అన్వేషించండి

Summer Holidays: తెలంగాణలో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం! సమ్మర్ హాలీడేస్ ఎన్నిరోజులంటే?

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వేసవి సెలవులను ఖరారుచేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది.

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వేసవి సెలవులను ఖరారుచేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. 2023-24 విద్యా సంవత్సరం జూన్ 12న ప్రారంభమవుతుందని పేర్కొంది. ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 12 నుంచి 20 వరకు సమ్మేటివ్ అసెస్‌మెంట్-2 నిర్వహించనున్నారు. ఇక ఒకటి నుంచి 5వ తరగతి వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు,  ఆరు నుంచి 8వ తరగతులకు 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు, 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 9:30 నుంచి మ.12:30 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 21 నుంచి 24 వరకు పరీక్షా పత్రాలను మూల్యాంకనం చేసి ఫలితాలు ప్రకటిస్తారు.. ఆ తరువాత విద్యార్థులకు మార్కులు చెప్పి సెలవులు ప్రకటించనున్నారు.

ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు..
ఇక రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పదోతరగతి పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అయితే కాంపోజిట్ కోర్సు, సైన్స్ పేపర్ల వ్యవధి మార్నింగ్ 9 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సంవత్సరం 11 పేపర్లకు బదులు 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. హాల్‌టికెట్లను స్కూళ్లకు పంపారు. మరోవైపు అధికారిక వెబ్‌సైట్‌లోనూ హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. ఎగ్జామ్ సెంటర్లలో విద్యార్థులకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందజేయనున్నారు. అలానే ఎగ్జామ్ సెంటర్లలో ప్రథమ చికిత్స కిట్‌లతో పాటు పరీక్షలు జరిగే అన్ని రోజులలో ఒక ఏఎన్‌ఎం అందుబాటులో ఉండడనున్నారు. స్టూడెంట్స్ పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి అందుబాటులో ఆర్టీసీ బస్సులను ఉంచారు.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్, 4న సెకండ్ లాంగ్వేజ్, 6న ఇంగ్లిష్, 8న మ్యాథమెటిక్స్, 10న సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ), 11న సోషల్, 12న ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు, 13 ఓరియంటెల్ పేపర్-2 పరీక్షలు జరుగనున్నాయి. ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్‌ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు దాదాపు 5.50 లక్షల మంది విద్యార్థలు హాజరుకానున్నారు.

ఆఖరి 15 నిమిషాల్లోనే బిట్ పేపర్..
తెలంగాణ వ్యాప్తంగా ఇదిలా ఉంటే విద్యార్థులకు ఇచ్చే మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నపత్రం (బిట్‌ పేపర్‌)ను ఆఖరి 15 నిమిషాల్లోనే ఇవ్వాలని తెలిపింది. అంతేకాకుండా జనరల్‌ సైన్స్‌ పరీక్షలోని రెండు ప్రశ్నపత్రాలను ఒకేసారిగా కాకుండా నిర్దేశించిన సమయానికి విద్యార్థులకు విడివిడిగా ఇవ్వాలని పేర్కొంది. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలను ఆరు పేపర్లుగానే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.   కాగా, ఇప్పటికే మోడల్ ప్రశ్నాపత్రాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. ఈసారి 6 పేపర్లతోనే పరీక్షలు జరుగుతుండగా... ఇందులో రాత పరీక్షలకు 80 మార్కులు, ఫార్మటివ్ అసెస్మెంట్ కు 20 మార్కులు ఉంటాయి. అన్ని ఎగ్జామ్స్ కు 3 గంటలు, సైన్స్ కు మాత్రం 3.20 గంటల సమయం ఉంటుంది. ఈ మేరకు విద్యాశాఖ విడుదల చేసిన ప్రకటనలో పూర్తి వివరాలను వెల్లడించారు.

ALso Read:

'టెన్త్' విద్యార్థులకు గుడ్ న్యూస్, కొత్త మోడల్ పేపర్లు వచ్చేశాయ్! ఇక 'ఛాయిస్' మీదే!
తెలంగాణలో పదోతరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. కొత్త మోడల్ పేపర్లు అందుబాటులోకి వచ్చాయి. టెన్త్ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాల్లో మార్పులకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రశ్నపత్రాల్లో మార్పులతో కొత్త మోడల్‌ పేపర్లను విడుదల చేసింది. ఎన్‌సీఈఆ‌ర్‌టీ అధికారిక వెబ్‌సైట్‌లో మోడల్ పేపర్లను అందుబాటులో ఉంచింది. త్వరలోనే పాఠశాలలకు కొత్త మోడల్ పేపర్లు, బ్లూప్రింట్‌ను ప్రభుత్వం సరఫరా చేయనుంది.
పదోతరగతి మాదిరి ప్రశ్నపత్రాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Embed widget