అన్వేషించండి

Engineering Fee: ఇంజినీరింగ్‌ ఫీజుల పంచాయితీ మళ్లీ మొదటికి, తేలేదెన్నడు?

ఇంజినీరింగ్ ఫీజులు ఖరారు కాకపోవడంతో సెప్టెంబర్ 28 నుంచి మొదలుకావాల్సిన ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌ను వాయిదా వేద్దామన్న ఆలోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో ఇంజినీరింగ్ ఫీజుల విషయమై మరోసారి పీఠముడి పడింది. తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) విచారణ పూర్తికావడంతో సెప్టెంబర్ 24న జరిగే కమిటీ సమావేశంలో చర్చించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని చెప్పినా సాధ్యం కాలేదు. కమిటీ ఖరారు చేసిన ఫీజును 25 కళాశాలలు అంగీకరించకపోవడంతో మళ్లీ ఆ కాలేజీలను పిలిచి విచారణ జరపాలని నిర్ణయించారు.


సమావేశంలో కమిటీ ఖరారు చేసిన ఫీజులను సీబీఐటీ, నారాయణమ్మ, వర్ధమాన్, శ్రీనిధి, వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి, కేఎంఐటీ, స్టాన్లీ, మల్లారెడ్డి, సీఎంఆర్ గ్రూపుల్లోని కొన్ని కలిపి మొత్తం 25 కళాశాలలు అంగీకరించలేదు. ఆ కాలేజీలు హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నాయి. అదే జరిగితే ఇప్పట్లో ఫీజుల వ్యవహారం తేలదు. విద్యార్థులు గందరగోళానికి గురవుతారు. అందుకే కళాశాలల అభ్యంతరాలు మరోసారి విని... పరిశీలించాలని కమిటీ నిర్ణయించింది. ఇంతకు ముందు నిర్ణయించిన ఫీజులకు 25 తప్ప మిగిలిన 148 కళాశాలలు అంగీకరించాయి.


రుసుముల మార్పు మళ్లీ తప్పదా?
25 కళాశాలల ఫీజులపై విచారణ జరపాలని నిర్ణయించినందున కొన్ని కళాశాలల రుసుములు మళ్లీ మారే అవకాశం ఉంది. పెద్ద మొత్తంలో కాకున్నా స్వల్పంగా అయినా ఫీజు పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఉదాహరణకు సీబీఐటీకి రూ.14 కోట్ల మిగులు నిధులున్నాయని.. గత జులైలో ఖరారు చేసిన రూ.1.73 లక్షల ఫీజును రూ.1.12 లక్షలకు తగ్గించారు. ఆ కళాశాల యాజమాన్యం మాత్రం గతంలో హైకోర్టు సూచన మేరకు వసూలు చేసినవి కూడా అందులో ఉన్నాయని, వాటిని మినహాయించాలని కోరుతున్నట్లు తెలిసింది. అలాంటి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.


రెండో విడత ఎంసెట్ కౌన్సెలింగ్ వాయిదాకు అవకాశం!
ఇంజినీరింగ్ ఫీజులు ఖరారు కాకపోవడంతో సెప్టెంబర్ 28 నుంచి మొదలుకావాల్సిన ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌ను వాయిదా వేద్దామన్న ఆలోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్గతంగా సమాలోచనలు జరుగుతున్నట్లు సమాచారం. దీనివల్ల ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న జోసా కౌన్సెలింగ్‌లో సీట్లు పొందే విద్యార్థులకు కూడా ఊరట కలుగుతుంది.


Read Also:

Pragathi Scholarship: మహిళా 'ప్రతిభ'కు చేయూత 'ప్రగతి' స్కాలర్‌షిప్‌!! దరఖాస్తు చేసుకోండి, అర్హతలివే!
మహిళలను సాంకేతిక విద్యలో ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘ప్రగతి స్కాలర్‌షిప్‌’  నోటిఫికేషన్‌ వెలువడింది.  ‘ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ)’ ఏటా ఈ ఉపకారవేతనం అందిస్తోంది. డిప్లొమా, డిగ్రీ కోర్సులు చదువుతున్న అర్హులైన అమ్మాయిలకు ఈ స్కీమ్ కింద ఆర్థికసాయం అందిస్తారు. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు మించకూడదు.  ఒక కుటుంబం నుంచి ఇద్దరు అమ్మాయిలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. సరైన అర్హతలున్న మహిళలు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాలి. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా స్కాలర్‌షిప్ అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
స్కాలర్‌షిప్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

బీఎస్సీ-నర్సింగ్, బీపీటీ కోర్సులకు దరఖాస్తు చేసుకోండి, పూర్తి వివరాలు ఇలా!
బీఎస్సీ నర్సింగ్, పీబీబీఎస్సీ నర్సింగ్, బీపీటీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సెప్టెంబర్ 22న ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేస్తారు. నాలుగేళ్ల డిగ్రీ కోర్సు బీఎస్సీ నర్సింగ్, రెండేళ్ల డిగ్రీ కోర్సు పోస్ట్ బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్, ఫిజియోథెరపీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
ప్రవేశ ప్రకటన, అర్హతల వివరాల కోసం క్లిక్ చేయండి..

 

జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంబీఏ పార్ట్‌టైమ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 17 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 15 నుంచి 17 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
కోర్సులు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

 

జాతీయ సంస్కృత వర్సిటీలో డిగ్రీ కోర్సులు, వివరాలు ఇలా!
తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం 2022-23 విద్యా సంవత్సరానికి రెగ్యులర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సీయూఈటీ - 2022 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబరు 2 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆన్‌లైన్ విధానంలో అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.  
కోర్సులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

 

విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
IRCTC Compensation : ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Embed widget