Telangana Budget 2023: కాంట్రాక్ట్ ఉద్యోగులకు వరాలు, రాష్ట్రంలో మరిన్ని ఐటీ టవర్లు, పరిశ్రమలకు రూ.4,037 కోట్లు!
ఇచ్చిన మాటప్రకారం ఏప్రిల్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరణ, సెర్ఫ్ ఉద్యోగుల పేస్కేల్ సవరణ చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఫిట్ మెంట్.
తెలంగాణలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఇచ్చిన మాటప్రకారం ఏప్రిల్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరణ, సెర్ఫ్ ఉద్యోగుల పేస్కేల్ సవరణ చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా అంగన్ వాడీ, ఆశా, ఇంకా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఫిట్ మెంట్ ఇవ్వటం, దానిని ఏకకాలంలో వర్తింపచేయటం దేశంలోనే ప్రథమం. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తుల మేరకు కొత్త ఈహెచ్‌ఎస్ విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. గతంలో స్థానికులకు 60 నుంచి 80 శాతం వరకు మాత్రమే లోకల్ రిజర్వేషన్లు ఉండేది. ఇప్పుడు అమలు చేస్తున్న నూతన నియామక విధానంతో అటెండర్ నుంచి ఆర్డీవో దాకా స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి హరీశ్‌వారు బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. కొత్త నియామకాలు ఈ పద్ధతిలోనే జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
కొత్త ఉద్యోగుల జీతభత్యాల కోసం రూ.1000 కోట్లు
రాష్ట్రప్రభుత్వం 2014 జూన్ నుంచి ఫిబ్రవరి 2022 దాకా ప్రత్యక్ష నియామక విధానం ద్వారా 1,61,572 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటిలో 1,41735 పోస్టుల ప్రక్రియ పూర్తయింది. కొత్త ఉద్యోగుల జీతభత్యాల కోసం ఈ బడ్జెట్లో రూ.1000 కోట్లు అదనంగా ప్రతిసాదిస్తున్నామన్నారు. ఇప్పటివరకు కొత్తంగా 31,198 పోలీసు ఉద్యోగాల కల్పన చేసినట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.
పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ చట్టం విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చింది. పరిశ్రమల స్థాపనకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ అత్యంత సులభతరంగా మారింది. ఐటీ ఉద్యోగాల నియామకాల్లో కూడా 156 శాతం వృద్ధి ఉండటం విశేషం. ఐటీ ఎగుమతుల్లో 2021-22 సంవత్సరానికి గాను 26.14 శాతం వృద్ధితో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఐటీరంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకూ విస్తరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వరంగల్, కరీంనగర్, ఖమ్మంలలో ఐటీ టవర్లను నిర్మించింది. నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్లగొండ మరియు సిద్దిపేటలో ఐటీ టవర్లు నిర్మాణంలో ఉన్నాయి. వీటిని ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభిస్తాం. పరిశ్రమల శాఖకు ఈ బడ్జెట్లో రూ.4,037 కోట్లు ప్రతిపాదిస్తున్నామన్నారు. గతేడాది ఐటీరంగంలో లక్షా 49 వేల 506 ఉద్యోగాలను సృష్టించినట్లు మంత్రి వెల్లడించారు.
తెలంగాణ బడ్జెట్ 2023 - 24 ను అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,90,396 కోట్లతో భారీ బడ్జెట్ ను రూపొందించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.37,525 కోట్లు. ఇందులో వివిధ శాఖలకు, సంక్షేమ పథకాలకు, అభివృద్ధి ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో అభివృద్ధి అందుకే సాధ్యమైంది, వాటికన్నా ముందున్నాం - ఆర్థిక మంత్రి హరీశ్‌రావు
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుందని చెప్పారు మంత్రి హరీశ్‌రావు. బడ్జెట్ 2023-24 సభలో ప్రవేశ పెట్టిన ఆయన.. తెలంగాణ అభివృద్ధిని సభకు వివరించారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు రెండేళ్లలో జీఎస్డీపీ వార్షిక వృద్ధి రేటు 12 శాతం మాత్రమే ఉండేదన్నారు. ఇది జాతీ వృద్ధి రేటు 13.4 శాతం కంటే తక్కువగా ఉండేదన్నారు. పతనమైన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అందుకే క్రమంగా జీఎస్డీపీ పెరుగుతూ వచ్చిందని వివరించారు. ప్రభుత్వ ఆదాయాన్ని ఆత్యధికంగా పెట్టుబడి వ్యయానికి వినియోగించడం... అభివృద్ధికి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇవ్వడంతో అభివృద్ధి సాధ్యమైందని అన్నారు.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..