JEE Main-2022: త్వరలో జేఈఈ మెయిన్-2022 రిజిస్ట్రేషన్.. పరీక్ష ఎప్పుడంటే?
జేఈఈ మెయిన్-2022 ఎగ్జామ్ కోసం రిజిస్ట్రేషన్ జరగనున్నట్టు తెలుస్తోంది. అతి త్వరలో రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. త్వరలో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్-2022 పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభించనుంది. డిసెంబర్ లోనే రిజిస్ట్రేషన్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి చేసింది. దేశంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం.. ఈ అర్హత పరీక్ష జరగనుంది. 2022 ఫిబ్రవరి నుంచి నాలుగు సెషన్లలో జేఈఈ పరీక్షలు జరగనున్నాయి. కిందటి ఏడాది కరోనా కారణంగా .. మెుత్తం నాలుగు సెషన్లలో నిర్వహించారు. జేఈఈ మెయిన్ లోని టాప్ 2.5 లక్షల మంది విద్యార్థులు.. ఐఐటీ ప్రవేశాల కోసం జరిగే.. జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 పరీక్ష రాయోచ్చు.
జేఈఈ మెయిన్-2022 పరీక్షను ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలో నిర్వహించే అవకాశం ఉంది. jeemain.nta.nic.inలో త్వరలో షెడ్యూల్ గురించి ప్రకటిస్తారు.
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్‌డ్ (JEE అడ్వాన్స్‌డ్) సిలబస్ లో మార్పులు జరిగాయి. 2023 నుంచి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లో ప్రవేశానికి సవరించిన సిలబస్‌ను జేఈఈ ప్రవేశపెట్టింది. దానికి సంబంధించిన కొత్త సిలబస్ ను అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించారు.
జేఈఈ సిలబస్ లో మార్పులు
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 సవరించిన పాఠ్యాంశాలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మూడు సబ్జెక్టుల్లో మార్పులు జరిగాయి. గణితం, రసాయన శాస్త్రం, భౌతికశాస్త్రంలో సవరణలు చేసినట్టు అధికారిక ప్రకటన జారీ అయింది.
JEE అడ్వాన్స్‌డ్ 2023 సిలబస్‌లో మార్పులు
ఫిజిక్స్ విభాగంలో General Physics, Mechanics, Thermal Physics, Electromagnetic Wavesతో పాటు మరికొన్ని అంశాలను చేర్చారు.
కెమిస్ట్రీ విభాగంలో Gases and Liquids, Atomic Structure, Chemical Bonding, and Molecular Structure కవర్ అవుతాయి.
గణితంలో Sets, Relations, and Functions, Algebra లాంటివి సవరించిన సిలబస్ లో ఉన్నాయి.
ఈ సబ్జెక్టులు, సవరణలకు సంబంధించి.. పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ సందర్శించాలి. దాని కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.. https://jeeadv.ac.in/
Also Read: JEE Advanced 2023: జేఈఈ అడ్వాన్స్‌డ్ సిలబస్ లో మార్పులు.. వివరాల కోసం ఇక్కడ చూడండి
Also Read: Interview: ఇంటర్వ్యూకి వెళ్తున్నారా? ఆ రోజు ఎలా ఉండాలి? ఏం చేయాలి?
Also Read: ట్విట్టర్ నుంచి గుగూల్ సీఈవో వరకు అగ్రస్థానంలో ఉన్న.. ఐఐటీ, ఐఐఎమ్ గ్రాడ్యుయేట్లు వీళ్లే..