అన్వేషించండి

TS SSC Supply Results: తెలంగాణ పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాలు 'నేడే విడుదల', డైరెక్ట్ లింక్ ఇదే

TS 10th Results: తెలంగాణలో పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాలను జూన్ 28న ప్రకటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు.

Telangana SSC Supplementary Results: తెలంగాణలో పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం (జూన్ 28) వెలువడనున్నాయి.  మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు విడుదల చేయనునున్నట్లు విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు. విద్యార్థులు వ్యక్తిగతంగా తమ రోల్ నెంబరు వివరాలు నమోదుచేసి మార్కుల మెమోలు డౌన్‌‌లోడ్ చేసుకోవచ్చు. ఇక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ తమ లాగిన్ వివరాల ద్వారా కూడా ఫలితాలు పొందవచ్చు. పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్‌ 3 నుంచి జూన్ 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే 

ఫలితాల కోసం డైరెక్ట్ లింక్

తెలంగాణలో ఈ ఏడాది పదోతరగతి వార్షిక పరీక్షలను మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5,08, 385 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 2,57,952 మంది బాలురు ఉండగా.. 2,50,433 మంది బాలికలు ఉన్నారు. ఈ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 30న విడుద‌ల చేశారు. ఫలితాలకు సంబంధించి మొత్తం 5,05,813 మంది విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాగా.. 4,91,862 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 91.31 ఉత్తీర్ణ‌త శాతం న‌మోదైంది. ఇందులో బాలిక‌లు 93.23 శాతం ఉత్తీర్ణ‌ులుకాగా, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. ఇక 3,927 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు కాగా, ఆరు పాఠశాలల్లో జీరో (సున్నా) ఉత్తీర్ణ‌త శాతం న‌మోదైంది. 

వెబ్‌సైట్‌లో ఏపీ 'టెన్త్' సప్లిమెంటరీ విద్యార్థుల మెమోలు..
ఏపీలో పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్‌ 26న సాయంత్రం విడుదలైన సంగతి తెలిసిందే. అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థుల మార్కుల మెమోలను అందుబాటులో ఉంచారు. ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 1,61,877 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా..మొత్తం 67,115 మంది (62.21 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 59.99 శాతం ఉత్తీర్ణులుకాగా.. బాలికలు 65.96 శాతం ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులు వ్యక్తిగతంగా తమ రోల్ నెంబరు నమోదుచేసి మార్కుల మెమోలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు లాగిన్ వివరాలతో స్కూల్ వారీగా మార్కుల మెమోరాండం, మార్క్స్ మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాల పట్ల సందేహాలుంటే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం అవకాశం కల్పించారు. విద్యార్థులు జూన్ 27 నుంచి జులై 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి సబ్జెక్టు జవాబు పత్రం రీకౌంటింగ్ కోసం రూ.500 చొప్పున విద్యార్థులు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రీవెరిఫికేషన్ కోసం రూ.1000 ఫీజుగా చెల్లించాలి.
పదోతరగతి మార్కుల మెమోల కోసం క్లిక్ చేయండి..

ALSO READ:

శ్రీకొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీలో డిప్లొమా కోర్సు - ప్రవేశాలకు ఇవీ అర్హతలు
ములుగులోని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయం ( Telangana Horticultural University) రెండేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా మొత్తం 200 సీట్లను భర్తీచేయనున్నారు. ఇందులో యూనివర్సిటీ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 120 సీట్లు అందుబాటులో ఉండగా.. అనుబంధ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 80 సీట్లు ఉన్నాయి. అయితే  మొత్తం సీట్లలో 60 శాతం సీట్లను గ్రామీణ విద్యార్థులకే కేటాయించనున్నారు. మిగతా 40 శాతం సీట్లను పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారు. 
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
CPR Full Form in Telugu: సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Task Force for Exam Reforms: పరీక్షా విధానంలో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్: ప్రధాని మోదీ
పరీక్షా విధానంలో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్: ప్రధాని మోదీ

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget