అన్వేషించండి

TS EDCET Results: ఎడ్‌సెట్ ఫలితాల్లో 96 శాతం ఉత్తీర్ణత !

ఎడ్‌సెట్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

రాష్ట్రంలో బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన‌ టీఎస్ ఎడ్‌సెట్‌-2022 ఫ‌లితాలు విడుద‌లయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండ‌లి చైర్మన్ ప్రొఫెస‌ర్ ఆర్. లింబాద్రి ఆగస్టు 26న సాయంత్రం 4:30 గంట‌ల‌కు ఫలితాలను విడుద‌ల చేశారు. ఎడ్‌సెట్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

TSEDCET 2022 ఫలితాల కోసం క్లిక్ చేయండి..

96 శాతం ఉత్తీర్ణత:
ఈ ఏడాది టీఎస్‌ ఎడ్‌సెట్‌ పరీక్ష జూలై 26న జరిగింది. ఫలితాల్లో మొత్తం 96 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ పరీక్షకు మొత్తం 38,091 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 31,578 మంది హాజరుకాగా వీరిలో 30,580 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో మేడ్చల్‌కు చెందిన అభిషేక్‌ మోహంతికి మొదటి ర్యాంక్‌ సాధించగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆంజనేయులు రెండో ర్యాంక్‌ సాధించాడు. మేడ్చల్‌కు చెందిన ముకేష్‌కు మూడో ర్యాంక్‌, జనగామకు చెందిన మహేష్‌ కుమార్‌కు 4వ ర్యాంక్‌, మేడ్చల్‌కు చెందిన అర్హద్‌ అహ్మద్‌ ఐదో ర్యాంక్‌ దక్కించుకన్నాడు.

 

ఎడ్‌సెట్‌ ర్యాంక్‌ ఆధారంగా 2022-23 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో రెండు సంవత్సరాల బీఈడీ రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశాలకు గానూ తెలంగాణ ఉన్నత విద్యామండలి (TSCHE) తరపున ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎడ్‌సెట్‌ నిర్వహించింది.

 

Also Read:

TS ICET 2022 ఫలితాలు ఎప్పుడంటే?

TS ICET 2022: తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్వహించిన ఐసెట్‌-2022 ఫలితాలను ఆగస్టు 29న విడుదల చేయనున్నారు. వాస్తవానికి ఆగస్టు 22న ఫలితాలు వెల్లడించాల్సి ఉన్నప్పటికీ.. సాంకేతిక కారణాలతో ఫలితాల వెల్లడి వారంపాటు వాయిదాపడింది. ఐసెట్-2022 పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆగస్టు 29న తమ ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాల వెల్లడి తర్వాత అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేది వివరాలు సమర్పించి ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు ర్యాంకు కార్డు కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకా కటాఫ్ మార్కుల వివరాలు కూడా తెలుసుకోవచ్చు. పరీక్షలో అర్హత మార్కులను 25గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి అర్హత మార్కులు లేవు. అభ్యర్థులు ఎప్పటికప్పుడు పూర్తి వివరాలను వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

ఐసెట్ ఫలితాల కోసం వెబ్‌సైట్: https://icet.tsche.ac.in/

ఈ ఏడాది పరీక్ష జులై 27, 28 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో TS ICET -2022  పరీక్ష జరిగింది. వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ పరీక్షల నిర్వహించింది. ఈ పరీక్ష రాసేందుకు తెలంగాణ, ఏపీల్లో కలిపి 90.56 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. 75,952 మంది దరఖాస్తు చేసుకోగా 68,781 మంది హాజరయ్యారు. 7,171 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. ఐసెట్ పరీక్షకు సంబంధించిన ఆన్సర్‌ కీని ఆగస్టు 4న విడుదల చేశారు. ఆన్సర్‌ కీపై  ఆగస్టు 8 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఆగస్టు 22న ఫలితాలు విడుదల చేయాల్సి ఉండగా.. వాయిదా వేశారు. ఆగస్టు 29న వెల్లడించనున్నారు.


Also Read: ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు ఎప్పుడంటే?


తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ICET – 2022) రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి ఏప్రిల్6 నుంచి ప్రారంభించారు. జులై 18 నుంచి పరీక్ష హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. జులై 27, 28 తేదీల్లో పరీక్ష నిర్వహించారు.

TS ICET 2022 పరీక్ష విధానం:
కంప్యూటర్ బేస్డ్ పరీక్ష. ఇందులో 200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు. ప్రశ్నాపత్రం మూడు సెక్షన్‌లుగా విశ్లేషణాత్మక సామర్థ్యం, గణిత సామర్థ్యం, కమ్యూనికేషన్ సామర్థ్యంగా విభజించారు. టీఎస్ ఐసెట్ పరీక్ష ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ మీడియంలో నిర్వహిస్తారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు కేటాయిస్తారు. నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు.


ఈ కోర్సులతో ఉత్తమ భవిత:


ఎంసీఏ:

ఐటీ రంగంలో స్థిరపడాలనుకునేవారికి ఎంసీఏ సరైన ఎంపిక అని చెప్పవచ్చు. ఇందుకు మ్యాథ్స్ పై పట్టు ప్రాక్టికల్ ఓరియంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నవారు ఈ రంగాన్నే ఎంచుకోవచ్చు. ఇందులో ఎక్కువ టెక్నాలజీతో పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి టెక్నాలజీలో వస్తున్న మార్పులకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ దానిపై అవగాహన అధ్యయనం చేయగలగాలి.


ప్రస్తుతం మార్కెట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు ఎక్కువగా అవకాశాలు లభిస్తున్నాయి. ఎంసీఏ పూర్తి చేసుకున్న వారికి ప్రధానంగా ఉపాధి కల్పించేది సాఫ్ట్ వేర్ రంగమే. ఈ కోర్స్ లో చేరినప్పటి నుంచే ప్రోగ్రామింగ్, నైపుణ్యాలపై దృష్టి సారించాలి. ఈ రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలి.

జాబ్ మార్కెట్లో బీటెక్‌తో పోటీ పడాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా కావల్సిన నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తూ సైన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ,బ్లాక్ ఛైన్ టెక్నాలజీ, ఆటోమేషన్, రోబోటిక్స్ తదితర టెక్నాలజీల ముందు వరుసలో నిలుస్తాయి. పరిశ్రమలకు అనుగుణంగా ఆర్ ప్రోగ్రామింగ్ సేల్స్ ఫోర్స్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, యాప్ డెవలప్మెంట్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ వంటి కోర్సుల్లో ప్రావీణ్యం అవసరం. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపికైతే మంచి జీతంతో పాటు చక్కటి కెరీర్ను పొందవచ్చు.

ఎంబీఏ:

నేటి యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్న కోర్సుల్లో ఎంబీఏ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్) మొదటి మూడు స్థానాల్లో కచ్చితంగా ఉంటుంది. ఈ కోర్సు చేయడం వల్ల కార్పొరేట్ రంగంలోని కీలక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ రంగంపై ఆసక్తితో పాటు నాయకత్వ లక్షణాలు ఉన్నవారు ఇందులో త్వరగా రాణిస్తారు. బిజినెస్ స్కిల్స్, టీం మేనేజ్‌మెంట్, టీమ్ లీడింగ్ సామర్థ్యం, ప్రణాళిక, భవిష్యత్ పరిణామాలను అంచనా వేయడం, బృందా పనితీరును మెరుగు పరిచే ఎలా తీర్చిదిద్దడం, సమస్యలు వచ్చినప్పుడు కారణాలు అన్వేషించి, ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఉన్నవారు ఈ కోర్సును ఎంచుకోవచ్చు. ఎంబీఏ పూర్తి చేసిన వారు బిజినెస్ మేనేజర్లు, సీఈఓ, అంతేకాకుండా ఎంటర్ప్రెన్యూర్ గా మారవచ్చు.

ఎంబీఏలో మార్కెటింగ్, హెచ్ఆర్ ,ఫైనాన్స్ తదితర స్పెషలైజేషన్లు ఉంటాయి. ఈ కోర్సు రాణించాలంటే కేస్ స్టడీలను పరిశీలించాలి. అంతేకాకుండా మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లిష్ పై పట్టు మెరుగుపరుచుకోవాలి. అంతేకాకుండా ఎంచుకున్న స్పెషలైజేషన్‌పై ప్రత్యేక ప్రావీణ్యం సంతరించుకోవడంతో పాటు, ప్రాజెక్ట్‌వర్క్ చేయాలి. కార్పొరేట్ రంగంలో ఎందుకు వ్యక్తిగత చొరవ కూడా ఉండాలి.

ప్రతి సంవత్సరం ఎంబీఏ పూర్తి చేసుకొని పెద్ద సంఖ్యలో బయటికి వస్తున్నారు. ఉద్యోగాలు మాత్రం కొందరికే లభిస్తున్నాయి. ఎందుకంటే దీని సరిపడా నైపుణ్యాలు కొంతమంది లోనే ఉంటున్నాయి. కాబట్టి అలా నేర్చుకునే వారికి న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. అలా నేర్చుకున్నవారికి బ్యాంకింగ్, ఫార్మ్, అగ్రికల్చర్, ఇన్సూరెన్స్ ,హెల్త్, ఎఫ్ఎంసీజీ వంటి రంగాల్లో వివిధ స్థాయిల్లో అవకాశాలు లభిస్తాయి.

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 MI VS GT Result Update: గుజ‌రాత్ బోణీ.. ముంబై పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్, MIకి వరుసగా రెండో ఓటమి
గుజ‌రాత్ బోణీ.. ముంబై పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్, MIకి వరుసగా రెండో ఓటమి
Pastor Praveen case: పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
Chandra Babu Latest News: అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

GT vs MI Match Highlights IPL 2025 | ముంబై ఇండియన్స్ పై 36 పరుగుల తేడాతో గుజరాత్ విజయం | ABP DesamMS Dhoni Fastest Stumping vs RCB | వరుసగా రెండో మ్యాచ్ లోనూ ధోని మెరుపు స్టంపింగ్ | ABP DesamMS Dhoni Sixers vs RCB IPL 2025 | యధావిథిగా ధోనీ ఆడాడు..CSK ఓడింది | ABP DesamCSK vs RCB Match Highlights IPL 2025 | 17ఏళ్ల తర్వాత చెన్నైలో ఆర్సీబీపై ఓటమి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 MI VS GT Result Update: గుజ‌రాత్ బోణీ.. ముంబై పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్, MIకి వరుసగా రెండో ఓటమి
గుజ‌రాత్ బోణీ.. ముంబై పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్, MIకి వరుసగా రెండో ఓటమి
Pastor Praveen case: పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
Chandra Babu Latest News: అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
Hardik Pandya :బూతు పదంతో సాయికిషోర్‌న తిట్టిన హార్దిక పాండ్యా, సోషల్ మీడియాలో వీడియో వైరల్
బూతు పదంతో సాయికిషోర్‌న తిట్టిన హార్దిక పాండ్యా, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Operation Brahma: మయన్మార్ చేరుకున్న NDRF రెస్క్యూ బృందాల విమానాలు, ఆర్సీ, మెడికల్ టీమ్‌లను పంపిన భారత్  
మయన్మార్ చేరుకున్న NDRF రెస్క్యూ బృందాల విమానాలు, ఆర్సీ, మెడికల్ టీమ్‌లను పంపిన భారత్  
Hyderabad Metro Latest Timings: మారిన హైదరాబాద్‌ మెట్రో టైమింగ్స్‌- ఏప్రిల్‌ 1 నుంచి అమలు!
మారిన హైదరాబాద్‌ మెట్రో టైమింగ్స్‌- ఏప్రిల్‌ 1 నుంచి అమలు!
US-Canada Tariff War: ట్రంప్ టారిఫ్ విధానంతో అమెరికాలో టాయిలెట్ పేపర్ కొరత!
ట్రంప్ టారిఫ్ విధానంతో అమెరికాలో టాయిలెట్ పేపర్ కొరత!
Embed widget