TS Inter Exam Timetable: ఇంటర్ జనరల్, ఒకేషనల్ పరీక్షల టైమ్‌టేబుల్ వచ్చేసింది, షెడ్యూలు ఇలా
TS Inter Exams 2024 Schedule: ఇంటర్ రెగ్యులర్ పరీక్షలతోపాటు, ఒకేషనల్ పరీక్షలు కూడా ఫిబ్రవరి 28న ప్రారంభంకానున్నాయి. మార్చి 11న ఫస్టియర్, మార్చి 12న సెకండియర్ ఎగ్జామ్స్ పూర్తవుతాయి.
TS Inter Exams Schedule: తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూలును ఇంటర్ బోర్డు డిసెంబరు 28న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ ఫస్టియర్, ఫిబ్రవరి 29 నుంచి ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 17న ఎథిక్స్ & హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, ఫిబ్రవరి 19న ఎన్విరాన్‌మెంటల్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇంటర్ రెగ్యులర్ పరీక్షలతోపాటు, ఒకేషనల్ పరీక్షలు కూడా ఫిబ్రవరి 28న ప్రారంభంకాన్నాయి. ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 11 వరకు, ఇంటర్ సెకండియర్ ఒకేషనల్ పరీక్షలు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 12 వరకు జరుగనున్నాయి.
ఆయాతేదీల్లో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు సెకండ్ ఇయర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది తొలిసారిగా ఫస్టియర్ విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌ను నిర్వహించనున్నారు. ఈ ప్రాక్టికల్స్‌ను ఫిబ్రవరి 16న నిర్వహించనున్నారు. ఇంగ్లిష్ థియరీ పరీక్షకు 80 మార్కులకు ఉండనుండగా.. ప్రాక్టికల్ పరీక్షకు 20 మార్కులు ఉండనున్నాయి.
IPE MARCH 2024 GENERAL TENTATIVE TIMETABLE
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు..
➥ 28-02-2024: సెకండ్ లాంగ్వేజ్ పేపర్-I
➥ 01-03-2024: ఇంగ్లిష్ పేపర్-I
➥ 04-03-2024: మ్యాథమెటిక్స్ పేపర్-IA, బాటనీ పేపర్-I, పొలిటికల్ సైన్స్ పేపర్-I
➥ 06-03-2024: మ్యాథమేటిక్స్ పేపర్-IB, జువాలజీ పేపర్-I, హిస్టరీ పేపర్-I
➥ 11-03-2024: ఫిజిక్స్ పేపర్-I, ఎకనామిక్స్ పేపర్-I
➥ 13-03-2024: కెమిస్ట్రీ పేపర్-I, కామర్స్ పేపర్-I
➥ 15-03-2024: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-I, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్-I
➥ 18-03-2024: మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-I, జియోగ్రఫీ పేపర్-I
ఇంటర్ సెకండ్ పరీక్షలు..
➥ 29-02-2024: సెకండ్ లాంగ్వేజ్ పేపర్-II
➥ 02-03-2024: ఇంగ్లిష్ పేపర్-II
➥ 05-03-2024: మ్యాథమెటిక్స్ పేపర్-IIA, బాటనీ పేపర్-II, పొలిటికల్ సైన్స్ పేపర్-II
➥ 07-03-2024: మ్యాథమెటిక్స్ పేపర్-IIB, జువాలజీ పేపర్-II, హిస్టరీ పేపర్-II
➥ 12-03-2024: ఫిజిక్స్ పేపర్-II, ఎకనామిక్స్ పేపర్-II
➥ 14-03-2024: కెమిస్ట్రీ పేపర్-II, కామర్స్ పేపర్-II
➥ 16-03-2024: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్-II
➥ 19-03-2024: మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-II, జియోగ్రఫీ పేపర్-II
ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్/ బ్రిడ్జ్ కోర్సు పరీక్షల షెడ్యూలు..
ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ పరీక్షలు కూడా ఫిబ్రవరి 28న ప్రారంభంకానున్నాయి. మార్చి 11తో పరీక్షలు ముగియనున్నాయి. బ్రిడ్జ్ కోర్సు పరీక్షలు మార్చి 13, 15 తేదీలలో నిర్వహించనున్నారు.
IPE MARCH 2024 VOCATIONAL FIRST YEAR TIMETABLE
ఇంటర్ సెకండియర్ ఒకేషనల్/ బ్రిడ్జ్ కోర్సు పరీక్షల షెడ్యూలు..
ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ పరీక్షలు ఫిబ్రవరి 29న ప్రారంభంకానున్నాయి. మార్చి 12తో పరీక్షలు ముగియనున్నాయి. బ్రిడ్జ్ కోర్సు పరీక్షలు మార్చి 14, 16 తేదీలలో నిర్వహించనున్నారు.
IPE MARCH 2024 VOCATIONAL SECOND YEAR TIMETABLE
ALSO READ:
తెలంగాణ పదోతరగతి పరీక్షల షెడ్యూలు విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలో పదోతరగతి పరీక్షల షెడ్యూలును అధికారులు డిసెంబరు 30న (శనివారం) ప్రకటించారు. షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూలును విడుదల చేశారు. మార్చి 18తో పరీక్షలు ప్రారంభంకానుండగా.. మార్చి 30తో ప్రధాన పరీక్షలు, ఏప్రిల్ 2తో ఒకేషనల్ పరీక్షలు ముగియనున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 18న ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 21న థర్డ్ లాంగ్వేజ్, మార్చి 23న మ్యాథమెటిక్స్, మార్చి 26న ఫిజికల్ సైన్స్, మార్చి 28న బయలాజికల్ సైన్స్, మార్చి 30న సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక ఏప్రిల్ 1న ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులకు, ఏప్రిల్ 2న ఓరియంటెల్ పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.
టెన్త్ పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..