News
News
X

TS EAMCET Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాల తేదీ ఖరారు, రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వెలువడిన నాటి నుంచి వారం పదిరోజుల్లో ఎంసెట్ మొదటి విడత కౌన్సెలింగ్‌ మొదలయ్యే అవకాశం ఉంది.

FOLLOW US: 

తెలంగాణలో రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న TS EAMCET - 2022 ఫలితాల విడుదలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని సవ్యంగా జరిగితే ఆగస్టు 12న ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యే అవకాశముంది. ఈ మేరకు ఆగస్టు 11న ఎంసెట్ కమిటీ ఫలితాలను విశ్లేషించి ఆమోదించనుంది. ప్రిలిమినరీ కీ విడుదల చేసి విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. ఫైనల్ కీతో పాటు ఫలితాలను ఎంసెట్ కమిటీ విశ్లేషించి నిర్ణయం తీసుకోనుంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమయాన్ని బట్టి ఆగస్టు 12 లేదా 13న ఫలితాలను ప్రకటించనున్నారు.

మూడు విడతల కౌన్సెలింగ్..
ఎంసెట్ ఫలితాలు వెలువడిన నాటి నుంచి వారం పదిరోజుల్లో ఎంసెట్ మొదటి విడత కౌన్సెలింగ్‌ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో జేఎన్‌టీయూహెచ్, ఓయూ అధికారులు ఆయా ప్రైవేట్ కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తిచేసి సిద్ధంగా ఉండాలని ఇప్పటికే అధికారులు సూచించారు. మొదట రెండు విడతల కౌన్సెలింగ్‌ను ముగించాలని, చివరి విడతను మాత్రం ఐఐటీ, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి జోసా కౌన్సెలింగ్ పూర్తయ్యాక జరపాలని నిర్ణయించినట్లు తెలిసింది. దానివల్ల రాష్ట్ర విద్యార్థులు నష్టపోకుండా, సీట్లు మిగిలిపోకుండా ఉంటాయని కమిటీ భావిస్తోంది.

రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎంసెట్ పరీక్షలు జులై 20న ముగిసిన సంగతి తెలిసిందే. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 18 నుంచి 20 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష నిర్వహించారు. మూడు రోజుల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు సంబంధించి మొత్తం 1,72,243 మంది విద్యార్థులు ఎంసెట్ ఎగ్జామ్ కోసం దరఖాస్తు చేసుకోగా, కేవలం 1,56,812 మంది మాత్రమే హాజరయ్యారు. 9 శాతం విద్యార్థులు పరీక్ష రాయలేదు. ఇక ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్షలను జులై 30, 31వ తేదీల్లో నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 94,476 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 80,575 (85.3 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు.

కాగా ఈ ఏడాది ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీని రద్దు చేసిన విషయం తెలిసిందే. పాత నిబంధనల ప్రకారం జనరల్‌ విద్యార్ధులు ఇంటర్‌లో 45 శాతం, మిగిలిన వారు 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందటం తప్పనిసరిగా ఉంది. అంతేకాకుండా ఈ సారి ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ కూడా ఉండదు. అంటే ఎంసెట్‌లో వచ్చిన మార్కులతోనే ర్యాంక్‌ కేటాయిస్తారన్నమాట. 70 శాతం సిలబస్‌తోనే ఎంసెట్‌లో ప్రశ్నలను రూపొందిచాలని నిర్ణయించారు. 160 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 160 మార్కుల చొప్పున పశ్నాపత్రం ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.ఫలితాల విడుదల అనంతరం అభ్యర్థులు తమ ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు..

Step 1: అభ్యర్థులు మొదటగా https://eamcet.tsche.ac.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.

Step 2: అనంతరం హోం పేజీలో రిజల్ట్ లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి. 

Step 3: అనంతరం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో అభ్యర్థులు హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.

Step 4: తర్వాత మీ రిజల్ట్ స్క్రీన్ పై కనిపిస్తుంది. ఆ కాపీని ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.

 

Also Read:

హైదరాబాద్ విద్యార్థికి బంపర్ ఆఫర్, ఏకంగా రూ.1.30కోట్ల స్కాలర్‌షిప్!!

బీసీ విద్యార్థులకు గుడ్‌న్యూస్, పీఎం యశస్వీ స్కాలర్‌షిప్ దరఖాస్తులు షురూ!

పేద విద్యార్థుల జీవితాల్లో ‘పరివర్తనం’ - హెచ్‌డీఎఫ్‌సీ పరివర్తన్‌ స్కాలర్‌షిప్‌

పేద విద్యార్థులకు 'ఉపకారం' - పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేశారా?

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 11 Aug 2022 02:52 AM (IST) Tags: TS EAMCET 2022 Results TS EAMCET Results 2022 TS EAMCET - 2022 Engineering Result

సంబంధిత కథనాలు

Engineering Fee: ఇంజినీరింగ్‌ ఫీజుల పంచాయితీ మళ్లీ మొదటికి, తేలేదెన్నడు?

Engineering Fee: ఇంజినీరింగ్‌ ఫీజుల పంచాయితీ మళ్లీ మొదటికి, తేలేదెన్నడు?

CUET PG Result: నేడు సీయూఈటీ పీజీ ఫలితాలు, రిజల్ట్ ఇలా చూసుకోండి!

CUET PG Result: నేడు సీయూఈటీ పీజీ ఫలితాలు, రిజల్ట్ ఇలా చూసుకోండి!

TS PECET Result: తెలంగాణ పీఈ‌సెట్‌ ఫలి‌తాలు వెల్లడి, ర్యాంకు కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

TS PECET Result: తెలంగాణ పీఈ‌సెట్‌ ఫలి‌తాలు వెల్లడి, ర్యాంకు కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

CUET PG Final Key: సీయూఈటీ పీజీ తుది ఆన్సర్ కీ విడుదల, ఇలా చెక్ చేసుకోండి!

CUET PG Final Key: సీయూఈటీ పీజీ తుది ఆన్సర్ కీ విడుదల, ఇలా చెక్ చేసుకోండి!

PECET Result: నేడు పీఈ‌సెట్‌ ఫలి‌తాలు వెల్లడి, ఇక్కడ చూసుకోండి!

PECET Result: నేడు పీఈ‌సెట్‌ ఫలి‌తాలు వెల్లడి, ఇక్కడ చూసుకోండి!

టాప్ స్టోరీస్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Rajasthan Congress Crisis: రాజస్థాన్‌లో రాత్రికి రాత్రే హైడ్రామా- 90 మంది ఎమ్మెల్యేల రాజీనామా!

Rajasthan Congress Crisis: రాజస్థాన్‌లో రాత్రికి రాత్రే హైడ్రామా- 90 మంది ఎమ్మెల్యేల రాజీనామా!

Jupiter Closest To Earth: నేడు అంతరిక్షంలో అద్భుతం, 59 ఏళ్ల తర్వాత భూమికి అతి దగ్గరగా గురు గ్రహం

Jupiter Closest To Earth: నేడు అంతరిక్షంలో అద్భుతం, 59 ఏళ్ల తర్వాత భూమికి అతి దగ్గరగా గురు గ్రహం

Bigg Boss 6 Telugu: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి

Bigg Boss 6 Telugu: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి