అన్వేషించండి

Exam Fee: టెన్త్, ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షల ఫీజు తత్కాల్ పథకం కింద ఫిబ్రవరి 2 వరకు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు.

TS SSC ans Inter Fee Payment: మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షల ఫీజు తత్కాల్ పథకం కింద చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు వారి పాఠశాల ప్రధానోపాధ్యాయులకు పరీక్ష రుసుం చెల్లించాలని సూచించారు. తత్కాల్‌ స్కీంలో భాగంగా ఫిబ్రవరి 5వ తేదీ వరకు గడువు పొడిగిస్తున్నట్లు ఆయన తెలిపారు. రూ.1,000 ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజును చెల్లించేందుకు ఇదే చివరి అవకాశమని, ఆ తరువాత గడువు పొడిగించే ప్రసక్తి లేదని పేర్కొ న్నారు. అంతేకాకుండా మార్చిలో జరిగే పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యేవారు మాత్రమే.. ఆ తరువాత జరిగే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు అర్హత సాధిస్తారని పేర్కొన్నారు. కావున ఒకసారి ఫెయిలైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని కోరారు. సంబంధిత ప్రధానోపాధ్యాయులు విద్యార్ధులు చెల్లించిన ఫీజు మొత్తాన్ని ఫిబ్రవరి 6లోగా ట్రెజరీలో జమ చేయాలని ఆదేశించారు. అదేరోజు నామినల్‌ రోల్స్‌ను కూడా డీఈవో కార్యాలయానికి పంపాలని పేర్కొన్నారు.

మరోవైపు పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఏడాది 5.07 లక్షల మంది పరీక్ష ఫీజు చెల్లించగా, 2,700 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. నిరుటి కంటే ఈ ఏడాది 50 అదనపు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. నిరుటి కంటే ఈ ఏడాది 15 వేల మంది అదనంగా పరీక్షలు రాయబోతున్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో విద్యార్థుల సంఖ్యను కనిష్టంగా 120, గరిష్ఠంగా 280 మందికే పరిమితం చేయనున్నారు.

ఇంటర్ ఫీజు గడువు పొడిగింపు..
అదేవిధంగా ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రూ.4 వేల ఆలస్య రుసుంతో జనవరి 29 వరకు ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల నుంచి వినతులు వస్తున్న నేపథ్యంలో తుది అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు.

పదోతరగతి ఫీజు చెల్లింపు వివరాలు..

➥ 6 సబ్జెక్టులకు రాయాలనుకునే రెగ్యులర్ విద్యార్థులకు పరీక్ష ఫీజు: రూ.125 

➥ 3 సబ్జెక్టుల వరకు రాయాలనుకునే విద్యార్థులకు పరీక్ష ఫీజు: రూ.110

➥ 3 సబ్జెక్టులకు మించి పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులకు పరీక్ష ఫీజు: రూ.125.

➥ ఒకేషనల్ విద్యార్థులకు పరీక్ష ఫీజు: రూ.60.

వీరికి ఫీజు నుంచి మినహాయింపు..
* కుటుంబ వార్షిక ఆదాయం ఏడాదికి పట్టణాల్లో రూ.24 వేలకు మించకూడదు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.20 వేలకు మించకూడదు (లేదా) 2.5 ఎకరాల సాగు భూమి, 5 ఎకరాల బంజరు భూమి ఉన్నవారికి ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. 

పదోతరగతి పరీక్షల టైమ్ టేబుల్ కోసం క్లిక్ చేయండి..

ఇంటర్ పరీక్ష ఫీజు వివరాలు ఇలా..

🔰 ఇంట‌ర్ రెగ్యుల‌ర్ విద్యార్థులు రూ. 500 ప‌రీక్ష ఫీజుగా చెల్లించాలి. 

🔰 ఇంట‌ర్ ద్వితీయ సంవ‌త్సరం చ‌దువుతున్న సైన్స్ గ్రూపుల విద్యార్థులు ప్రాక్టిక‌ల్ ప‌రీక్షల నిమిత్తం అద‌నంగా రూ.210 చెల్లించాల్సి ఉంటుంది. 

🔰 ఒకేష‌న‌ల్ విద్యార్థులైతే రూ. 710 చెల్లించాలి.  

🔰 నవంబరు 14 నుంచి 30 వరకు ఫీజు ఆలస్యరుసుము లేకుండా ఫీజు స్వీకరించారు. 

🔰 రూ. 100 ఆల‌స్య రుసుముతో డిసెంబ‌ర్ 2 నుంచి 6 వరకు పరీక్ష ఫీజు స్వీకరించారు.

🔰 రూ. 100 ఆల‌స్య రుసుంతో డిసెంబ‌ర్ 12 వరకు పరీక్ష ఫీజు స్వీకరించారు.

🔰 రూ.500 ఆల‌స్య రుసుంతో డిసెంబర్ 14 నుంచి 17 వ‌ర‌కు పరీక్ష ఫీజు స్వీకరించారు.

🔰 రూ. 1000 ఆల‌స్య రుసుంతో డిసెంబ‌ర్ 19 నుంచి 22 వరకు పరీక్ష ఫీజు స్వీకరించారు.

🔰 రూ. 2000 ఆల‌స్య రుసుంతో గడువు డిసెంబరు 29తో ముగియగా రూ.2500తో డిసెంబరు 30 నుంచి జనవరి 3 వరకు అవకాశం కల్పించారు.

ఇంటర్ జనరల్, ఒకేషనల్, బ్రిడ్జ్ కోర్సు పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి.. 

ALSO READ:

తెలంగాణ ఉమ్మడి పరీక్షల తేదీలు వెల్లడి, 'EAPCET'గా మారిన ఎంసెట్
తెలంగాణలో వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల షెడ్యూలు జనవరి 25న విడుదలైంది. ఎంసెట్‌తోపాటు ఈసెట్‌, లాసెట్‌, పీజీసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈ సెట్‌కు సంబంధించిన కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టులకు సంబంధించిన పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. టీఎస్ ఎంసెట్ పేరును 'టీఎస్ ఈఏపీసెట్'గా మారుస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 
పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
'28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
Embed widget