PM Scholarships: పేద విద్యార్థులకు 'ఉపకారం' - పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేశారా?
10వ తరగతి పూర్తయిన విద్యార్థులు ఈ పోస్ట్ మెట్రిక్ ఉపకారవేతనాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మెరిట్ ఆధారంగా వారి ఉన్నత చదువుల కోసం ఆర్థికసాయం అందిస్తారు.
భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 2022–23 సంవత్సరానికి గాను అర్హులైన ఎస్సీ పేద విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. 10వ తరగతి పూర్తయిన విద్యార్థులు ఈ పోస్ట్ మెట్రిక్ ఉపకారవేతనాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మెరిట్ ఆధారంగా వారి ఉన్నత చదువుల కోసం ఆర్థికసాయం అందిస్తారు. విద్యార్థులు చదువుతున్న కోర్సుల ఆధారంగా ఏడాదికి రూ.2500 నుంచి రూ.13,500 వరకు ఉపకారవేతనం అందిస్తారు. అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా స్కాలర్‌షిప్ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
అర్హతలు:
- ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు మాత్రమే ఈ ఉపకారవేతనాలు పొందడానికి అర్హులు.
- పదోతరగతి పూర్తిచేసి గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్, ఆపై తరగతులు చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
- విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలకు మించకూడదు.
- విద్యార్థులు చేరే సంస్థలకు ప్రభుత్వ గుర్తింపు తప్పనిసరిగా ఉండాలి.
- దేశంలో చదివే విద్యార్థులకు మాత్రమే ఈ స్కాలర్‌షిప్ పొందడానికి అర్హులు.
పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్(ఎస్సీ)-విభాగాలు:
విద్యార్థుల విద్యా స్థాయిని బట్టి ఈ స్కాలర్‌షిప్ ఉంటుంది. మొత్తం నాలుగు గ్రూపులుగా విభజించారు.
- గ్రూప్-1లో డిగ్రీ, పీజీ స్థాయి ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులు డే స్కాలర్ అయితే రూ.7000, రెసిడెన్షియల్ అయితే రూ.13,500 స్కాలర్‌షిప్ ఇస్తారు.
- గ్రూప్-2లో డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులు డే స్కాలర్ అయితే రూ.6,500, రెసిడెన్షియల్ అయితే రూ.9,500 స్కాలర్‌షిప్ ఇస్తారు.
- గ్రూప్–3లో గ్రూప్ 1, 2 పరిధిలో లేని డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులు డే స్కాలర్ అయితే రూ.3,000, రెసిడెన్షియల్ అయితే రూ.6,000 స్కాలర్‌షిప్‌ఇస్తారు.
- గ్రూప్–4లో అన్ని పోస్టు మెట్రిక్యులేషన్, నాన్–డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులు డే స్కాలర్ అయితే రూ.2,500, రెసిడెన్షియల్ అయితే రూ.4,000 స్కాలర్‌షిప్‌గా అందజేస్తారు.
దరఖాస్తు విధానం: అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం పోర్టల్ ఏప్రిల్ 14.04.2022 నుండి 31.10.2022 వరకు ఆన్‌లైన్ అప్లికేషన్ పోర్టల్ ఓపెన్ చేసి ఉంటుంది. నిర్ణీత గడువులోగా విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ ఉపకారవేతనాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Post-Matric Scholarship for SC students
SCHEME OF POST MATRIC SCHOLARSHIPS TO THE STUDENTS BELONGING TO SCHEDULED CASTES FOR STUDIES IN INDIA (PMS-SC)(With effect from 2020-2021)
Post Matric Scholarship for SCs: Scheme Guidelines
Objective
1.1The objective of the scheme is to appreciably increase the Gross Enrolment Ratio of SC students in higher education with a focus on those from the poorest households, by providing financial assistance at post-matriculation or post-secondary stage to enable them to complete their education.
Scope
2.1These scholarships are available for studies in India only and the awardees are selected by the State Government/Union Territory to which the applicant actually belongs (i.e. the State/UT in which permanently settled or domiciled, as per the terms of domicile decided by the State).
2.2This is applicable to all the students who are currently beneficiaries of the scheme as well as fresh admissions.
3. Complete scheme guidelines are given below.