అన్వేషించండి

TS TET-2024: రేపటి నుంచి తెలంగాణ 'టెట్' పరీక్షలు, అభ్యర్థులకు మార్గదర్శకాలు ఇవే

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET 2024) ఆన్‌లైన్ రాతపరీక్షలు మే 20 నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.

Telangana TET 2024 Exam: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET 2024) ఆన్‌లైన్ రాతపరీక్షలు మే 20 నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో మే 20 నుంచి 29 వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా మే 30 నుంచి జూన్ 2 వరకు పేపర్-1 పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు రెండు సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. టెట్ పరీక్షల కోసం 2,86,386 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-1కి 99,958 మంది దరఖాస్తు చేసుకోగా.. పేపర్-2కి 1,86,428 మంది దరఖాస్తులు సమర్పించారు. 

పరీక్ష విధానం: టెట్ పరీక్షలకు సంబంధించి 150 మార్కులకు పేపర్-1, 150 మార్కులకు పేపర్-2 నిర్వహించనున్నారు. ఒక్కో పేపరులో 150 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1లో 5 విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగంలో 30 ప్రశ్నలు- 30 మార్కులు కేటాయించారు. ఇక పేపర్-1లో 4 విభాగాలు ఉంటాయి. వీటిలో మొదటి మూడు విభాగాల్లో 30 ప్రశ్నలు- 30 మార్కులు, నాలుగో విభాగానికి 60 ప్రశ్నలు - 60 మార్కులు కేటాయించారు. పరీక్షల్లో అర్హత మార్కులను 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 40 శాతంగా నిర్ణయించారు.

తెలంగాణ టెట్ 2024 హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

TS TET - 2024 పరీక్షల షెడ్యూల్ ఇలా..

➥ మే 20: పేప‌ర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (సెష‌న్ 1)

➥ మే 20: పేప‌ర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (సెష‌న్ 2)

➥ మే 21: పేప‌ర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (సెష‌న్ 1)

➥ మే 21: పేప‌ర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (సెష‌న్ 2)

➥ మే 22: పేప‌ర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (సెష‌న్ 1)

➥ మే 22:  పేప‌ర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (సెష‌న్ 2)

➥ మే 24: పేప‌ర్-2 సోష‌ల్ స్టడీస్(మైన‌ర్ మీడియం)(సెష‌న్ 1)

➥ మే 24: పేప‌ర్-2 సోష‌ల్ స్టడీస్ (సెష‌న్ 2)

➥ మే 28: పేప‌ర్-2 సోష‌ల్ స్టడీస్ (సెష‌న్ 1)

➥ మే 28: పేప‌ర్-2 సోష‌ల్ స్టడీస్ (సెష‌న్ 2)

➥ మే 29:  పేప‌ర్-2 సోష‌ల్ స్టడీస్ (సెష‌న్ 1)

➥ మే 29: పేప‌ర్-2 సోష‌ల్ స్టడీస్ (సెష‌న్ 2)

➥ మే 30: పేప‌ర్-1 (సెష‌న్ 1)

➥ మే 30: పేప‌ర్-1 (సెష‌న్ 2)

➥ మే 31: పేప‌ర్-1 (సెష‌న్ 1)

➥ మే 31: పేప‌ర్-1 (సెష‌న్ 2)

➥ జూన్ 1: పేప‌ర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (మైన‌ర్ మీడియం)(సెష‌న్ 1)

➥ జూన్ 1: పేప‌ర్-1(మైన‌ర్ మీడియం) (సెష‌న్ 2)

➥ జూన్ 2: పేప‌ర్-1 (సెష‌న్ 1)

➥ జూన్ 2: పేప‌ర్-1 (సెష‌న్ 2)

అభ్యర్థులు మార్గదర్శకాలు..

➥టెట్ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. 

➥ నిర్ణయించిన తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 9.00 నుంచి 11.30 గంటల వరకు మొదటి విడత, మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 4.30 గంటల వరకు రెండో విడతలో పరీక్షలు జరుగుతాయి. 

➥ బయోమెట్రిక్‌ విధానం అమల్లో ఉన్నందున అభ్యర్థులను పరీక్ష ప్రారంభానికి గంటన్నర (90 నిమిషాల) ముందు నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 

➥ పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రం గేట్‌ను మూసివేస్తారు. అభ్యర్థులను ఉదయం విడతకు 8.45 గంటలకు, మధ్యాహ్నం విడతకు 1.45 గంటలకే గేట్‌ను అధికారులు మూసివేస్తారు.

➥ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ఫొటో గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.

➥ అభ్యర్థులు బ్లాక్‌/బ్లూ బాల్‌ పాయింట్‌ పెన్ను తీసుకెళ్లాలి. 

➥కాలిక్యులేటర్లు, లాగరిథమ్‌ టేబుళ్లు, పేజర్‌, సెల్‌ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులను అనుమతించరు.

➥ అభ్యర్థులు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Maharashtra News: మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో కొత్త తరహా మోసం- తాపీ మేస్త్రీలే టార్గెట్‌గా పన్నాగం
ఆదిలాబాద్ జిల్లాలో కొత్త తరహా మోసం- తాపీ మేస్త్రీలే టార్గెట్‌గా పన్నాగం
Srikakulam Latest News: తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
Embed widget