అన్వేషించండి

live in relationship: సహజీవనంలో బిడ్డను కన్న యువతి - తేడా వచ్చిందని రేప్ కేసు - సుప్రీంకోర్టు ఏమన్నదంటే ?

Supreme Court: వారు ఏళ్ల తరబడి కలిసున్నారు. బిడ్డనూ కన్నారు. కానీ తేడా వచ్చిందని ఆ వ్యక్తిపై మహిళ రేప్ కేసు పెట్టింది.

Supreme Court on live in relationship:  లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లు విఫలమైనప్పుడు, ఆ పరిణామాలను క్రిమినల్ నేరాలుగా పరిగణించలేమని భారత అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారంటూ దాఖలైన ఒక అత్యాచార కేసును విచారించిన జస్టిస్ బి.వి. నాగరత్న నేతృత్వంలోని బెంచ్, పరస్పర అంగీకారంతో సాగే ఇటువంటి సంబంధాల్లో ఉండే చట్టపరమైన చిక్కులు ,  అనిశ్చితిపై సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది.

సహజీవనం ఒక చట్టపరమైన రిస్క్ 

చాలా ఏళ్ల పాటు కలిసి ఉండి, ఆ తర్వాత విడిపోయినప్పుడు మహిళలు పురుషులపై లైంగిక దాడి ఫిర్యాదులు చేయడం ఇప్పుడు పరిపాటిగా మారిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వివాహేతర బంధాల్లో ఇలాంటి అనిశ్చితులు సహజం. పెళ్లి కాకుండా సహజీవనం చేస్తున్నప్పుడు భాగస్వాములు ఎప్పుడైనా విడిపోయే అవకాశం ఉంటుంది. పరస్పర అంగీకారంతో బంధాన్ని కొనసాగించినప్పుడు, అది విఫలమైతే నేరం ఎలా అవుతుంది  అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఒకవేళ వివాహం జరిగి ఉంటే, ద్వితీయ వివాహం   కింద కేసు పెట్టవచ్చని లేదా భరణం కోరవచ్చని, కానీ సహజీవనంలో అటువంటి హక్కులు పరిమితమని గుర్తుచేసింది.      

పిల్లలు ఎప్పటికీ అక్రమం కాదు                                 

బాధితురాలు తాను మోసపోయానని, సదరు వ్యక్తికి ఇదివరకే వివాహమైందని వాదించగా.. కోర్టు ఆమెపై సానుభూతి వ్యక్తం చేస్తూనే, చట్టపరమైన కోణాన్ని వివరించింది. అయితే, వీరి బంధం వల్ల కలిగిన సంతానం విషయంలో కోర్టు మానవీయ కోణంలో స్పందించింది.  తల్లిదండ్రుల బంధం చట్టవిరుద్ధం కావొచ్చేమో కానీ, పుట్టిన బిడ్డ మాత్రం ఎప్పటికీ అక్రమం కాదు  అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ శిశువు సంరక్షణ కోసం తండ్రి నుండి మెయింటెనెన్స్  కోరే హక్కు బిడ్డకు ఉంటుందని స్పష్టం చేసింది.

మధ్యవర్తిత్వమే మార్గం..                      

ఇలాంటి సున్నితమైన కేసుల్లో కఠినమైన క్రిమినల్ చర్యల కంటే, ఇరుపక్షాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడమే శ్రేయస్కరమని సుప్రీంకోర్టు సూచించింది. వివాద పరిష్కారం కోసం మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించాలని ఇరు పక్షాలకు సలహా ఇచ్చింది. ఆధునిక కాలంలో మారుతున్న సామాజిక పోకడలతో, సహజీవనం చేసేవారు అందులోని చట్టపరమైన రక్షణలు , పరిమితులపై అవగాహన కలిగి ఉండాలని ఈ తీర్పు హెచ్చరికగా నిలుస్తోంది.             

 

టాప్ హెడ్ లైన్స్

ABP Desam Top 10, 28 September 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 28 September 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
Nara Lokesh: మంగళగిరిలో పేదల కల సాకారం.. 372 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి నారా లోకేష్
మంగళగిరిలో పేదల కల సాకారం.. 372 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి నారా లోకేష్
IND VS AFG, Asian Games QF Result: బంతి పడకుండానే సెమీఫైనల్ బెర్త్.. అఫ్గాన్ తో క్వార్టర్  మ్యాచ్‌ను ముంచెత్తిన వర్షం, టాప్ ర్యాంకింగ్‌తో శ్రేయస్ సేన ముందంజ
బంతి పడకుండానే సెమీఫైనల్ బెర్త్.. అఫ్గాన్ తో క్వార్టర్  మ్యాచ్‌ను ముంచెత్తిన వర్షం, టాప్ ర్యాంకింగ్‌తో శ్రేయస్ సేన ముందంజ
CJP election boycott call: సీజేపీ దీప్కే సలహా - విపక్షాలు ఎన్నికలు బహిష్కరిస్తే ఏం జరుగుతుంది?
సీజేపీ దీప్కే సలహా - విపక్షాలు ఎన్నికలు బహిష్కరిస్తే ఏం జరుగుతుంది?

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Former MP Vijayasai Reddy: తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
YS Jagan double stand: వైఎస్ జగన్ డబుల్ గేమ్ పాలిటిక్స్ - జాతీయ స్థాయిలో మండిపడుతున్న విపక్షాలు.. స్టాండ్ లేని రాజకీయాలా?
వైఎస్ జగన్ డబుల్ గేమ్ పాలిటిక్స్ - జాతీయ స్థాయిలో మండిపడుతున్న విపక్షాలు.. స్టాండ్ లేని రాజకీయాలా?
Bank Employees Strike: బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం
బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం
Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Urban Land Ceiling: యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
పెట్రోల్ ధరల టెన్షన్‌కు Toyota Innova చెక్.. లీటర్ రూ. 25 రన్నింగ్ కాస్ట్‌తో వస్తున్న ఇథనాల్ కారు
పెట్రోల్ ధరల టెన్షన్‌కు Toyota Innova చెక్.. లీటర్ రూ. 25 రన్నింగ్ కాస్ట్‌తో వస్తున్న ఇథనాల్ కారు
ABP Desam Top 10, 28 September 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 28 September 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ
సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Embed widget