Fake University List By UGC: దేశంలో 21 నకిలీ యూనివర్సిటీలు - జాబితాను విడుదల చేసిన యూజీసీ!
ఈ ఫేక్ యూనివర్సిటీలకు విద్యార్థులకు డిగ్రీలు ఇచ్చే అధికారం లేదని యూజీసీ తెలిపింది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే యూజీసీ ఫేక్ వర్సిటీల జాబితాను విడుదల చేసింది.
Fake University List By UGC: భారత్‌లో ప్రస్తుతం 21 నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తెలిపింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చట్టం – 1956కు వ్యతిరేకంగా దేశంలో 21 వర్సిటీలు పనిచేస్తున్నాయని తెలిపింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యూనివర్సిటీ కూడా ఉండడం గమనార్హం. ఈ యూనివర్సిటీలకు విద్యార్థులకు డిగ్రీలు ఇచ్చే అధికారం లేదని యూజీసీ తెలిపింది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే యూజీసీ ఫేక్ వర్సిటీల జాబితాను విడుదల చేసింది.
దేశంలో ఉన్న ఫేక్ యూనివర్సిటీల జాబితాను విడుదల చేస్తూ యూజీసీ ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటన ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర/ ప్రావిన్షియల్ చట్టం ప్రకారం ఏర్పడిన యూనివర్సిటీలు లేదా డీమ్డ్-టు-బి యూనివర్సిటీలు మాత్రమే డిగ్రీలను ప్రదానం చేయడానికి అర్హత ఉంది. అలాగే, ప్రత్యేకించి పార్లమెంట్ చట్టం ద్వారా అధికారం పొందిన సంస్థలు కూడా విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తాయని యూజీసీ తెలిపింది. యూజీసీ తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో 8, ఉత్తరప్రదేశ్‌లో 4, పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో రెండు చొప్పున నకిలీ వర్సిటీలు ఉన్నాయి. అలాగే కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో ఫేక్ వర్సిటీ ఉంది.
రాష్ట్రాలవారీగా ఫేక్ వర్సిటీలు ఇవే..
ఆంధ్రప్రదేశ్: క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ.
ఢిల్లీ: కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్ (AIIPPHS), యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, ఏడీఆర్(ADR)-సెంట్రిక్ జ్యూరిడికల్ యూనివర్సిటీ, వొకేషనల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ (స్పిరిట్చువల్ యూనివర్సిటీ), విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్.
ఉత్తరప్రదేశ్: గాంధీ హిందీ విద్యాపీఠం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, భారతీయ శిక్షా పరిషత్.
ఒడిశా: నార్త్ ఒరిస్సా అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ, నవభారత్ శిక్షా పరిషత్ యూనివర్సిటీ.
వెస్ట్ బెంగాల్: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్.
కర్ణాటక: బడగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ ఆఫ్ కర్ణాటక.
కేరళ:సెయింట్ జాన్స్ యూనివర్సిటీ- కిషనట్టం
మహారాష్ట్ర: రాజా అరబిక్ యూనివర్సిటీ- నాగ్‌పూర్
పుదుచ్చేరి: శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్
Also Read
UPSC: అభ్యర్థులకు యూపీఎస్సీ గుడ్‌న్యూస్, ‘వన్‌టైమ్ రిజిస్ట్రేషన్’ వచ్చేసింది!
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుభవార్త తెలిపింది. ఇకపై యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు దరఖాస్తు చేసుకొనే, అభ్యర్థులు ఇకపై ప్రతిసారి తమ వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేదు. అభ్యర్థుల సౌకర్యార్థం వన్‌టైమ్ రిజిస్ట్రేషన్(ఓటీఆర్) విధానాన్ని యూపీఎస్సీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓటీఆర్ వేదికపై ఒకసారి వ్యక్తిగత సమాచారం, ఇతర వివరాలు రిజస్ట్రేషన్ చేసుకుంటే చాలు. వేర్వేరు పరీక్షలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నప్పుడు ఓటీఆర్ నంబర్ తెలియజేస్తే సరిపోతుంది. వారి వివరాలన్నీ దరఖాస్తు పత్రంలో ప్రత్యక్షమవుతాయి. దీనివల్ల అభ్యర్థులకు సమయం ఆదా కావడంతోపాటు దరఖాస్తుల ప్రక్రియ మరింత సులభతరంగా మారుతుందని, దరఖాస్తుల్లో పొరపాట్లకు అవకాశం ఉండదని యూపీఎస్సీ వర్గాలు వెల్లడించాయి. ఓటీఆర్‌లో నమోదు చేసుకున్న అభ్యర్థుల సమాచారం యూపీఎస్సీ సర్వర్లలో భద్రంగా ఉంటుందని తెలిపాయి. ఆన్‌లైన్ దరఖాస్తు పత్రంలో ఈ ఓటీఆర్ నంబర్ నమోదు చేస్తే 70 శాతం దరఖాస్తును పూర్తిచేసినట్లే. యూపీఎస్సీ నిర్వహించే అన్నిపరీక్షలకు ఓటీఆర్ ఉపయోగపడుతుంది. https://www.upsc.gov.in/ లేదా https://upsconline.nic.in/ వెబ్‌సైట్ల ద్వారా ఎప్పుడైనా సరే ఓటీఆర్‌లో అభ్యర్థులు తమ వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని యూపీఎస్సీ ఒక ప్రకటనలో సూచించింది.