X

Visa Interview: అబ్బా.. చీ.. వీసా ఇంటర్వ్యూ మళ్లీ పోయింది.. ఎలా ప్రయత్నిస్తే బెటర్ అంటారు? 

విదేశాల్లో చదువాలనే కోరిక చాలామందికి ఉంటుంది. అన్నీ పర్ ఫెక్ట్ గా జరిగిపోతాయి.. కానీ.. వీసా ఇంటర్వ్యూ దగ్గరనే.. అసలు కథ.

FOLLOW US: 

ఫారిన్ లో చదవాలని.. కలలు కంటారు. అన్నీ సక్రమంగానే జరిగిపోతాయి. కానీ.. వీసా ఇంటర్వ్యూ వచ్చేసరికి.. ఖేల్ ఖతమ్ అయిపోద్ది. ఇక విమానం ఎక్కినట్టే.. అనుకోవాల్సి వస్తుంది. ఫారిన్ ఎడ్యుకేషన్ దరఖాస్తులో చివరిదైన వీసా ఇంటర్వ్యూకు వెళ్లే చాలమంది టాలెంటెడ్ పిపుల్..ఎక్కడో ఓ దగ్గర తప్పులో కాలేసి.. ఇక ఇంటివైపు రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని వస్తుంటారు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. వీసా ఈజీగా వచ్చేస్తుంది. 

వీసా ఇంటర్వ్యూ జరిగే టైమ్ లో మనల్ని వాళ్లు పరిశీలించే తీరు మాములుగా ఉండదు. ఏం చూస్తారులే అనుకుంటాం. కానీ అన్నింటీని వాళ్లు లెక్కలోకి తీసుకుంటారు. ఎడ్యుకేషన్ కోసం వెళ్లేవాళ్లు..  విదేశంలో ఉండేందుకు, చదువుకునేందుకు సరైన డబ్బులు ఉన్నాయా? అసలు ఆ వ్యక్తి ఆర్థిక స్థోమత ఏంటని కూడా అంచనా వేస్తారు. చదువు అయిపోయాక.. తిరిగి వస్తారా? లేదా అనేది కూడా వాళ్లు లెక్కలోకి తీసుకుంటారు. అక్కడ నిజాయితీగా మాట్లాడటం చాలా అవసరం. లోన్‌ అప్రూవల్‌ లెటర్, సేవింగ్స్‌ బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ (3 నెలలు), ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ సర్టిఫికెట్స్‌ (3 సంవత్సరాలు) లాంటి పత్రాలు ఇంటర్వ్యూకి తీసుకెళ్లండి.

వీసా ఇంటర్వ్యూలు ఒక్కో దేశానికి సంబంధించి.. ఒక్కోలా ఉంటుంది. ముందుగా అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకున్నాకే.. ప్రిపేర్ అయి వెళితే మంచిది. అమెరికా, యూకే, కెనడా.. ఒక్కో దేశానికి ఒక్కో తీరులో ఇంటర్వ్యూలు ఉంటాయి. ఆస్ట్రేలియాలాంటి దేశమైతే.. అభ్యర్థిని ఇంటర్వ్యూకి పిలవొచ్చు.. పిలవకపోవచ్చు..  అవసరమైతే.. టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వూ నిర్వహించకుండానే అభ్యర్థికి తిరస్కరణ లేఖ రాయడం, ఇంటర్వూ నిర్వహించకుండా వీసా మంజూరు చేయడం లాంటివి కూడా జరగొచ్చు.

వీసా ఇంటర్వ్యూకి వెళ్లేముందు.. వీలైనంత వరకూ అన్ని.. సర్టిఫికేట్లు తీసుకెళ్లండి. అప్లికేషన్‌ లేదా వీసా ఇంటర్వూ అపాయింట్‌మెంట్‌ లెటర్‌ ను తప్పకుండా తీసుకెళ్లాలి. లేకుంటే మెుదటికే మోసం వస్తుంది. పాస్‌పోర్ట్, ఫీజు రిసీట్, పదో తరగతి, ఇంటర్మీడియట్, బ్యాచిలర్‌ డిగ్రీ సర్టిఫికెట్స్, మార్కుల మెమోలు, జీఆర్‌ఈ/జీమ్యాట్‌/శాట్‌ స్కోర్‌కార్డ్స్, వర్క్‌ ఎక్స్‌పీరియెన్స్‌ సర్టిఫికెట్‌ లాంటివి అడిగే ఛాన్స్ ఉంది. వాటిని తీసుకెళ్లండి.

వీసాకు సంబంధించిన ఇంటర్వ్యూ ఇంగ్లీషులో మాత్రమే చేస్తారు. ఇంటర్వ్యూయర్ అడిగే ప్రశ్నలకు.. సరైన సమాధానం ఇవ్వాలి. మీరు వెళ్లే.. దేశం గురించి కూడా తెలుసుకుంటే మంచిది. అక్కడ ఏం చదువాలి అనుకుంటున్నారో.. మీ కోర్సుకు సంబంధించినది పూర్తి అవగాహన ఉండాలి. ఆ కోర్సు చేశాక.. మన దేశంలో ఉండే ఉద్యోగ అవకాశలపైనా.. అవగాహన పెట్టుకుంటే.. బెటర్. ఒకవేళ అడిగినా.. ఠక్కున సమాధానం చెప్పేయోచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్వ్యూయర్ తో వాదించొద్దు. మంచి దుస్తులు వేసుకుని వెళ్లండి.  

ఈ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. వేరే ప్రశ్నలు కూడా అడుగుతారు.  బేసిక్ గా ఇవి అడిగే ఛాన్స్ ఉంది. 

  • ఇండియాలో ఎందుకు చదవాలి అనుకోవడం లేదు?
  • మీరు విదేశాల్లో ఎందుకు సంబంధిత కోర్సు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు?
  • ఫారిన్ ఎడ్యుకేషన్ కోసం.. సంబంధిత దేశాన్ని ఎందుకు ఎంచుకున్నారు?
  • ఎడ్యుకేషన్ పూర్తయ్యాక.. అక్కడే ఉద్యోగ అవకాశం లభిస్తే ఏం చేస్తారు?
  • చదివేందుకు ఆర్థిక స్థోమత సహకరించకుంటే.. ప్రత్యామ్నాయాలు ఏం ఉన్నాయి?

Also Read: Takshashila University: ప్రపంచానికి చదువు చెప్పిన భారతదేశం.. ఈ యూనివర్శిటీలో ఫీజులు కట్టక్కర్లేదు, పరీక్షలు ఉండవు..

Also Read: JEE Main-2022: త్వరలో జేఈఈ మెయిన్-2022 రిజిస్ట్రేషన్.. పరీక్ష ఎప్పుడంటే?

Also Read: Interview: ఇంటర్వ్యూకి వెళ్తున్నారా? ఆ రోజు ఎలా ఉండాలి? ఏం చేయాలి? 

Tags: Education News visa Interview visa passport foreign education foreign education process

సంబంధిత కథనాలు

Vizag IIPE: పెట్రోలియం వర్సిటీకి సొంత క్యాంపస్, 157.36 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం

Vizag IIPE: పెట్రోలియం వర్సిటీకి సొంత క్యాంపస్, 157.36 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం

మొబైల్‌, యాప్స్‌ అప్‌డేట్‌ చేస్తున్నారు సరే... మరి మీరు అప్‌డేట్‌ అవ్వరా?... అలా కాకుంటే ఎంత ప్రమాదమో ఎప్పుడైనా ఆలోచించారా?

మొబైల్‌, యాప్స్‌ అప్‌డేట్‌ చేస్తున్నారు సరే... మరి మీరు అప్‌డేట్‌ అవ్వరా?... అలా కాకుంటే ఎంత ప్రమాదమో ఎప్పుడైనా ఆలోచించారా?

NEET-PG 2022: నీట్‌ పీజీ ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ స్టార్ట్‌.. త్వరగా అప్లై చేయకుంటే జరిగే నష్టం తెలుసా!

NEET-PG 2022: నీట్‌ పీజీ ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ స్టార్ట్‌.. త్వరగా అప్లై చేయకుంటే జరిగే నష్టం తెలుసా!

Telangana Schools: ఓమిక్రాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో స్కూళ్లకు సెలవులు పొడిగింపు, ప్రభుత్వం కీలక నిర్ణయం

Telangana Schools: ఓమిక్రాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో స్కూళ్లకు సెలవులు పొడిగింపు, ప్రభుత్వం కీలక నిర్ణయం

Army Public School Recruitment 2022: ఆర్మీ స్కూల్స్‌లో టీచర్ ఉద్యోగాలు.. 57ఏళ్ల వయసు వాళ్లు అప్లై చేసుకోవచ్చు..

Army Public School Recruitment 2022: ఆర్మీ స్కూల్స్‌లో టీచర్ ఉద్యోగాలు.. 57ఏళ్ల వయసు వాళ్లు అప్లై చేసుకోవచ్చు..

టాప్ స్టోరీస్

Cyber Attack: మహేష్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌‌పై సైబర్ అటాక్.. ప్లాన్ ప్రకారం ఖాతాలు తెరిచి రూ.12 కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్లు

Cyber Attack: మహేష్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌‌పై సైబర్ అటాక్.. ప్లాన్ ప్రకారం ఖాతాలు తెరిచి రూ.12 కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్లు

Coffee: కాఫీ ప్రియులకు శుభవార్త... ఆ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించే సత్తా కాఫీకే ఉంది, వెల్లడించిన కొత్త అధ్యయనం

Coffee: కాఫీ ప్రియులకు శుభవార్త... ఆ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించే సత్తా కాఫీకే ఉంది, వెల్లడించిన కొత్త అధ్యయనం

Weather Updates: ఏపీలో మరో రెండు రోజులు ఓ మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పొడి వాతావరణం

Weather Updates: ఏపీలో మరో రెండు రోజులు ఓ మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పొడి వాతావరణం

Gold Silver Price Today 25 January 2022 : దేశంలో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, తగ్గిన వెండి... తెలుగు రాష్ట్రాల్లో మాత్రం స్థిరంగా... ప్రధాన నగరాల్లో ధరలు ఇలా...

Gold Silver Price Today 25 January 2022 : దేశంలో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, తగ్గిన వెండి... తెలుగు రాష్ట్రాల్లో మాత్రం స్థిరంగా... ప్రధాన నగరాల్లో ధరలు ఇలా...