KNRUHS Admissions: బీఎస్సీ-నర్సింగ్, బీపీటీ కోర్సులకు దరఖాస్తు చేసుకోండి, పూర్తి వివరాలు ఇలా!
కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సెప్టెంబర్ 22న ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను దీని ద్వారా భర్తీ చేస్తారు.
![KNRUHS Admissions: బీఎస్సీ-నర్సింగ్, బీపీటీ కోర్సులకు దరఖాస్తు చేసుకోండి, పూర్తి వివరాలు ఇలా! Kaloji Narayana Rao University of Health Sciences has released notification for admissions into BPT, B.Sc NURSING, P.B.B.Sc courses KNRUHS Admissions: బీఎస్సీ-నర్సింగ్, బీపీటీ కోర్సులకు దరఖాస్తు చేసుకోండి, పూర్తి వివరాలు ఇలా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/23/74efcbc9cbdaf0f2ae94a554fe0913a51663882266066522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
బీఎస్సీ నర్సింగ్, పీబీబీఎస్సీ నర్సింగ్, బీపీటీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సెప్టెంబర్ 22న ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేస్తారు. నాలుగేళ్ల డిగ్రీ కోర్సు బీఎస్సీ నర్సింగ్, రెండేళ్ల డిగ్రీ కోర్సు పోస్ట్ బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్, ఫిజియోథెరపీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 23 ఉదయం 9 నుంచి అక్టోబర్ 3న సాయంత్రం 6 గంటల వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. విద్యార్థులకు దరఖాస్తు సమయంలో ఏమైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే 9392685856, 7842542216 నంబర్లలో సంప్రదించవచ్చు. అలానే నిబంధనలు 9490585796, 8500646769 నెంబర్లలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల లోపు సంప్రదించవచ్చు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ చూడవచ్చు.
* కోర్సుల వివరాలు..
1) బీపీటీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపి)
2) నాలుగేళ్ల బీఎస్సీ(నర్సింగ్)
3) రెండేళ్ల పోస్ట్ బేసిక్ బీఎస్సీ (నర్సింగ్) డిగ్రీ కోర్సు
అర్హతలు:
* నాలుగేళ్ల బీఎస్సీ(నర్సింగ్) కోర్సు కోసం ఇంటర్ (బైపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
* రెండేళ్ల పోస్ట్ బేసిక్ బీఎస్సీ (నర్సింగ్) కోర్సు కోసం ఇంటర్ (బైపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఓపెన్ స్కూల్ విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే.
* బీపీటీ కోర్సు కోసం ఇంటర్ (బైపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఓపెన్ స్కూల్ విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే.
వయోపరిమితి:
31.12.2022 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. 02-01-2006 తర్వాత జన్మించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. పోస్ట్ బేసిక్ బీఎస్సీ కోర్సుకు 21-45 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీకు అదనంగా 3 సంవత్సరాల వయోసడలింపు వర్తిస్తుంది.
రిజిస్ట్రేషన్ & ప్రాసెసింగ్ ఫీజు:
అభ్యర్థులు రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజుగా రూ.2500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2000 చెల్లి్స్తే సరిపోతుంది. డెబిట్/క్రెడిట్/ ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: అభ్యర్థుల అకడమిక్ ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
నోటిఫికేషన్ వెల్లడి: 22.09.2022.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.09.2022.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 03.10.2022.
Also Read:
జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంబీఏ పార్ట్‌టైమ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 17 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 15 నుంచి 17 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
కోర్సులు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
జాతీయ సంస్కృత వర్సిటీలో డిగ్రీ కోర్సులు, వివరాలు ఇలా!
తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం 2022-23 విద్యా సంవత్సరానికి రెగ్యులర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సీయూఈటీ - 2022 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబరు 2 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆన్‌లైన్ విధానంలో అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)