అన్వేషించండి

Telangana Inter Results 2023: తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో ఏ జిల్లా టాప్‌- ఏ జిల్లా ఉత్తీర్ణత పడిపోయింది?

Telangana Inter Results 2023:తెలంగాణలో ఎంసెట్ వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. జిల్లాల వారీగా ఫలితాలు చూస్తే ఇలా ఉన్నాయి.  

తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు మే 9న విడుదలయ్యాయి. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు.  ఇంటర్ ఫస్టియర్‌లో 63.85 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, సెకండియర్‌లో 67.26 శాతం ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ ఇంటర్ సెకండ్‌ ఇయర్ ఫలితాల్లో 1,73,61 మందికి గ్రేడ్‌-ఎ వచ్చింది. ఇక 54,776 మంది విద్యార్థులకు గ్రేడ్‌-బి వచ్చింది. సెకండ్ ఇయర్‌లో మొత్తం 2,56,241 మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలవారీగా చూస్తే ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్(75.27 %) మొదటి స్థానం, రంగారెడ్డి (72.82 %), కొమరంభీమ్ ఆసిఫాబాద్ (72.96%) మొదటి మూడుస్థానాల్లో నిలిచాయి. అదేవిధంగా సెకండియర్‌ ఫలితాల్లో ములుగు (85.08 %), కొమరంభీమ్ ఆసిఫాబాద్ (80.16 %),  మేడ్చల్(72.27 %) జిల్లాలు మొదటి మూడుస్థానాల్లో నిలిచాయి .

ఫలితాలపై సందేహాలున్న విద్యార్థుల సౌలభ్యం కోసం రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు సబితా వెల్లడించారు. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 4 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులపై ఒత్తిడి ఉండకూడదనే ఈ సారి ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ తొలగింపు.

ఇంటర్ ఫస్ట్ ఇయర్‌ రిజల్ట్స్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంటర్ సెకండ్ ఇయర్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంటర్ ఫస్ట్ ఇయర్‌ జిల్లాల వారీగా చూస్తే టాప్‌ ఉత్తీర్ణత శాతం ఉన్న జిల్లాలు ఇవే 

జిల్లా పేరు   రాసినవాళ్లు పాసైన వాళ్లు  ఉత్తీర్ణత శాతం
మేడ్చల్‌ 62553 47474 75 
రంగారెడ్డి  68289 50433 73 
కుమ్రంభీం 4371 3227  73 
ములుగు 1793 1306 72 
కరీంనగర్  14217  9934 69
హన్మకొండ  17626  12013  68 

ఇంటర్ ఫస్ట్ ఇయర్‌ జిల్లాల వారీగా చూస్తే తక్కువ ఉత్తీర్ణత శాతం ఉన్న జిల్లాలు ఇవే 

జిల్లా పేరు   రాసినవాళ్లు పాసైన వాళ్లు  ఉత్తీర్ణత శాతం
మెదక్‌ 6364 2462  38
నారాయణ పేట్‌ 4088 1712 41 
జయశంకర్ భూపాల్‌పల్లి 1526 690  45

వికారాబాద్‌

7859 3618 46

పెద్ద పల్లి

4458 2055 46

ఈ సంద‌ర్భంగా మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇవాళ 2022-23 ఫ‌లితాల‌ను విడుద‌ల చేశాం. మార్చి 15 నుంచి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాం. విద్యార్థి ద‌శ‌లో ఇంట‌ర్ అనేది కీల‌క‌మైంది. జీవితానికి ట‌ర్నింగ్ పాయింట్. మన రాష్ట్రంలో ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ 9,45,153 మంది హాజ‌ర‌య్యారు. 1473 కేంద్రాల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించాం. 26 వేల మంది సేవ‌లందించారు. ప‌రీక్ష‌లు ప్ర‌శాంతంగా జ‌రిగేందుకు స‌హ‌క‌రించిన అన్ని విభాగాల వారికి ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు అని స‌బితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఎంసెట్ విష‌యంలో ఇంట‌ర్ వెయిటేజీని తీసేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. పిల్ల‌లు ఎవ‌రూ కూడా ఒత్తిడికి గురి కావొద్ద‌నే ఉద్దేశంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని స‌బితా ఇంద్రారెడ్డి స్ప‌ష్టం చేశారు.

ఇంటర్ సెకండ్‌ ఇయర్‌ జిల్లాల వారీగా చూస్తే టాప్‌ ఉత్తీర్ణత శాతం ఉన్న జిల్లాలు ఇవే

జిల్లా పేరు   రాసినవాళ్లు పాసైన వాళ్లు  ఉత్తీర్ణత శాతం
ములుగు  1632 1397  85
కుమ్రంభీమ 4000 3249  81
మేడ్చల్‌ 50821 38446 38446
ఖమ్మం 13339  9964  74
హన్మకొండ  14414 10627 73 

ఇంటర్ సెకండ్‌ ఇయర్‌ జిల్లాల వారీగా చూస్తే తక్కువ ఉత్తీర్ణత శాతం ఉన్న జిల్లాలు ఇవే 

జిల్లా పేరు   రాసినవాళ్లు పాసైన వాళ్లు  ఉత్తీర్ణత శాతం
మెదక్‌ 5320 2785 52 
నాగర్ కర్నూల్ 5110 2791 54
వరంగల్‌ 5729 3358  58 
నారాయణ పేట్‌ 3337 1942 58 
సూర్యపేట 6345 3764 59

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Avatar Fire And Ash First Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ: ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్... హాలీవుడ్ రివ్యూయర్లు ఏమన్నారంటే?
'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ: ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్... హాలీవుడ్ రివ్యూయర్లు ఏమన్నారంటే?

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Avatar Fire And Ash First Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ: ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్... హాలీవుడ్ రివ్యూయర్లు ఏమన్నారంటే?
'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ: ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్... హాలీవుడ్ రివ్యూయర్లు ఏమన్నారంటే?
KTR Comments on Pocharam: ఇలాంటి బతుకు కంటే చనిపోవడమే మేలు - పోచారంపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇలాంటి బతుకు కంటే చనిపోవడమే మేలు - పోచారంపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు
Kadiyam Srihari: కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
Bengalore One Side Love: మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
Upcoming Movies 2027: మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
Embed widget