విద్యార్థులకు యూజీసీ గుడ్ న్యూస్, విదేశాల్లో మాదిరి చదువుకుంటూనే పార్ట్ టైమ్ జాబ్స్!
ఉన్నత విద్యా సంస్థల్లో 'EWYL' పథకం త్వరలో ప్రారంభంకానుంది. తద్వారా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు తమ చదువులను కొనసాగించుకోవడానికి అవసరమైన డబ్బును సమకూర్చుకోగలుగుతారని (యూజీసీ) తెలిపింది.
విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్థులు ఒక వైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారు. వారి తల్లిదండ్రులు ఎంత ధనికులైనా అక్కడి విద్యార్థులకు ఇలా పార్ట్ టైం జాబ్ చేయడం అనేది వారి కరిక్యులమ్‌లో ఓ భాగంగా ఉంటుంది. దీనివల్ల వారికి సంపాదన విలువ తెలియడమే గాక.. ఇండిపెండెంట్‌గా ఉండే స్వభావం అలవాటవుతుందని అక్కడి విద్యాసంస్థలు భావిస్తుంటాయి. ఇప్పుడు మనదేశంలోనూ ఇదే విధానాన్ని అమలు చేయడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కార్యచరణ సిద్ధం చేస్తోంది.
ఉన్నత విద్యా సంస్థల్లో 'నేర్చుకుంటూనే సంపాదించండి (EWYL)' పథకం త్వరలో ప్రారంభంకానుంది. తద్వారా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు తమ చదువులను కొనసాగించుకోవడానికి అవసరమైన డబ్బును సమకూర్చుకోగలుగుతారని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) తెలిపింది. ఉన్నత విద్యా సంస్థల ప్రాంగణాల్లోని వివిధ విభాగాల్లో చేరిన విద్యార్థులకు పార్ట్‌టైమ్ ఉద్యోగాలను కల్పించడానికి సంబంధించిన ప్రతిపాదనలను యూజీసీ రూపొందించింది.
దీనిప్రకారం విద్యార్థులు వారానికి 20 గంటల పాటు, నెలలో 20 రోజులు తాత్కాలిక ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతించాలని, అందుకు ఇవ్వాల్సిన ప్రతిఫలాన్ని నిర్ణయిస్తూ.. ముసాయిదా మార్గదర్శకాలను (డ్రాఫ్ట్ గైడ్‌లైన్స్) యూజీసీ తయారు చేసింది. విద్యార్థుల సేవలు వినియోగించుకునేందుకు వీలుకల్పించే వాటి జాబితాలో పరిశోధనా ప్రాజెక్టులకు సహాయం పడటం, గ్రంథాలయాల్లో పనులు, కంప్యూటర్ సేవలు, డేటా ఎంట్రీ, ప్రయోగశాలల్లో చేయూతనందించడం వంటివి ఉన్నాయి. అర్హులైన విద్యార్థులను ఎంపిక చేసి వారికి వంతుల వారీగా ఆయా పనులు కేటాయిస్తారు.
దేశంలో ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషిస్తూ తమ పిల్లలను చదివించే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ సమస్య నుంచి కొంతవరకు ఈ పథకం ఉపశమనం కలిగించేలా ఉంది. దీని వల్ల ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు కుటంబానికి భారం కాకుండా తమ చదువులు కొనసాగించుకోవడానికి అవసరమైన డబ్బులను సంపాదించగలుగుతారు.
ముసాయిదా మార్గదర్శకాలు (డ్రాఫ్ట్ గైడ్‌లైన్స్)..
Also Read:
ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీ రద్దు! జీవో జారీ చేసిన ప్రభుత్వం!
తెలంగాణ ఎంసెట్‌లో ఈసారి నుంచి ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేస్తూ విద్యాశాఖ బుధవారం (ఏప్రిల్ 19) ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ఎంసెట్‌లో వచ్చిన మార్కులతోనే ర్యాంకు కేటాయించనున్నారు. ఇప్పటివరకు ఎంసెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్‌లోని భాషేతర సబ్జెక్టులకు... అంటే 600 మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు కేటాయించేవారు. ఇక నుంచి ఇంటర్ మార్కులతో సంబంధం లేకుండానే ఎంసెట్‌లో స్కోర్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. జేఈఈ మెయిన్, నీట్‌లలోనూ ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఎత్తివేశారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
మాతృభాషలో పరీక్షలు రాయనివ్వండి, వర్సిటీలకు యూజీసీ ఛైర్మన్ లేఖ!
ఉన్నత విద్యాసంస్థల్లో మాతృభాషల వినియోగాన్ని ప్రోత్సహించాలని యూజీసీ ఛైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్ కుమార్ దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులను కోరారు. విద్యార్థులు ఇంగ్లిష్ మాధ్యమంలో చదువుతున్నప్పటికీ వారికి మాతృభాషలో పరీక్షరాసేందుకు అనుమతివ్వాలని సూచించారు. అలాగే వివిధ భాషల్లో ఉన్న ప్రామాణిక పుస్తకాలను మాతృభాషల్లోకి అనువదించి, యూనివర్సిటీల్లో బోధన, అభ్యాస ప్రక్రియల్లో స్థానికభాషను ఉపయోగించాలని కోరారు. ఈ మేరకు బుధవారం(ఏప్రిల్ 19) ఆయన అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులకు లేఖ రాశారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..