అన్వేషించండి

Supreme Court Judges: సుప్రీంకోర్టులో పెరగనున్న న్యాయమూర్తుల సంఖ్య! కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం!

Supreme Court Judges: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 38కి పెంచే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం.
  • పెండింగ్ కేసుల పరిష్కారం, న్యాయవ్యవస్థ సామర్థ్యం పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం.
  • 1956 నాటి సుప్రీంకోర్టు చట్టాన్ని సవరించడానికి పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టనున్నారు.
  • న్యాయమూర్తుల జీతభత్యాలు, ఇతర ఖర్చులు కన్సాలిడేటెడ్ ఫండ్స్ నుంచి భరిస్తారు.

Supreme Court Judgesభారత్‌ న్యాయవ్యవస్థలో పేరుకుపోతున్న కేసుల పరిష్కారానికి వేగం పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన కేంద్రమంత్రిమండలి, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. ఈ నిర్ణయం ప్రకారం, దేశ అత్యున్నత న్యాయస్థానంలో చీఫ్‌ జస్టిస్‌్ ఆఫ్ ఇండియాతో కలిసి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 38కి చేరుకుంటుంది. 

ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి మొత్తం 34 మంది న్యాయమూర్తులు విధులు నిర్వహించేందుకు అనుమతి ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఈ సంఖ్యను మరో నలుగురు పెంచాలని నిర్ణయించింది. అంటే కొత్త సవరణ తర్వాత సుప్రీంకోర్టు 37 మంది న్యాయమూర్తులు, ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. 

Also Read: సహజీవనంలో బిడ్డను కన్న యువతి - తేడా వచ్చిందని రేప్ కేసు - సుప్రీంకోర్టు ఏమన్నదంటే ?

కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వివరాలను వెల్లడిస్తూ, సుప్రీంకోర్టు పని తీరును మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. దీని కోసం ప్రభుత్వం సుప్రీం కోర్టు సవరణ బిల్లు 2026ను పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనుంది. ఈ బిల్లు ద్వారా 1956 నాటి అసలు చట్టానికి సవరణలు చేస్తారు.

సుప్రీంకోర్టులో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వేల సంఖ్యలో ఉన్న పెండింగ్ కేసుల వల్ల న్యాయం అందడంలో జాప్యం జరుగుతోందనే ఆందోలన ఉంది. న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం వల్ల అత్యున్నత న్యాయస్థానం మరింత సమర్థవంతంగా, ప్రభావవంతంగా పని చేయడానికి వీలవుతుంది. కేసుల విచారణ వేగవంతమై, సామాన్య ప్రజలకు త్వరితగతిన న్యాయ అందుతుంది. రాజ్యాంగ ధర్మాసనాలు, ఇతర కీలక కేసుల విచారణకు అవసరైన న్యాయమూర్తుల లభ్యత పెరుగుతుంది. 

Also Read: శబరిమలలోకి మహిళల ప్రవేశంపై ఆంక్షలకు కేంద్రం మద్దతు! సుప్రీంకోర్టు అఫిడవిట్ దాఖలు!

కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన ఈ ప్రతిపాదన ఇప్పుడు బిల్లు రూపంలో పార్లమెంట్‌ వస్తుంది. రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించిన తర్వాత, రాష్ట్రపతి సంతకంతో ఇది చట్టంగా మారుతుంది. అప్పుడు అధికారికంగా సుప్రీంకోర్టులో 38 మంది న్యాయమూర్తుల నియామకానికి మార్గం సుగమమవుతుంది.

పెరగనున్న న్యాయమూర్తుల సంఖ్యను అనుగుణంగా వారి జీతభత్యాలు, సిబ్బంది ఖర్చులు, ఇతర మౌలిక సదుపాయాల కోసం అయ్యే వ్యయాన్ని భారత కన్సాలిడేటెడ్‌ ఫండ్స్‌ నుంచి భరించనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. 

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పరిణామ క్రమం 

భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు ఏర్పడినప్పుడు, న్యాయమూర్తుల సంఖ్య చాలా పరిమితంగా ఉండేది. 1956లో చేసిన సుప్రీంకోర్టు చట్టం ప్రకారం తొలుత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి కేవలం 10 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉండేవారు. కాలక్రమేణా కేసుల భారం పెరగడంతో ఈ సంఖ్యను ప్రభుత్వం పలుమార్లు సవరించింది. 1960లో న్యాయమూర్తుల సంఖ్యను 13కు పెంచారు. తర్వాత కాలంలో 17కు పెరిగింది. 1986లో ఈ సంఖ్య 25కు పెంచారు. 2009లో  సంఖ్యను 30 చేశారు. 2019లో సవరణ చేసి 30 నుంచి 33 చేశారు. ఇప్పుడు 33 నుంచి 37కు పెంచారు. దీనికి సీజేఐ అదనం.     

Frequently Asked Questions

కేంద్ర మంత్రిమండలి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ఎంత పెంచాలని నిర్ణయించింది?

సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను మరో నలుగురు పెంచాలని కేంద్రమంత్రిమండలి నిర్ణయించింది. దీనితో ప్రధాన న్యాయమూర్తితో కలిసి మొత్తం 38 మంది న్యాయమూర్తులు ఉంటారు.

న్యాయమూర్తుల సంఖ్య పెంపునకు గల కారణమేమిటి?

భారత న్యాయవ్యవస్థలో పేరుకుపోతున్న కేసులను వేగంగా పరిష్కరించడానికి, న్యాయం అందడంలో జాప్యాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ పెంపునకు సంబంధించి ప్రభుత్వం పార్లమెంట్‌లో ఏ బిల్లు ప్రవేశపెట్టనుంది?

ఈ మార్పుల కోసం ప్రభుత్వం 'సుప్రీం కోర్టు సవరణ బిల్లు 2026'ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ఇది 1956 నాటి చట్టానికి సవరణలు చేస్తుంది.

పెరిగిన న్యాయమూర్తుల జీతభత్యాలు, ఇతర ఖర్చులను ఎవరు భరిస్తారు?

పెరిగిన న్యాయమూర్తుల జీతభత్యాలు, సిబ్బంది ఖర్చులు, మౌలిక సదుపాయాల కోసం అయ్యే వ్యయాన్ని భారత కన్సాలిడేటెడ్‌ ఫండ్స్‌ నుంచి ప్రభుత్వం భరిస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?

వీడియోలు

Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget