అనాథలైన పిల్లలను కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ప్రత్యేకంగా పరిగణించాలని కేంద్రం నిర్ణయించింది. విద్యార్థుల గరిష్ఠ సంఖ్య దాటినా వీరికి ప్రవేశాలు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం జిల్లా మేజిస్ట్రేట్‌ ఇచ్చే జాబితా ఆధారంగా ఒక్కో కేంద్రీయ విద్యాలయంలో 10 మంది పిల్లలకు ప్రవేశం కల్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా 1200 కేవీల్లో 14.35లక్షల మందికి పైగా విద్యార్థులు అభ్యసిస్తున్నారు.

ALSO READ:

ఆర్‌ఐఎంసీలో 8వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!
డెహ్రాడూన్‌‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌(ఆర్‌ఐఎంసీ)లో ఎనిమిదో తరగతి (2024 జులై సెషన్) ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్థానిక బాలురు, బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, వైవా, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్న విద్యార్థులు అక్టోబరు 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. వీరికి డిసెంబరు 2న ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.
ప్రవేశాల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

కాళోజీ వర్సిటీలో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కోర్సు, డిగ్రీ అర్హత చాలు
తెలంగాణలో మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (ఎంపీహెచ్‌) కోర్సులో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లను భర్తీ చేస్తారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి 13 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్‌ ఆధారిత ప్రవేశపరీక్షను ఆగస్టు 27న నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 2న ఫలితాలు వెల్లడించనున్నారు. 
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget