అన్వేషించండి

TS EdCET Counselling: ప్రారంభమైన తెలంగాణ ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌, రిజిస్ట్రేషన్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే!

ఎడ్‌సెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబరు 18 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్‌ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ నిర్వహించనున్నారు.

తెలంగాణలో బీఈడీ, డీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఎడ్‌సెట్‌ 2022 కౌన్సెలింగ్‌ ప్రక్రియ అక్టోబరు 18న ప్రారంభమైంది. కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌లో ప్రకటించిన ప్రకారం ఎడ్‌సెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబరు 18 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్‌ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ నిర్వహించనున్నారు. అక్టోబరు 26 నుంచి 28 వరకు స్పెషల్‌ కేటగిరీ అభ్యర్థులకు ఆన్‌లైన్‌ సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. అనంతరం అక్టోబరు 28న అర్హులైన అభ్యర్థుల జాబితాను ఈమెయిల్ ద్వారా ప్రకటిస్తారు. ఎంపికైన అభ్యర్థులు అక్టోబరు 28 నుంచి 30 వరకు ఫేజ్‌-1 వెబ్‌ ఆప్షన్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 31న వెబ్ ఆప్షన్ల ఎడిట్‌‌కు అవకాశం కల్పించారు. నవంబర్‌ 4న ఎంపికైన అభ్యర్థుల జాబితాను కాలేజీలవారీగా ప్రకటిస్తారు. నవంబరు 5 నుంచి  11 వరకు సంబంధిత కళాశాలలో ఒరిజినల్ సర్టిఫికేట్లు, ట్యూషన్ ఫీజు చలానాతో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. నవంబరు 14 నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి. 

కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే..
.
✈ అక్టోబర్ 17వ తేదీన కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ జారీ
✈ అక్టోబర్ 18 - 26 తేదీల్లో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, ధ్రువపత్రాల పరిశీలన.
✈ అక్టోబర్ 28 - 30 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు -
✈ నవంబరు 4వ తేదీన సీట్లు కేటాయిస్తారు.
✈ నవంబర్ 5 - 11వ తేదీల్లో కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

కౌన్సెలింగ్ సాగేదిలా..

1) అభ్యర్థులు మొదట రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
2) ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
3) ఒరిజినల్ సర్టిఫికేట్లను అప్‌లోడ్ చేయాలి.
4) ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
5) వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి
6) సీట్లు కేటాయిస్తారు.
7) ఫీజు చలానా, జాయినింగ్ రిపోర్ట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
8) ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఫీజు చలానా, జాయినింగ్ రిపోర్ట్‌లతో సంబంధిత కళాశాలలో రిపోర్ చేయాలి.
9) కళాశాలలో యాజమాన్యం ఒరిజినల్ సర్టిఫికేట్ల పరిశీలన నిర్వహిస్తుంది.
10) సీటు కేటాయింపును నిర్దారిస్తారు. 

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం డైరెక్ట్ లింక్

TS EdCET 2022 కౌన్సెలింగ్ వెబ్‌సైట్

ఈ ఏడాది ఈ ఏడాది టీఎస్‌ ఎడ్‌సెట్‌ పరీక్ష జూలై 26న టీఎస్‌ఎడ్‌సెట్-2022 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 26న ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షకు మొత్తం 38,091 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 31,578 మంది హాజరుకాగా.. 30,580 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ ఫలితాల్లో మేడ్చల్‌కు చెందిన అభిషేక్‌ మోహంతికి మొదటి ర్యాంక్‌ సాధించగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆంజనేయులు రెండో ర్యాంక్‌ సాధించాడు. మేడ్చల్‌కు చెందిన ముకేష్‌కు మూడో ర్యాంక్‌, జనగామకు చెందిన మహేష్‌ కుమార్‌కు 4వ ర్యాంక్‌, మేడ్చల్‌కు చెందిన అర్హద్‌ అహ్మద్‌ ఐదో ర్యాంక్‌ దక్కించుకన్నాడు. ఎడ్‌సెట్‌ ర్యాంక్‌ ఆధారంగా 2022-23 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో రెండు సంవత్సరాల బీఈడీ రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశాలకు గానూ తెలంగాణ ఉన్నత విద్యామండలి (TSCHE) తరపున ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎడ్‌సెట్‌ నిర్వహించింది.

:: ఇవీ చదవండి ::

నేషనల్‌ లా యూనివర్సిటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!

న్యూఢిల్లీలోని నేషనల్‌ లా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌యూ)-అకడమిక్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌), ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆలిండియా లా ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏఐఎల్‌ఈటీ) 2023 ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. బీఏ ఎల్‌ఎల్‌బీ(ఆనర్స్‌), ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌లలో ఒక్కోదానిలో అయిదు సీట్లను విదేశీ అభ్యర్థులకు మరో అయిదు సీట్లను ఓసీఐ/ పీఐఓ అభ్యర్థులకు; పీహెచ్‌డీలో రెండు సీట్లను విదేశీయులకు ప్రత్యేకించారు. వీరికి అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా అడ్మిషన్స్‌ ఇస్తారు. వీరు ఎంట్రెన్స్‌ టెస్ట్‌ రాయనవసరం లేదు.
నోటిఫికేషన్, అర్హతలు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి...


CLISC: సీఎల్‌ఐఎస్సీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం, ఇంటర్ అర్హత!
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌర గ్రంధాలయాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో గుర్తింపు పొందిన మూడు సంస్థల ద్వారా నిర్వహించనున్న 5 నెలల కాలపరిమితితో కూడిన సర్టిఫికెట్‌ కోర్స్ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్పర్మేషన్‌ సైన్స్‌ కోర్సులో చేరేందుకు ఆసక్తిగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతుంది. 
కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

TSPECET: టీఎస్‌పీఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల, ముఖ్య తేదీలివే!
తెలంగాణలో వ్యాయామ విద్య (ఫిజికల్ ఎడ్యుకేషన్) కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ ఖరారైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 19 నుంచి నవంబరు 2 వరకు కౌన్సెలింగ్ జరుగనుంది. కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా అక్టోబరు 19 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. 
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget