అన్వేషించండి

TS Inter Exams: సెప్టెంబర్‌లో తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు.. వారికి మాత్రమే..

తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్ మరో వారంలో విడుదల కానుంది. పరీక్షలను సెప్టెంబర్‌‌లో నిర్వహించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ఈ పరీక్షలు రాయాలా? వద్దా? అనేది విద్యార్థుల ఐచ్ఛికమేనని చెప్పింది.

తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్ మరో వారంలో విడుదల కానుంది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను సెప్టెంబర్‌ రెండో వారంలో నిర్వహించాలని ఇంటర్మీడియెట్‌ బోర్డు భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ పరీక్షలు రాయాలా? వద్దా? అనేది పూర్తిగా విద్యార్థుల ఐచ్ఛికమేనని అధికారులు వెల్లడించారు.

కాలేజీలు ప్రారంభమై.. క్లాసులు కూడా జరుగుతోన్న తరుణంలో పరీక్షలేంటి అని అనుకుంటున్నారా? ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను ఈ ఏడాది మార్చిలో నిర్వహించాల్సి ఉంది. అయితే కోవిడ్ కారణంగా బోర్డు పరీక్షలు నిర్వహించలేదు. ఫస్టియర్ విద్యార్థులందరినీ సెకండియర్‌లోకి ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది టెన్త్ ఉత్తీర్ణత సాధించి, ఇంటర్మీడియట్ కోర్సులో చేరిన వారి సంఖ్య 4.7 లక్షలుగా ఉంది. వీరంతా పరీక్షలు రాయకుండానే సెకండియర్‌కు ప్రమోట్ అయ్యారు. 

Also Read: TS Eamcet counselling: 30 నుంచి టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్‌.. ఫలితాలు ఎప్పుడంటే?

అభ్యంతరాలు రావడంతో.. 
పరీక్షలు రాయకుండా తర్వాతి సంవత్సరంలోకి ప్రమోట్ చేయడంపై కొందరు విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జాతీయ పోటీ పరీక్షలకు మార్కులే కొలమానమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పరీక్ష రాయాలనుకునే వారికి కోవిడ్ పరిస్థితులు సద్దుమణిగాక పరీక్షలు పెడతామని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్ తీవ్రత కాస్త తగ్గముఖం పట్టడంతో పరీక్షలు జరపాలని యోచిస్తున్నారు. దీనికి సంబంధించి మరో వారంలో షెడ్యూల్ విడుదల చేయాలని భావిస్తున్నారు. 

భిన్న వాదనలు.. 
ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ క్లాసులు జరుగుతున్నాయి. వీరికి చాలా వరకు సిలబస్‌ కూడా పూర్తయింది. ఇలాంటి సమయంలో ఫస్టియర్ పరీక్షలు జరపడం కష్టమనే వాదనలు వినిపిస్తున్నాయి. పరీక్షలు జరపాలంటే కనీసం పక్షం రోజుల ముందుగా షెడ్యూల్‌ ఇవ్వాలని.. విద్యార్థులు తల్లిదండ్రులు అంటున్నారు. వచ్చే వారంలో షెడ్యూల్ విడుదల చేస్తే.. పరీక్షల సమయానికి నెల రోజుల గడువు వస్తుందని అధికారులు చెబుతున్నారు. కొందరు విద్యార్థులు మాత్రం పరీక్షల షెడ్యూల్ త్వరగా విడుదల చేయాలని.. ఆలస్యమైతే సెకండియర్ తరగతులపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల షెడ్యూల్ విడుదలపై గందరగోళం నెలకొంది. పరీక్షల షెడ్యూల్‌పై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సి ఉంది. 

Also Read: School Reopen: తెలంగాణలో స్కూళ్ల రీఓపెన్ ఎప్పుడు? విద్యాశాఖ ఏం చెప్పిందంటే.. మరి సర్కార్ ఒప్పుకుంటుందా?

Also Read: Grand Old 10th Class Student : ఆ 86 ఏళ్ల మాజీ సీఎం టెన్త్ పాసవుతారా? లేదా? నిన్నే ఇంగ్లిష్ పరీక్ష రాశారు...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Viral News: పార్టీకి ఉపయోగపడకుంటే రాజకీయాలు ఎందుకయ్యా? మంత్రి సుభాష్‌కు చంద్రబాబు క్లాస్‌- ఆడియో వైరల్
పార్టీకి ఉపయోగపడకుంటే రాజకీయాలు ఎందుకయ్యా? మంత్రి సుభాష్‌కు చంద్రబాబు క్లాస్‌- ఆడియో వైరల్
APTET Results: ఏపీ టెట్‌-2024 జులై ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీ టెట్‌-2024 జులై ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
Actress Kasturi : తమిళనాడులోని తెలుగువారిపై నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు
తమిళనాడులోని తెలుగువారిపై నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు
Andhra Pradesh News: సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ మద్దతుదారులపై కేసులు- పోలీసులకు జగన్ వార్నింగ్
సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ మద్దతుదారులపై కేసులు- పోలీసులకు జగన్ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఎందుకయ్యా నీకు రాజకీయాలు, మంత్రి వాసంశెట్టికి క్లాస్ పీకిన చంద్రబాబుRohit Sharma Virat Kohli Failures |  హిట్ మ్యాను, కింగు ఇద్దరూ ఆడకపోతే ఎవరిని అని ఏం లాభం | ABP DesamIndia Strategical Failures vs NZ Test Series | గంభీర్ సారు గారి దయతో అప్పన్నంగా అప్పచెప్పాం | ABP DesamRishabh pant out Controversy | రిషభ్ పంత్ అవుటా..నాట్ అవుటా..వివాదం మొదలైంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: పార్టీకి ఉపయోగపడకుంటే రాజకీయాలు ఎందుకయ్యా? మంత్రి సుభాష్‌కు చంద్రబాబు క్లాస్‌- ఆడియో వైరల్
పార్టీకి ఉపయోగపడకుంటే రాజకీయాలు ఎందుకయ్యా? మంత్రి సుభాష్‌కు చంద్రబాబు క్లాస్‌- ఆడియో వైరల్
APTET Results: ఏపీ టెట్‌-2024 జులై ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీ టెట్‌-2024 జులై ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
Actress Kasturi : తమిళనాడులోని తెలుగువారిపై నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు
తమిళనాడులోని తెలుగువారిపై నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు
Andhra Pradesh News: సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ మద్దతుదారులపై కేసులు- పోలీసులకు జగన్ వార్నింగ్
సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ మద్దతుదారులపై కేసులు- పోలీసులకు జగన్ వార్నింగ్
Dil Raju: నేను ట్రాక్ తప్పాను.. నాగ వంశీ ట్రాక్ తప్పలేదు,  ఫెయిల్యూర్స్ ఒప్పుకున్న దిల్ రాజు!
నేను ట్రాక్ తప్పాను.. నాగ వంశీ ట్రాక్ తప్పలేదు, ఫెయిల్యూర్స్ ఒప్పుకున్న దిల్ రాజు!
Telangana News: తెలంగాణలోనే ఉన్న
తెలంగాణలోనే ఉన్న "క" సినిమాలో చెప్పిన క్రిష్ణగిరి- సాయంత్రం 4 గంటలకే చీకటి
Jeevan Pramaan Patra: లైఫ్‌ సర్టిఫికెట్ల ప్రాసెస్‌ ప్రారంభం - ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ఎలా సబ్మిట్‌ చేయాలి?
లైఫ్‌ సర్టిఫికెట్ల ప్రాసెస్‌ ప్రారంభం - ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ఎలా సబ్మిట్‌ చేయాలి?
BC Census: తెలంగాణలో బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్ - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
తెలంగాణలో బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్ - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Embed widget