అన్వేషించండి

TGBIE Supplementary Results: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

Inter Supply Results: తెలంగాణలో ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు.

TG Inter Supplementary Results: తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్ 24న విడుదలయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షల జనరల్, వొకేషనల్, జనరల్ బ్రిడ్జ్ కోర్సు, వొకేషనల్ బ్రిడ్జ్ కోర్సుల ఫలితాలను ఇంటర్ బోర్డు ఒకేసారి విడుదల చేసింది.  సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులతోపాటు, ఇంటర్ మొదటి సంవత్సరం ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల మార్కులను కూడా వెల్లడించారు. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఇతర వెబ్‌సైట్‌లలోనూ ఫలితాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, తదితర వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. 

ఇంట‌ర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో జనరల్ విభాగంలో 63.86 శాతం, వొకేష‌న‌ల్‌లో 53.24 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక ద్వితీయ సంవత్సరంలో జనరల్ విభాగంలో 43.77 శాతం, వొకేష‌నల్‌లో 51.12 శాతం ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో మొత్తం 70.26 శాతం బాలిక‌లు ఉత్తీర్ణత సాధించగా, 58.39 శాతం బాలురు ఉత్తీర్ణులయ్యారు. ఇక రెండో సంవత్సరం ఫలితాల్లో 47.54 శాతం బాలికలు, 41.37 శాతం బాలురు విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు ఇలా చూసుకోండి..

➥ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం మొదట ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.- https://tsbie.cgg.gov.in/  

➥ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి. 

➥ అక్కడ వచ్చే పేజీలో విద్యార్థులు తమ  హాల్‌టికెట్ నెంబర్‌, తదితర వివరాలు నమోదుచేసి  SUBMIT బటన్‌పై క్లిక్ చేయాలి.

➥ వివరాలు నమోదుచేయగానే విద్యార్థి మార్కుల వివరాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.

➥ విద్యార్థులు తమ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం క్లిక్ చేయండి.. 

ఈ ఏడాది మే 24 నుంచి జూన్ 3 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 4.5 లక్షల మంది వరకు విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులతోపాటు, ఇంటర్ మొదటి సంవత్సరం ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు కూడా ఉన్నారు. గత అనుభవాల నేపథ్యంలో పరీక్షల మూల్యాంకనంలో ఎలాంటి తప్పులు జరగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. విద్యార్థుల మార్కుల డీకోడింగ్, ఆన్‌లైన్‌లో మార్కుల నమోదు ప్రక్రియ పూర్తికావడంతో ఫలితాల వెల్లడికి ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తర్వాత ఫలితాలను అప్‌లోడ్ చేశారు. మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జవాబు పత్రాలను మూడేసి సార్లు క్షుణ్నంగా పరిశీలించారు.

ఈ ఏడాది ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలతోపాటు, ఫస్టియర్ ఇంప్రూవ్‌మెంట్ కోసం రాసిన విద్యార్థులు దాదాపు 4.5 లక్షల మంది వరకు ఉన్నారు. ఇప్పటికే ఎప్‌సెట్ పరీక్ష ఫలితాలు వెల్లడి కావడం, మరోవైపు దోస్త్ రెండు విడతల కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇంటర్ పాసైన విద్యార్థులు ఎప్‌సెట్ అర్హత ఉంటే.. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి అర్హత పొందుతారు. ఎప్‌సెట్ అర్హత లేనవారు దోస్త్ ద్వారా డిగ్రీ కోర్సుల్లో చేరే అవకాశం ఉంటుంది.  

తెలంగాణలో ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షలకు మొత్తం 9.80 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ ఫస్టియర్‌లో 60.01 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్ విద్యార్థులు 64.19 శాతం పాసయ్యారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలను తాజాగా ఇంటర్ బోర్డు విడుదల చేసింది.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

JNVST 2027 Registration: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఇదే చివరి అవకాశం! ఫారం నింపడానికి నేడే లాస్ట్‌ డేట్! 
నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఇదే చివరి అవకాశం! ఫారం నింపడానికి నేడే లాస్ట్‌ డేట్! 
NMMSS Scholarship 2026-27 : NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget