అన్వేషించండి

UGC NET 2023: యూజీసీ నెట్- 2023 దరఖాస్తుకు అక్టోబరు 28తో ముగియనున్న గడువు, ఫీజు చెల్లింపు గడువు ఇదే!

దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ (డిసెంబరు)-2023 దరఖాస్తు గడువు అక్టోబరు 29తో ముగియనుంది.

దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ (డిసెంబరు)-2023 నోటిఫికేషన్‌ను సెప్టెంబరు 30న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసిన సంగతి తెలిసిందే. యూజీసీనెట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 30న ప్రారంభంకాగా..  అక్టోబరు 28తో దరఖాస్తు గడువు ముగియనుంది. అయితే అక్టోబరు 29న రాత్రి 12 గంటల్లోపు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. 

కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రకటించిన షెడ్యూలు డిసెంబరు 6 నుంచి 22 వరకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో రెండు షిఫ్టుల్లో పరీక్ష ఉంటుంది. మొదటి షిఫ్టులో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, రెండో షిఫ్టులో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.

వివరాలు..

* యూజీసీ నెట్ - డిసెంబరు 2023

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: జేఆర్‌ఎఫ్ పోస్టులకు 30 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎలాంటి వయోపరిమితి లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్-రూ.1,150; ఈడబ్ల్యూఎస్/ఓబీసీ(నాన్-క్రిమిలేయర్)-రూ.600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్స్-రూ.325 చెల్లించాలి.

పరీక్ష విధానం..

➥ ఆన్‌లైన్ (సీబీటీ) విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి మూడు గంటల సమయం ఉంటుంది.

➥ పేపర్-1కు గంట, పేపర్-2 కు రెండు గంటల సమయం ఉంటుంది. పేపర్-1 లో 100 మార్కులకుగాను 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైవర్‌జెంట్ థింకింగ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

➥ పేపర్-2లో 200 మార్కులకుగాను 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అభ్యర్థుల ఆప్షనల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.

తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, సికింద్రాబాద్, హయత్‌నగర్, జగిత్యాల, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్. 

ఏపీలో పరీక్ష కేంద్రాలు: అమరావతి, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు-చిత్తూరు, తిరుపతి, ఏలూరు, గూడురు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, నర్సరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తూర్పుగోదావి-సూరంపాలెం, పశ్చిమగోదావరి-తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

ముఖ్యమైన తేదీలివే..

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 30.09.2023.

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 28.10.2023 (5.00 PM) 

➥ ఫీజు చెల్లించడానికి చివరితేది: 29.10.2023 (11.50 PM) 

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 30 - 31.10.2023 (11.50 PM) 

➥ ఎగ్జామ్ సిటీ వివరాల వెల్లడి: నవంబరు చివరి వారంలో.

➥ అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్: డిసెంబరు మొదటి వారంలో.

➥ యూజీసీ నెట్-డిసెంబరు 2023 పరీక్షలు: 06.12.2023 - 22.12.2023. 

➥ ఆన్సర్ కీ వెల్లడి: తర్వాత తెలియజేస్తారు.

Notification

Online Application

Website

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Liquor Scam News:  లిక్కర్ స్కాంలో పోలీసులతో గేమ్ ఆడుతున్న నిందితులు - ఎన్ని నోటీసులిచ్చినా ఒక్కరూ రారే - సీఐడీ ఎం చేయబోతోంది ?
లిక్కర్ స్కాంలో పోలీసులతో గేమ్ ఆడుతున్న నిందితులు - ఎన్ని నోటీసులిచ్చినా ఒక్కరూ రారే - సీఐడీ ఎం చేయబోతోంది ?
Waqf Bill:  వక్ఫ్  చట్టంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం - స్టేటస్ కో విధింపు
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం - స్టేటస్ కో విధింపు
AP DSC 2025: ఏపీలో టెట్‌తో కలిపి డీఎస్సీ ఉంటుందా? ఈసారి అప్లికేషన్‌లో చేస్తున్న మార్పులేంటో తెలుసా?
ఏపీలో టెట్‌తో కలిపి డీఎస్సీ ఉంటుందా? ఈసారి అప్లికేషన్‌లో చేస్తున్న మార్పులేంటో తెలుసా?
Shine Tom Chacko: హోటల్‌లో డ్రగ్స్ కోసం పోలీసుల తనిఖీలు - పారిపోయిన 'దసరా' మూవీ విలన్?
హోటల్‌లో డ్రగ్స్ కోసం పోలీసుల తనిఖీలు - పారిపోయిన 'దసరా' మూవీ విలన్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mitchell Starc vs Yashasvi Jaiswal in IPL 2025 | స్టార్క్ వర్సెస్ జైశ్వాల్  | ABP DesamAxar Patel Kuldeep Yadav vs RR | IPL 2025 లో ఢిల్లీ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న అక్షర్, కుల్దీప్DC vs RR Super Over Failure | IPL 2025 లో తొలి సూపర్ ఓవర్..చేతులారా నాశనం చేసుకున్న RRMitchell Starc vs Yashasvi Jaiswal | IPL 2025 లో కొనసాగుతున్న స్టార్క్ వర్సెస్ జైశ్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Liquor Scam News:  లిక్కర్ స్కాంలో పోలీసులతో గేమ్ ఆడుతున్న నిందితులు - ఎన్ని నోటీసులిచ్చినా ఒక్కరూ రారే - సీఐడీ ఎం చేయబోతోంది ?
లిక్కర్ స్కాంలో పోలీసులతో గేమ్ ఆడుతున్న నిందితులు - ఎన్ని నోటీసులిచ్చినా ఒక్కరూ రారే - సీఐడీ ఎం చేయబోతోంది ?
Waqf Bill:  వక్ఫ్  చట్టంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం - స్టేటస్ కో విధింపు
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం - స్టేటస్ కో విధింపు
AP DSC 2025: ఏపీలో టెట్‌తో కలిపి డీఎస్సీ ఉంటుందా? ఈసారి అప్లికేషన్‌లో చేస్తున్న మార్పులేంటో తెలుసా?
ఏపీలో టెట్‌తో కలిపి డీఎస్సీ ఉంటుందా? ఈసారి అప్లికేషన్‌లో చేస్తున్న మార్పులేంటో తెలుసా?
Shine Tom Chacko: హోటల్‌లో డ్రగ్స్ కోసం పోలీసుల తనిఖీలు - పారిపోయిన 'దసరా' మూవీ విలన్?
హోటల్‌లో డ్రగ్స్ కోసం పోలీసుల తనిఖీలు - పారిపోయిన 'దసరా' మూవీ విలన్?
Pawan Kalyan: పవన్ కల్యాణ్ గోశాల పర్యటన క్యాన్సిల్ - తిరుమల టూర్ కూడా వాయిదా !
పవన్ కల్యాణ్ గోశాల పర్యటన క్యాన్సిల్ - తిరుమల టూర్ కూడా వాయిదా !
Mediclaim News: హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నవారి సూపర్ గుడ్ న్యూస్ - గంటలో మెడిక్లెయిమ్  అప్రూవల్ - మూడు గంటల్లో క్లెయిమ్ !
హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నవారి సూపర్ గుడ్ న్యూస్ - గంటలో మెడిక్లెయిమ్ అప్రూవల్ - మూడు గంటల్లో క్లెయిమ్ !
Discount on iPhone: ఐఫోన్ 15ని చవకగా కొనే ఛాన్స్‌ - చాలా ఫోన్ల మీద గ్రేట్‌ డీల్స్
ఐఫోన్ 15ని చవకగా కొనే ఛాన్స్‌ - చాలా ఫోన్ల మీద గ్రేట్‌ డీల్స్
KTR News: HCU భూ వివాదంపై రేవంత్ రెడ్డిని విచారిస్తారా? లేదా? కేంద్రాన్ని ప్రశ్నించిన కేటీఆర్
HCU భూ వివాదంపై రేవంత్ రెడ్డిని విచారిస్తారా? లేదా? కేంద్రాన్ని ప్రశ్నించిన కేటీఆర్
Embed widget