అన్వేషించండి

Sabarimala: శబరిమలలోకి మహిళల ప్రవేశంపై ఆంక్షలకు కేంద్రం మద్దతు! సుప్రీంకోర్టు అఫిడవిట్ దాఖలు!

Sabarimala: శబరిమల ఆలయంలో పది నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం సమర్థించింది. ఇది మత విశ్వాసాలకు, సంప్రదాయ స్వయంప్రతిపత్తికి సంబంధించిన అంశమని స్పష్టం చేసింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు కీలక విచారణ ప్రారంభించింది.
  • మత విశ్వాసాలు, రాజ్యాంగ హక్కుల మధ్య సమతుల్యతపై న్యాయస్థానం దృష్టి సారించింది.
  • ఆచారాలు, అస్పృశ్యత, వివక్షపై న్యాయస్థానం కీలక ప్రశ్నలు అడిగింది.
  • శాసనసభలు, న్యాయస్థానాల పాత్రపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

Sabarimala: దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్న శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టులో కీలక విచారణ కొనసాగుతోంది. ప్రదాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నాయకత్వంలోని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఈ సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న రివ్యూ పిటిషన్లపై విచారణ ప్రారంభించింది. కేరళలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ విచారణ రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ధర్మాసనంలో జస్టిస్‌లు బీవీ నాగరత్నం, ఎంఎం సుందరేష్‌, అహసానుద్దీన్‌ అమానుల్లా సహా తొమ్మిది మంది న్యాయమూర్తులు ఉన్నారు. 

తుషార్ మెహతా వాదనలు

కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్‌ తుషార్ మెహతా తన వాదనలు బలంగా వినిపించారు. శబరిమల ఆలయానికి సంబంధించి మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలు పూర్తిగా మతపరమైన విశ్వాసాలకు సంబంధించినవని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 25వ అధికరణం కల్పించిన మత స్వేచ్ఛను ప్రస్తావిస్తూ మతపరమైన ఆచారాలు ప్రజలకు భావాలకు, నైతికత, ఆరోగ్యం, వంటి అంశాలకు భంగం కలిగించినప్పుడు మాత్రమే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని ఆయన వాదించారు. 

మతపరమైన గ్రంథాలను అర్థం చేసుకోవడం, అవి ఏవీ నిర్దేశిస్తున్నయో నిర్ణయించడం న్యాయసమీక్ష పరిధిలోకి రాదని, దీనికి ఆధ్యాత్మిక మతపరమైన ఆచారం అనేది నిర్ణయించడానికి న్యాయస్థానాలు ప్రయత్నించడం సరైనది కాదని ఆయన వాదించారు. 

2018 నాటి తీర్పుపై  అభ్యంతరం 

2018 నాటి శబరిమల తీర్పులో మహిళల ప్రవేశానికి అస్పృశ్యత కిందకు వస్తుందని అప్పటి ధర్మాసనం చేసిన వ్యాఖ్యలపై తుషార్ మొహతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై జస్టిస్ బీవీ నాగరత్న స్పందిస్తూ, ఒక మహిళను నెలలో మూడు రోజులు అంటరాని వ్యక్తిగా చూసి, నాలుగో రోజు ఆమె అస్పృశ్యరాలు కాదని చెప్పడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. 

అయితే మెహతా దీనికి సమాధానం ఇస్తూ శబరిమల విషయంలో ఆంక్షలు కేవలం వయసు ఆధారంగానే ఉన్నాయని, ఇది రుతక్రమంతో ముడిపడి లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఇతర అయ్యప్పస్వామి దేవాలయాల్లో ఇన్ని వయసుల మహిళలకు ప్రవేశం ఉందని, శబరిమల విషయంలో ఉన్న ఆంక్షలు ఒక ప్రత్యేక సందర్భం అని ఆయన వివరించారు. 

ఒక వేళ ఏదైనా అశాస్త్రీయమైన ఆచారం ఉంటే, దానిని పరిష్కరించే బాధ్యత శాసనసభలకే ఉంటుందని కేంద్రం వాదించింది. దీనిపై జస్టిస్‌ బాగ్చీ స్పందిస్తూ, న్యాయస్థానాలు సైన్స్ రంగంలో నిపుణులు కాకపోయినప్పటికీ, ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం నిపుణులు అభిప్రాయాలను సమీక్షించే అధికారం కోర్టులకు ఉంటుందని పేర్కొన్నారు. 

ఒక సామాజిక రుగ్మతను మతపరమైన ఆచారంగా ముద్రవేసినప్పుడు అది నిజంగా మతపరమైన అచారామా లేక సామాజిక దురాచారమా అని చెప్పే హక్కు కోర్టుకు ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

పితృస్వామ్య భావజాలాన్ని ఆపాదించొద్దన్న కేంద్రం

భారతీయ సమాజం మహిళలను ఎప్పుడూ గౌరప్రదమైన స్థానంలో ఉంచిందని, మనం దేవతలను పూజిస్తామని మెహతా ఈ సందర్బంగా గుర్తు చేశారు. రాష్ట్రపతి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వరకు మహిళలు అత్యున్నత పదవులను అలంకరించారని, కాబట్టి ఇక్కడ పితృస్వామ్య భావజాలాన్ని ఆపాదించవద్దని ఆయన కోరారు. 

ఈ విచారణలో సుప్రీంకోర్టు కేవలం శబరిమల తీర్పు మెరిట్‌లను మాత్రమే కాకుండా, మతపరమైన స్థలాల్లో మహిళలపై వివక్షకు సంబంధించి రూపొందించిన ఏడు కీలక ప్రశ్నలపై దృష్టి సారిస్తామని స్పష్టం చేసింది. 

Frequently Asked Questions

శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టులో విచారణ ఎందుకు జరుగుతోంది?

శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై 2018 నాటి తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వం తరఫున ఎవరు వాదనలు వినిపించారు?

కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు. ఆయన మహిళల ప్రవేశంపై ఆంక్షలు మతపరమైన విశ్వాసాలకు సంబంధించినవని పేర్కొన్నారు.

మతపరమైన ఆచారాలపై న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చా?

మతపరమైన ఆచారాలు ప్రజల భావాలకు, నైతికత, ఆరోగ్యానికి భంగం కలిగించినప్పుడు మాత్రమే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని తుషార్ మెహతా వాదించారు. మత గ్రంథాలను అర్థం చేసుకోవడం న్యాయసమీక్ష పరిధిలోకి రాదని ఆయన పేర్కొన్నారు.

2018 నాటి శబరిమల తీర్పుపై అభ్యంతరం ఏమిటి?

2018 తీర్పులో మహిళల ప్రవేశాన్ని అస్పృశ్యత కిందకు తీసుకురావడాన్ని తుషార్ మెహతా అభ్యంతరించారు. అయితే, ఆంక్షలు కేవలం వయసు ఆధారంగానే ఉన్నాయని, రుతుక్రమంతో సంబంధం లేదని స్పష్టం చేశారు.

శబరిమల విషయంలో సుప్రీంకోర్టు ఏయే అంశాలపై దృష్టి సారిస్తుంది?

సుప్రీంకోర్టు కేవలం శబరిమల తీర్పు మెరిట్లను మాత్రమే కాకుండా, మతపరమైన స్థలాల్లో మహిళలపై వివక్షకు సంబంధించి రూపొందించిన ఏడు కీలక ప్రశ్నలపై కూడా దృష్టి సారిస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget