అన్వేషించండి

TS POLYCET 2023 Toppers: తెలంగాణ పాలిసెట్ ఫలితాల్లో టాపర్లు వీరే! విభాగాలవారీగా వివరాలు ఇలా!

పాలిసెట్ ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో సూర్యాపేటకు చెందిన సురభి శరణ్య 119 మార్కులతో టాపర్​గా నిలిచింది. ఎంబైపీసీ విభాగంలో జయశంకర్ భూపాలపల్లికి చెందిన చీర్ల ఆకాశ్ (116 మార్కులు) మొదటి ర్యాంకులో నిలిచాడు.

తెలంగాణలో పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘పాలిసెట్‌-2023’ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మే 26న ఉదయం 11 గంటలకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌, కార్యదర్శి డాక్టర్ శ్రీనాథ్ ఫలితాలను  విడుదల చేశారు. పరీక్షలు ముగిసిన ఎనిమిది రోజుల్లోనే ఫలితాలు ప్రకటించడం విశేషం. పాలిసెట్ పరీక్ష ఫలితాల్లో 82.17 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఎంపీసీ విభాగంలో 85.73 శాతం, ఎంబైపీసీ స్ట్రీమ్‌లో 86.63 శాతం ఉత్తీర్ణతతో అమ్మాయిలు సత్తా చాటారు. ఇక ఎంపీసీ స్ట్రీమ్‌లో 78.61 శాతం మంది, ఎంబైపీసీ విభాగంలో 78.62 శాతం మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు.

పాలిసెట్ ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో సూర్యాపేటకు చెందిన సురభి శరణ్య 119 మార్కులతో టాపర్​గా నిలిచింది. తర్వాత సూర్యాపేటకే చెందిన షేక్ అబుబకర్ సిద్ధికి 119 మార్కులతో రెండో స్థానంలో నిలిచారు. ఇక మెదక్‌కు చెందిన గౌడిచర్ల ప్రియాంశ్ కుమార్ (118 మార్కులు), హైదరాబాద్‌కు చెందిన ప్రొద్దటూరి ప్రనీత్(118 మార్కులు), కైరోజు శశివధన్ (118 మార్కులు) వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచారు.

పాలిసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..

ఇక ఎంబైపీసీ విభాగంలో జయశంకర్ భూపాలపల్లికి చెందిన చీర్ల ఆకాశ్ (116 మార్కులు) మొదటి ర్యాంకులో, సూర్యాపేటకు చెందిన విద్యార్థులు మిర్యాల అక్షయ తార (116 మార్కులు), కైరోజు శశివధన్ (116 మార్కులు), కన్న ఉజ్వన్ (116 మార్కులు) వరసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులను కైవసం చేసుకున్నారు. ఇక కరీంనగర్‌కు చెందిన వి. ప్రీతి 5వ స్థానంలో నిలిచింది.

పాలిసెట్-2023 ఎంపీసీ స్ట్రీమ్ టాపర్లు..

TS POLYCET 2023 Toppers: తెలంగాణ పాలిసెట్ ఫలితాల్లో టాపర్లు వీరే! విభాగాలవారీగా వివరాలు ఇలా!TS POLYCET 2023 Toppers: తెలంగాణ పాలిసెట్ ఫలితాల్లో టాపర్లు వీరే! విభాగాలవారీగా వివరాలు ఇలా!TS POLYCET 2023 Toppers: తెలంగాణ పాలిసెట్ ఫలితాల్లో టాపర్లు వీరే! విభాగాలవారీగా వివరాలు ఇలా!TS POLYCET 2023 Toppers: తెలంగాణ పాలిసెట్ ఫలితాల్లో టాపర్లు వీరే! విభాగాలవారీగా వివరాలు ఇలా!

పాలిసెట్-2023 ఎంబైపీసీ స్ట్రీమ్ టాపర్లు..

TS POLYCET 2023 Toppers: తెలంగాణ పాలిసెట్ ఫలితాల్లో టాపర్లు వీరే! విభాగాలవారీగా వివరాలు ఇలా!TS POLYCET 2023 Toppers: తెలంగాణ పాలిసెట్ ఫలితాల్లో టాపర్లు వీరే! విభాగాలవారీగా వివరాలు ఇలా!TS POLYCET 2023 Toppers: తెలంగాణ పాలిసెట్ ఫలితాల్లో టాపర్లు వీరే! విభాగాలవారీగా వివరాలు ఇలా!TS POLYCET 2023 Toppers: తెలంగాణ పాలిసెట్ ఫలితాల్లో టాపర్లు వీరే! విభాగాలవారీగా వివరాలు ఇలా!

మే 17న ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల వ‌ర‌కు పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 1,05,742 మంది దరఖాస్తు చేసుకోగా.. 98,273 మంది  పరీక్షకు అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల‌తో పాటు వ్యవ‌సాయ‌, ఉద్యాన‌వ‌న, వెట‌ర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం ఈ పరీక్ష నిర్వహించారు.

పాలిసెట్‌లో ఉత్తీర్ణులైన‌వాళ్లు ఇంజినీరింగ్, నాన్–ఇంజినీరింగ్, టెక్నాల‌జీ సంబంధిత‌ డిప్లొమా కోర్సుల్లో నేరుగా ప్రవేశాలు పొందవచ్చు. ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్ క‌ళాశాల్లో చ‌దువుకునే వీలుంది. అగ్రిక‌ల్చర్ డిప్లొమా, సీడ్ టెక్నాల‌జీ, ఆర్గానిక్ అగ్రిక‌ల్చర్ కోర్సుల‌ను ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ యూనివ‌ర్సిటీ, శ్రీ కొండా ల‌క్ష్మణ్ తెలంగాణ స్టేట్ యూనివ‌ర్సీటీలు అందిస్తున్నాయి.

వేర్వేరు ర్యాంకులు..
పాలిసెట్‌ ప్రవేశాలకు సంబంధించి ప్రతి అభ్యర్థికి రెండు వేర్వేరు ర్యాంకులను తయారు చేస్తారు. టెక్నికల్‌ పాలిటెక్నిక్, అగ్రికల్చర్‌ అండ్‌ వెటర్నరీ డిప్లొమాగా ర్యాంకుల జాబితాను రూపొందించి ప్రవేశాలను కల్పిస్తారు.

అర్హత మార్కులు..

➥ పాలిటెక్నిక్స్ కోర్సుల్లో ప్రవేశం కోసం 120 మార్కులలో 30 శాతం (గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి) అంటే 36 మార్కులు.

➥ వ్యవసాయ పాలిటెక్నిక్స్, వెటర్నరీ పాలిటెక్నిక్స్ కోర్సుల్లో ప్రవేశం కోసం 120 మార్కులలో 30 శాతం (గణితం (60/2), బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిసి) అంటే, 36 మార్కులు త‌ప్పనిసరిగా స్కోర్ చేయాలి.

Also Read:

తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ ప్రవేశాలు, దరఖాస్తు ప్రారంభం!
తెలంగాణ‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం(ఆంగ్ల మాధ్యమం)లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ వెలువడింది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మే 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాలలో బాలికలకు భోజన, వసతి సౌకర్యం కల్పిస్తారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, సీఏ, టీపీటీ, సీఎస్ తదితర పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఒక్కో దాంట్లో 40 సీట్లు ఉంటాయి.
ప్రవేశాలకు సంబంధించిన వివరాల కోసం క్లిక్ చేయండి..

ఏపీ మైనార్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మూడు ఏపీ మైనార్టీ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరంలో సీట్ల భర్తీకి సంబంధించిన ఏపీఆర్‌జేసీ(మైనార్టీ) సెట్‌-2023 నోటిఫికేషన్ వెలువడింది. గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. అర్హులైన మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన విద్యార్థులు జూన్‌ 28 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024 CSK vs LSG: లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
షర్మిలకు ఈసీ షాక్, వివేకా హత్య కేసులో నోటీసులు
షర్మిలకు ఈసీ షాక్, వివేకా హత్య కేసులో నోటీసులు
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Balakrishna Assets: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Lucknow Super Giants vs Chennai Super Kings Highlights | లక్నో ఆల్ రౌండ్ షో.. చెన్నై ఓటమి | ABPBrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్Revanth Reddy on KCR | కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ టచ్ చేస్తే షాక్ ఇస్తానంటున్న రేవంత్ రెడ్డిEatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024 CSK vs LSG: లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
షర్మిలకు ఈసీ షాక్, వివేకా హత్య కేసులో నోటీసులు
షర్మిలకు ఈసీ షాక్, వివేకా హత్య కేసులో నోటీసులు
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Balakrishna Assets: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Apple Vs Whatsapp: వాట్సాప్‌కు యాపిల్ చెక్ - యాప్ స్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
వాట్సాప్‌కు యాపిల్ చెక్ - యాప్ స్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
Mahindra Scorpio: భారీగా తగ్గిన స్కార్పియో వెయిటింగ్ పీరియడ్ - ఇప్పుడు ఎంతకు వచ్చిందంటే?
భారీగా తగ్గిన స్కార్పియో వెయిటింగ్ పీరియడ్ - ఇప్పుడు ఎంతకు వచ్చిందంటే?
Baak: బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
Embed widget