అన్వేషించండి

Five years Law Course: ఇంటర్ తర్వాత మూడేళ్ల లా డిగ్రీ పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

ఇంటర్ తర్వాత నేరుగా మూడేళ్ల కోర్సుకు సాధ్యాసాధ్యాలపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రస్తుతం అమల్లో విధానం బాగానే ఉందంటూ.. పిటిషన్‌పై విచారణ జరిపేందుకు నిరాకరించింది.

Five Years Law Degree: ఇంటర్ లేదా తత్సమాన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత నేరుగా మూడేళ్ల లా కోర్సు (LLB Degree) చదివేందుకు అవకాశం ఉండాలని అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న కోర్సు విధానం బాగానే ఉందని స్పష్టంచేస్తూ.. పిటిషన్‌పై విచారణ జరిపేందుకు నిరాకరించింది. తక్షణమే పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని కోరింది.

ప్రస్తుతం లా కోర్సుల్లో అర్హతలకు సంబంధించి.. డిగ్రీ పూర్తిచేసినవారు మూడేళ్ల లా కోర్సులో, ఇంటర్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులైన వారు అయిదేళ్ల లా కోర్సులో చేరడానికి అర్హులు. అయితే, ఇంటర్ తర్వాత నేరుగా మూడేళ్ల కోర్సుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని నియమించేలా కేంద్రం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఆదేశించాలని కోరుతూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ పిటిషన్ దాఖలు చేశారు. మేధావులైన విద్యార్థులు మూడేళ్లలోనే న్యాయవాద కోర్సును పూర్తి చేయగలరని, ప్రస్తుత విధానం వల్ల అయిదేళ్ల కోర్సుతో వారికి సమయం వృథా అవుతుందన్నారు. ఈ విధానం వల్ల పేదలు, అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

ధర్మాసనం అసహనం..
ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘‘మూడేళ్లు కూడా ఎందుకు? హైస్కూల్‌పూర్తవగానే నేరుగా లా ప్రాక్టీస్‌ మొదలు పెట్టేయండి’’ అంటూ పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవిద్యకు అయిదేళ్ల కోర్సు కూడా సరిపోతదని, కానీ ప్రస్తుత విధానం సరైన మార్గంలోనే పనిచేస్తోందని కోర్టు తెలిపింది. ఇక దీనిపై ఆలోచించడానికి ఏమీ లేదు. ప్రస్తుతం జిల్లాస్థాయి న్యాయవ్యవస్థల్లో 70 శాతం మంది మహిళలు ఉన్నారు. రానున్న రోజుల్లో మరింతమంది స్త్రీలు లా కోర్సుల్లో చేరతారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వెంటనే పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని కోర్టు ఆదేశించింది.

ALSO READ:

తెలంగాణ లాసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు..
టీఎస్‌ లాసెట్‌, పీజీఎల్‌‌సెట్‌ 2024 దరఖాస్తు గడువును ఉస్మానియా యూనివర్సిటీ పొడిగించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అయితే రూ.500 ఆలస్యరుసుముతో మే 4 వరకు, రూ.1000 ఆలస్యరుసుముతో మే 11 వరకు, రూ.2000 ఆలస్యరుసుముతో మే 18 వరకు, రూ.4000 ఆలస్యరుసుముతో మే 25 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్‌ (Lawcet Application Edit) చేసుకునేందుకు మే 20 నుంచి 25 వరకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు మే 30 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 
తెలంగాణ లాసెట్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

ఏపీలాసెట్ దరఖాస్తుకు ఏప్రిల్ 25 వరకు అవకాశం..
ఏపీలో లాసెట్, పీజీఎల్ సెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 22న లాసెట్, పీజీఎల్ సెట్ నోటిఫికేషన్ విడుదల కాగా.. మార్చి 23 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు మొదలైంది. అభ్యర్థుల నుంచి మార్చి 23 నుంచి ఏప్రిల్ 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే రూ.500 ఆలస్య రుసుముతో మే 3 వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో మే 11 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో మే 20 వరకు, రూ.3000 ఆలస్య రుసుముతో మే 29 వరకు  దరఖాస్తులు సమర్పించవచ్చు. 
ఏపీ లాసెట్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 3 Hall Tickets: తెలంగాణలో గ్రూప్‌ 3 ఎగ్జామ్ హాల్‌ టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్‌ 3 ఎగ్జామ్ హాల్‌ టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్
KTR News: రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్
రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్
Pushpa 2: ‘పుష్ప 2’ నా కోసం వెయిటింగ్ - అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసిన థమన్!
‘పుష్ప 2’ నా కోసం వెయిటింగ్ - అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసిన థమన్!
Sajjala Bhargava Reddy: సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 3 Hall Tickets: తెలంగాణలో గ్రూప్‌ 3 ఎగ్జామ్ హాల్‌ టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్‌ 3 ఎగ్జామ్ హాల్‌ టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్
KTR News: రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్
రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్
Pushpa 2: ‘పుష్ప 2’ నా కోసం వెయిటింగ్ - అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసిన థమన్!
‘పుష్ప 2’ నా కోసం వెయిటింగ్ - అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసిన థమన్!
Sajjala Bhargava Reddy: సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
Ministry of Sex: రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్
రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్
KCR: త్వరలో ప్రజల్లోకి కేసీఆర్- మొదట కాంగ్రెస్ ప్రభుత్వ బాధితుల వద్దకే !?
త్వరలో ప్రజల్లోకి కేసీఆర్- మొదట కాంగ్రెస్ ప్రభుత్వ బాధితుల వద్దకే !?
Delhi Ganesh: తమిళ చిత్ర పరిశ్రమకు షాక్ - ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత!
తమిళ చిత్ర పరిశ్రమకు షాక్ - ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత!
Tiger Tension: రెండు రాష్ట్రాల ప్రజల్ని వణికిస్తున్న పులి, సాయంత్రం నుంచి ఒంటరిగా వెళ్లవద్దని ప్రజలకు సూచనలు
Tiger Tension: రెండు రాష్ట్రాల ప్రజల్ని వణికిస్తున్న పులి, సాయంత్రం నుంచి ఒంటరిగా వెళ్లవద్దని ప్రజలకు సూచనలు
Embed widget