అన్వేషించండి

TS ECET Results: రేపు టీఎస్ ఈసెట్ ఫలితాలు..

తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ECET) ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈసెట్ ఫలితాలను బుధవారం (ఆగస్టు 18న) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు జేఎన్టీయూ హైదరాబాద్ ప్రకటించింది.

తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ECET) ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈసెట్ ఫలితాలను బుధవారం (ఆగస్టు 18న) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు జేఎన్టీయూ హైదరాబాద్ ప్రకటించింది. విద్యార్థులు తమ ర్యాంకు కార్డులను ecet.tsche.ac.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి చైర్మన్ టి.పాపిరెడ్డి వెల్లడించారు. కాగా, పాలిటెక్నిక్ అభ్యర్థులు ఇంజనీరింగ్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు ఈసెట్ (ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్ష నిర్వహిస్తారు. ఆగస్టు 3వ తేదీన టీఎస్ ఈసెట్- 2021 పరీక్షను నిర్వహించారు.

టీఎస్‌ ఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల..
తెలంగాణ ఈసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు చేశారు. దీని ప్రకారం ఈ నెల 24 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకోవాలి. 26వ తేదీ నుంచి 29 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. వెబ్ ఆప్షన్లు నమోదు ప్రక్రియ ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు ఉంటుంది. సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 2వ తేదీన జరుగుతుంది. సెప్టెంబరు 2 నుంచి 7వ తేదీ వరకు ఆన్ లైన్ విధానంలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 

Also Read: AP LPCET 2021: ఏపీలో లాంగ్వేజ్ పండిట్ కోర్సు ప్రవేశాలు.. ఎల్‌పీసెట్‌ నోటిఫికేషన్ విడుదల..

సెప్టెంబర్‌ 13 నుంచి తుది విడత.. 
ఈసెట్ తుది విడత కౌన్సెలింగ్‌ తేదీలను కూడా ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. సెప్టెంబర్‌ 13వ తేదీ నుంచి తుది విడత కౌన్సెలింగ్‌ జరుగుతుంది. సెప్టెంబర్‌ 14వ తేదీన ధ్రువపత్రాల పరిశీలనకు అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 14, 15 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. సెప్టెంబరు 17న సీట్ల కేటాయింపు వివరాలను ప్రకటిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ వెల్లడించారు. సెప్టెంబర్ 18వ తేదీన స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలను మరిన్ని వివరాల కోసం https://ecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. 

Also Read: TS Eamcet counselling: 30 నుంచి టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్‌.. ఫలితాలు ఎప్పుడంటే?

Also Reda: TS DEECET 2021: తెలంగాణ డీఈఈసెట్ నోటిఫికేషన్ విడుదల.. వచ్చే నెల 8న ఎగ్జామ్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
Posani Heart Problem: పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
Crazxy Movie Review - 'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
SA Vs Eng Result Update: సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అగ్నిపమాదంలో  ప్రాణాలు తీసిన తలుపులుపోసానికి తీవ్ర అస్వస్దత   ఇలా అయిపోయాడేంటి..?మేం సపోర్ట్ ఆపేస్తే రెండు వారాల్లో నువ్వు ఫినిష్-  అయినా సంతకం పెట్టను..Badrinath Avalanche Workers Trapped | మంచుచరియల కింద చిక్కుకుపోయిన 41మంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
Posani Heart Problem: పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
Crazxy Movie Review - 'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
SA Vs Eng Result Update: సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
AP Pensions: 5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
Tamannaah Bhatia: అసలే పాలరాతి శిల్పం... ఆపై వైట్ డ్రస్... కుర్రకారు గుండెల్లో గుబులు రేపేలా తమన్నా
అసలే పాలరాతి శిల్పం... ఆపై వైట్ డ్రస్... కుర్రకారు గుండెల్లో గుబులు రేపేలా తమన్నా
Rahul Dravid: ఇంగ్లాండ్ లో ఇండియన్ టీమ్ ను సెకండ్ క్లాస్ మనుషుల్లా చూసేవారు: రాహుల్ ద్రవిడ్ వీడియో వైరల్
ఇంగ్లాండ్ లో ఇండియన్ టీమ్ ను సెకండ్ క్లాస్ మనుషుల్లా చూసేవారు: రాహుల్ ద్రవిడ్ వీడియో వైరల్
IPPB: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు, వివరాలు ఇలా
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు, వివరాలు ఇలా
Embed widget