అన్వేషించండి

Antilia menu: అంబానీ ఇంట్లో రోజుకు నాలుగు వేల చపాతీలు తయారీ - కానీ అన్నీ పని వాళ్లకే - మరి వాళ్లేం తింటారు?

Ambani house Antilia: అంబానీ ఇంటి నిర్వహణ కోసం 600 మంది పని చేస్తారు. అందరికీ యాంటీలియాలోనే పోషకాహారం అందుతుంది.

Mukesh Ambani house Antilia menu: కుబేరుడు ముకేష్ అంబానీ నివాసం యాంటిలియా  అంటేనే ఒక అద్భుతం. 27 అంతస్తులు, అత్యాధునిక సౌకర్యాలు, వందలాది మంది సిబ్బంది.. ఇలా ఆ ఇంటి గురించి ఏ వార్త వచ్చినా అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా యాంటిలియా వంటగదిలో రోజుకు 4,000  చపాతీలు తయారవుతాయనే  వార్త వైరల్ అయింది. అన్ని చపాతీలు ఎందుకన్నది చాలా మందికి వచ్చే సందేహం. 

ఎందుకు అన్ని రొట్టెలు? 

ముకేష్ అంబానీ ఇంట్లో రోజుకు 4,000 రొట్టెలు తయారవుతాయన్నది నిజం. అయితే, ఇవన్నీ కేవలం అంబానీ కుటుంబం కోసం మాత్రమే కాదు. యాంటిలియా నిర్వహణ కోసం దాదాపు  600 మంది సిబ్బంది పనిచేస్తారు. వీరిలో సెక్యూరిటీ గార్డులు, డ్రైవర్లు, క్లీనర్లు, వంటవారు,  ఇతర సాంకేతిక సిబ్బంది ఉంటారు. వీరందరికీ యాంటిలియా వంటగదిలోనే పోషకాహారంతో కూడిన భోజనం సిద్ధమవుతుంది. ప్రతి సిబ్బందికి నాణ్యమైన ఆహారం అందాలనే ఉద్దేశంతోనే ఇంత భారీ స్థాయిలో రొట్టెలు వండుతారు. 

షెఫ్ జీతం లక్షల్లోనే.. 

ఇంత భారీ మొత్తంలో ఆహారాన్ని నాణ్యత తగ్గకుండా తయారు చేయడం సామాన్యమైన విషయం కాదు. అందుకే ఇక్కడ పనిచేసే షెఫ్  లకు భారీగా జీతాలు ఇస్తారు.  సమాచారం ప్రకారం, యాంటిలియాలో పనిచేసే ప్రధాన షెఫ్ జీతం నెలకు 2 లక్షల  వరకు ఉంటుందని తెలుస్తోంది. కేవలం జీతమే కాకుండా, వీరికి ఇన్సూరెన్స్ , ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తారు. ఆధునిక  చపాతీ మేకింగ్ మెషీన్స్  ఉన్నప్పటికీ, రుచి,  ఆకృతి సరిగ్గా ఉండేలా ఈ నిపుణులైన షెఫ్ లు పర్యవేక్షిస్తారు.

ముకేష్ అంబానీ  సింపుల్  డైట్* 

ప్రపంచ కుబేరుల్లో ఒకరైనప్పటికీ, ముకేష్ అంబానీ ఆహారపు అలవాట్లు మాత్రం చాలా సాదాసీదాగా ఉంటాయి. ఆయన పూర్తి శాఖాహారి. ఎప్పుడూ ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇస్తారు. ఉదయం బొప్పాయి జ్యూస్, ఇడ్లీ-సాంబార్ వంటి తేలికపాటి దక్షిణాది వంటకాలు తీసుకుంటారు. మధ్యాహ్నం గుజరాతీ స్టైల్ పప్పు , అన్నం, కూరలు, రొట్టె , సలాడ్ తీసుకుంటారు. రాత్రి  చాలా తక్కువగా అంటే  రాగి లేదా మిల్లెట్ రొట్టెలు, కూరలు తీసుకుంటారు.

నీతా అంబానీ ఫిట్‌నెస్ రహస్యం 

నీతా అంబానీ తన ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్ విషయంలో చాలా కఠినంగా ఉంటారు. ఆమె ఉదయాన్నే డ్రై ఫ్రూట్స్, తాజా పండ్ల రసాలను తీసుకుంటారు. జంక్ ఫుడ్‌కు ఈ కుటుంబం చాలా దూరంగా ఉంటుంది. రిపోర్ట్స్ ప్రకారం, వీరు నెలకు ఒక్కసారి మాత్రమే బయటి ఫుడ్ లేదా జంక్ ఫుడ్ తింటారు. వారానికి ఒకసారి మాత్రం ముకేష్ అంబానీకి ఇష్టమైన  సేవ్ పూరీ ఇంట్లోనే తయారు చేయించుకుని తింటారు.

వంటగదిలో కట్టుదిట్టమైన నాణ్యత 

యాంటిలియా కిచెన్ ఒక సెవెన్ స్టార్ హోటల్ స్థాయిని మించి ఉంటుంది. కూరగాయల ఎంపిక నుండి భోజనం వడ్డించే వరకు ప్రతి దశలోనూ అత్యంత శుభ్రత పాటిస్తారు. ఆహారంలో పోషక విలువలు తగ్గకుండా డైటీషియన్ల సలహాల మేరకు మెనూ రూపకల్పన జరుగుతుంది. సాత్విక ఆహారం, ఇంటి వంటలకే మొగ్గు చూపడం వల్ల అంబానీ కుటుంబం ఇన్ని ఏళ్లుగా ఆరోగ్యంగా,  ఉత్సాహంగా ఉంటున్నారని అనుకోవచ్చు.    

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shreyas Iyer Toss Luck Streak: టాస్ లక్ లో ధోని, కోహ్లీ సరసన శ్రేయస్ .. వరుసగా ఐదోసారి అదృష్టం వరించినా దక్కని ఫస్ట్ విక్టరీ, ట్రెంట్ బ్రిడ్జ్ టీ20 లో టీమిండియాలో మార్పులు
టాస్ లక్ లో ధోని, కోహ్లీ సరసన శ్రేయస్ .. వరుసగా ఐదోసారి అదృష్టం వరించినా దక్కని ఫస్ట్ విక్టరీ, 3వ టీ20 లో టీమిండియాలో మార్పులు
Wayanad Landslide: వయనాడ్‌లో కొండ చరియల భీభత్సం.. భయం గొలుపుతున్న CCTV విజువల్స్  
వయనాడ్‌లో కొండ చరియల భీభత్సం.. భయం గొలుపుతున్న CCTV విజువల్స్  
Samson  Exclusion Strategy Twist: సంజూ శాంసన్ జింబాబ్వే టూర్ ఎగ్జిట్ వెనుక క్రేజీ ఇన్సైడ్ స్టోరీ.. ఆ వ్యూహంతోనే తనను..
సంజూ శాంసన్ జింబాబ్వే టూర్ ఎగ్జిట్ వెనుక క్రేజీ ఇన్సైడ్ స్టోరీ.. ఆ వ్యూహంతోనే తనను..
ABP Desam Top 10, 7 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 7 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Pawan Kalyan: అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Embed widget