PECET Result: నేడు పీఈసెట్ ఫలితాలు వెల్లడి, ఇక్కడ చూసుకోండి!
అండర్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశానికి రాష్ట్రవ్యాప్తంగా 6 కేంద్రాల్లో సెప్టెంబరు 21న ఫిజికల్ పరీక్షలు నిర్వహించారు.
తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్) 2022 ఫలితాలు సెప్టెంబరు 24న వెలువడనున్నాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, మహత్మాగాంధీ వీసీ సీహెచ్ గోపాల్‌రెడ్డి మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు.
ఫలితాల కోసం వెబ్‌సైట్: https :// pecet.tsche.ac. in
అండర్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (యూజీడీపీఈడీ), బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశానికి రాష్ట్రవ్యాప్తంగా 6 కేంద్రాల్లో సెప్టెంబరు 21న ఫిజికల్ ఈవెంట్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 3,659 మంది దరఖాస్తు చేసుకోగా 2,340 మంది హాజరయ్యారు.
సెప్టెంబరు 21న ఉదయం 7 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. ఒకే రోజు పురుషులకు, మహిళలకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించారు. సెట్ చైర్మన్‌గా ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ సీహెచ్.గోపాల్‌రెడ్డి, కన్వీనర్‌గా ఎంజీయూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డీన్ ప్రొఫెసర్ వి.సత్యనారాయణ వ్యవహరిస్తున్నారు.
పరీక్ష నిర్వహించిన కేంద్రాలివే..
1) మహాత్మాగాంధీ యూనివర్సిటీ, నల్లగొండ
2) శ్రీకృష్ణ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, శ్రీనాథపురం, అనుముల మండలం, నల్లగొండ జిల్లా
3) ఎంఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి జిల్లా
4) సిద్దార్థ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, వినోభానగర్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా
5) వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, బొల్లికుంట, వరంగల్ అర్బన్ జిల్లా
6) వేదా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, కొండపాక, సిద్దిపేట.
Also Read:
ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్యతేదీలివే!
తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ సెప్టెంబరు 19న విడుదలైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబర్ 10 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. ఐసెట్-2022 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబరు 10 నుంచి 13 వరకు ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. అక్టోబర్ 10 నుంచి 15వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదుకు అవకాశం కల్పించారు. ఇక వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు అక్టోబరు 18న ఎంబీఏ, ఎంసీఏ అభ్యర్థులకు మొదటి విడుదల సీట్లు కేటాయించనున్నారు. అక్టోబరు 23 నుంచి ఐసెట్ తుదివిడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబరు 23 నుంచి 25 వరకు తుదివిడుత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. అక్టోబరు 28న ఎంబీఏ, ఎంసీఏ తుదివిడుత సీట్ల కేటాయిస్తారు. ఇక అక్టోబరు 28 రోజునే స్పాట్ అడ్మిషన్ల కోసం అధికారులు మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.
ఐసెట్ పూర్తి కౌన్సెలింగ్ షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
Also Read:
జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంబీఏ పార్ట్‌టైమ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 17 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 15 నుంచి 17 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
మొత్తం సీట్ల సంఖ్య: 330 సీట్లు
- ఎంటెక్(ఎలక్ట్రికల్ పవర్ ఇంజినీరింగ్): 30 సీట్లు
- ఎంటెక్(పవర్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రియల్ డ్రైవ్స్): 30 సీట్లు
- ఎంటెక్(ఇంజినీరింగ్ డిజైన్): 30 సీట్లు
- ఎంటెక్(ఎంబెడెడ్ సిస్టమ్స్): 30 సీట్లు
- ఎంటెక్(కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్): 30 సీట్లు
- ఎంటెక్(ఇండస్ట్రియల్ మెటలర్జీ): 30 సీట్లు
- ఎంటెక్(బయో టెక్నాలజీ): 30 సీట్లు
- ఎంటెక్(ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్): 30 సీట్లు
- ఎంటెక్(వాటర్ రిసోర్సెస్ ఇంజినీరింగ్): 30 సీట్లు
- ఎంటెక్(రిమోట్ సెన్సింగ్, జీఐఎస్): 30 సీట్లు
- ఎంబీఏ(హెచ్ఆర్/ ఫైనాన్స్/ మార్కెటింగ్/ ఎంటర్ప్రెన్యూర్షిప్): 30 సీట్లు
కోర్సులు, ముఖ్యమైన తేదీల కోసం క్లిక్ చేయండి..