అన్వేషించండి

SRTRI Courses: స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో ఉచిత శిక్షణ, ప్రవేశాలు ఎలా అంటే?

తెలంగాణ‌లోని గ్రామీణ నిరుద్యోగ యువతకు వివిధ కోర్సులో ఉచిత నైపుణ్య శిక్షణ కోసం యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్‌పూర్ గ్రామంలోని స్వామి రామానందతీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ దరఖాస్తులు కోరుతోంది.

Admission Notification 2023: తెలంగాణ‌(Telangana)లోని గ్రామీణ నిరుద్యోగ యువతకు వివిధ కోర్సులో ఉచిత నైపుణ్య శిక్షణ(Free Trying ) కోసం యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri ) జలాల్‌పూర్ గ్రామంలోని స్వామి రామానందతీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ (Swami Ramananda Theertha Rural Institute) దరఖాస్తులు కోరుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకమైన 'దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (Deen Dayal Upadhyay Grameen Kaushalya Yojana)' కింద ఈ శిక్షణ కొనసాగనుంది. ఈ నైపుణ్య కోర్సులకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండి.. 8వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు ఉచిత నివాస, భోజన వసతులు కల్పిస్తారు. ఈ శిక్షణ కోర్సుల్లో ప్రవేశాలు కోరేవారు ఒరిజినల్ సర్టిఫికేట్లతో జనవరి 2న సంస్థలో హాజరుకావాల్సి ఉంటుంది.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ..తెలంగాణ ప్రభుత్వానికి చెందిన స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో గ్రామీణ/పట్టణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగం కల్పిస్తారు. అభ్యర్థులకు శిక్షణ అనంతరం ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు ప్రారంభ వేతనంగా రూ.6000 - రూ.8000 వరకు ఉంటుంది. ఆ తర్వాత 6 నెలల నుంచి ఏడాది కాలంలో నిబంధనల ప్రకారం వేతన పెంపు ఉంటుంది. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 9133908000, 9133908111, 913390822, 9949466111 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.

వివరాలు...

➥ బేసిక్‌ కంప్యూటర్స్‌ (డేటా ఎంట్రీ ఆపరేటర్)

కోర్సు వ్యవధి: 3 నెలలు.

అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత.

➥ అకౌంట్స్ అసిస్టెంట్(ట్యాలీ)

కోర్సు వ్యవధి: 3 నెలలు.

అర్హత: బీకాం ఉత్తీర్ణత.

➥ కంప్యూటర్ హార్డ్‌వేర్ అసిస్టెంట్

కోర్సు వ్యవధి: 3 నెలలు.

అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత.

➥ ఆటోమొబైల్- టూ వీలర్ సర్వీసింగ్

కోర్సు వ్యవధి: 3 నెలలు.

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత.

➥ సెల్‌ఫోన్ & ఎలక్ట్రానిక్ డివైజ్ రిపేర్

కోర్సు వ్యవధి: 4 నెలలు.

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత.

➥ ఎలక్ట్రీషియన్ (డొమెస్టిక్): 05 నెలలు

అర్హత: పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణత.

➥ సోలార్ సిస్టమ్ ఇన్‌స్టలేషన్/ సర్వీస్: 04 నెలలు

అర్హత: పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఆధార్‌కార్డు, ఇన్‌కం సర్టిఫికెట్‌, జిరాక్స్ కాపీలు, ఫొటోలతో సంస్థ చిరునామాలో సంప్రదించాలి.

ఎంపిక విధానం: నిబంధనల మేరకు.

కౌన్సెలింగ్‌కు హాజరయ్యేవారు వెంట తీసుకురావాల్సినవి..

➥ విద్యార్హతకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్లు

➥ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు

➥ రేషన్ కార్డు

➥ ఆధార్‌కార్డు

➥ ఇన్‌కం సర్టిఫికెట్ 

➥ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలు, ఫొటోలు

కౌన్సెలింగ్ తేది: 02.01.2024 ఉదయం 10 గంటల నుంచి.

చిరునామా:
Swamy Ramananda Tirtha Rural Institute (SRTRI)
Jalalpur (V), Bhoodan Pochampally (M)
Yadadri Bhuvanagiri Dist. – 508 284.
Telangana State-India.

Website

ALSO READ:

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 484 ఖాళీలు, ఈ అర్హతలుండాలి
ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్- దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 484 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎస్‌ఎస్‌సీ/ పదో తరగతి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana CM Revanth Reddy : కృష్ణాజలాలపై చర్చకు సిద్ధమా- కేసీఆర్‌కు సభలో రేవంత్ సవాల్‌
కృష్ణాజలాలపై చర్చకు సిద్ధమా- కేసీఆర్‌కు సభలో రేవంత్ సవాల్‌
Kurnool Crime News: కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య- ప్రాణం తీసిన రాజకీయ కక్షలు
కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య- ప్రాణం తీసిన రాజకీయ కక్షలు
Telangana Assembly Sessions : తెలంగాణలో సీఎం ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేసిన బీఆర్‌ఎస్- అసెంబ్లీ నుంచి వాకౌట్‌ 
తెలంగాణలో సీఎం ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేసిన బీఆర్‌ఎస్- అసెంబ్లీ నుంచి వాకౌట్‌ 
David Warner: నితిన్ 'రాబిన్ హుడ్'లో వార్నర్ ఎలా ఉంటారో తెలుసా? - అతను వెండితెరపై మెరిసే సమయం ఆసన్నమైందంటూ లుక్ రిలీజ్
నితిన్ 'రాబిన్ హుడ్'లో వార్నర్ ఎలా ఉంటారో తెలుసా? - అతను వెండితెరపై మెరిసే సమయం ఆసన్నమైందంటూ లుక్ రిలీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Naga babu Indirect Counters on Varma | టీడీపీ ఇన్ ఛార్జి వర్మపై నాగబాబు పరోక్ష కౌంటర్లు | ABP DesamPawan Kalyan on Tamil Movies | భారతదేశం ఏమన్నా కేకు ముక్క కోసుకోవటానికి.? | ABP DesamPawan Kalyan on his Ideology | పూటకో పార్టీతో ఉంటావనే వాళ్లకు ఇదే నా ఆన్సర్ | ABP DesamPawan Kalyan on Tamilnadu Language Fight | హిందీ, తమిళ్, కన్నడ, మరాఠీలో మాట్లాడి మేటర్ చెప్పిన పవన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana CM Revanth Reddy : కృష్ణాజలాలపై చర్చకు సిద్ధమా- కేసీఆర్‌కు సభలో రేవంత్ సవాల్‌
కృష్ణాజలాలపై చర్చకు సిద్ధమా- కేసీఆర్‌కు సభలో రేవంత్ సవాల్‌
Kurnool Crime News: కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య- ప్రాణం తీసిన రాజకీయ కక్షలు
కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య- ప్రాణం తీసిన రాజకీయ కక్షలు
Telangana Assembly Sessions : తెలంగాణలో సీఎం ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేసిన బీఆర్‌ఎస్- అసెంబ్లీ నుంచి వాకౌట్‌ 
తెలంగాణలో సీఎం ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేసిన బీఆర్‌ఎస్- అసెంబ్లీ నుంచి వాకౌట్‌ 
David Warner: నితిన్ 'రాబిన్ హుడ్'లో వార్నర్ ఎలా ఉంటారో తెలుసా? - అతను వెండితెరపై మెరిసే సమయం ఆసన్నమైందంటూ లుక్ రిలీజ్
నితిన్ 'రాబిన్ హుడ్'లో వార్నర్ ఎలా ఉంటారో తెలుసా? - అతను వెండితెరపై మెరిసే సమయం ఆసన్నమైందంటూ లుక్ రిలీజ్
Telangana Latest News: తప్పుగా మాట్లాడలేదు, జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్‌ ఎత్తేయండి- స్పీకర్‌కు బీఆర్‌ఎస్ రిక్వస్ట్ 
తప్పుగా మాట్లాడలేదు, జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్‌ ఎత్తేయండి- స్పీకర్‌కు బీఆర్‌ఎస్ రిక్వస్ట్ 
Prakash Raj: 'ప్లీజ్.. పవన్ కల్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి' - తమిళులపై పవన్ కామెంట్స్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
'ప్లీజ్.. పవన్ కల్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి' - తమిళులపై పవన్ కామెంట్స్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
Kakinada latest News: పోటీ ప్రపంచంలో బతకలేరని పిల్లల్ని క్రూరంగా చంపేసిన తండ్రి- కాకినాడలో ఘాతుకం 
పోటీ ప్రపంచంలో బతకలేరని పిల్లల్ని క్రూరంగా చంపేసిన తండ్రి- కాకినాడలో ఘాతుకం 
Pawan Kalyan Hindi Comments: Bro... ఎందుకు వాళ్లని అనవసరంగా కెలకడం.. ?
Bro... ఎందుకు వాళ్లని అనవసరంగా కెలకడం.. ?
Embed widget