News
News
X

Medical PG counselling: పీజీ వైద్యవిద్య కౌన్సెలింగ్‌ ఎప్పటినుంచంటే?

తెలంగాణ రాష్ట్రంలో 2070 పీజీ వైద్యవిద్య సీట్లుండగా రెండు వైద్య కళాశాలల నుంచి గతేడాది ప్రవేశాలు పొందిన 130 పీజీ సీట్లను రద్దు చేస్తూ ఎన్ ఎంసీ నిర్ణయం తీసుకుంది. వీటిని ఇంకా సర్దుబాటు చేయలేదు.

FOLLOW US: 

దేశవ్యాప్తంగా 2022-23 సంవత్సరానికి పీజీ వైద్య విద్య ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియను సెప్టెంబరు 1 నుంచి నిర్వహించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్  (డీజీహెచ్‌ఎస్ ) సన్నాహాలు చేస్తోంది. కౌన్సెలింగ్‌కు సంబంధించి ఆగస్టు నెలాఖరులోగా ప్రవేశ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పీజీ వైద్య విద్య సీట్ల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న కళాశాలలకు ఇప్పటికీ జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) సీట్లను ఇచ్చే ఉద్దేశంతో 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' జారీచేస్తుంది. ఇచ్చిన తర్వాత మరోసారి ఎన్‌ఎంసీ నిపుణుల బృందం ఆయా కళాశాలలను పరిశీలించి, అవసరమైన పూచీకత్తులను స్వీకరించి, సీట్లకు పూర్తిస్థాయిలో అనుమతులిస్తుంది.

ప్రవేశ ప్రక్రియ ప్రారంభించనున్న నేపథ్యంలో ఇలా లెటర్  ఆఫ్  ఇంటెంట్  ఇవ్వడం వల్ల ఆయా సీట్లను ప్రవేశాలకు పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా? అనే సందిగ్ధత నెలకొంది. పైగా ఎన్ని సీట్లను కన్వీనర్  కోటా కింద లెక్కలోకి తీసుకుంటే.. అందులో సగం సీట్లను అఖిల భారత కోటాలో ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన వాటినే రాష్ట్ర స్థాయిలో భర్తీ చేసుకోవాలి. ఇంత సంక్లిష్టత నెలకొనడంతో తాజాగా డీజీహెచ్ఎస్ఈ అంశంపై స్పష్టతనిస్తూ అన్ని రాష్ట్రాలకూ లేఖ రాసింది.

Also Read: CBSE Admitcard: సీబీఎస్‌ఈ కంపార్ట్‌మెంట్ పరీక్షల హాల్‌టికెట్లు రిలీజ్, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి!
ప్రవేశ ప్రకటన వెలువరించడానికి ముందు ఎన్ని సీట్లకు అనుమతి లభిస్తుందో... ఆ సీట్లను మాత్రమే ప్రవేశాలకు పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టీకరించింది. లెటర్  ఆఫ్  ఇంటెంట్  ఇచ్చిన సీట్లను ప్రవేశాల జాబితాలో పొందుపరచవద్దని తెలిపింది. దీంతో ఇప్పటివరకూ అనుమతి ఉన్న పీజీ సీట్లకే ప్రవేశ ప్రకటన వెలువరించనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు తెలిపాయి.

తెలంగాణ  రాష్ట్రంలో 2070 పీజీ వైద్యవిద్య సీట్లుండగా రెండు వైద్య కళాశాలల నుంచి గతేడాది ప్రవేశాలు పొందిన 130 పీజీ సీట్లను రద్దు చేస్తూ ఎన్ ఎంసీ నిర్ణయం తీసుకుంది. వీటిని ఇంకా సర్దుబాటు చేయలేదు. 2022-23 సంవత్సరానికి ఎలాగూ వీటికి అనుమతి లభించదు. దీంతో ఆ మేరకు సీట్లను కోల్పోయినట్లయింది.

Also Read: ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 200కి పైగా పీజీ సీట్లు ఈ ఏడాది కొత్తగా వచ్చే అవకాశాలున్నాయని వైద్యవర్గాలు తెలిపాయి. ఇంకా అనుమతి లేఖలు రాకపోవడంతో తొలివిడత ప్రవేశాలనాటికి వాటిని పరిగణనలోకి తీసుకునే అవకాశాల్లేవు. తగ్గిన సీట్లతోనే ఈసారి పీజీ వైద్యవిద్య ప్రవేశ ప్రకటన వెలువరించే అవకాశాలున్నాయని కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి.

ఒకవేళ తొలివిడత ప్రవేశ ప్రకటన తర్వాత గనుక అనుమతి వస్తే అప్పుడు కొత్తగా వచ్చిన పీజీ సీట్లను తరువాత విడత కౌన్సెలింగ్ లకు లెక్కలోకి తీసుకుంటామని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతానికి లెటర్  ఆఫ్  ఇంటెంట్  ఇచ్చిన సీట్లకు అనుమతి ఇవ్వడానికి ముందు ఇంకా ఏమైనాలోపాలను సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటే.. ఆయా కళాశాలల నుంచి పూచీకత్తు స్వీకరిస్తారని, ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఇదే విషయంలో సర్కారు పూచీకత్తుగా వ్యవహరిస్తుందని వైద్యవర్గాలు వివరించాయి.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 19 Aug 2022 10:25 AM (IST) Tags: PG Medical Counselling 2022 PG Medical Seats Allotment process NEET PG Counselling Schedule 2022

సంబంధిత కథనాలు

Minister Harish Rao : తెలంగాణలో కొత్తగా 1200 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి- మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao : తెలంగాణలో కొత్తగా 1200 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి- మంత్రి హరీశ్ రావు

JVVD Application: జగనన్న విదేశీ విద్యా దీవెన దరఖాస్తు గడువు పొడిగింపు, ఎన్నిరోజులంటే?

JVVD Application: జగనన్న విదేశీ విద్యా దీవెన దరఖాస్తు గడువు పొడిగింపు, ఎన్నిరోజులంటే?

NMMS scholarship 2022: పేద విద్యార్థులకు వరం - ఎన్ఎంఎంఎస్ ఉపకారవేతనం, ఎంపిక ఇలా!

NMMS scholarship 2022: పేద విద్యార్థులకు వరం - ఎన్ఎంఎంఎస్ ఉపకారవేతనం, ఎంపిక ఇలా!

BRAOU Admissions: అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశ గడువు మళ్లీ పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

BRAOU Admissions: అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశ గడువు మళ్లీ పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

Dasara Holidays: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు: ఇంటర్‌ బోర్డు

Dasara Holidays: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు: ఇంటర్‌ బోర్డు

టాప్ స్టోరీస్

GVL Letter : రెండో విడతలో అయినా విశాఖలో 5జీ సేవలు ప్రారంభించండి - కేంద్రమంత్రికి జీవీఎల్ లేఖ !

GVL Letter : రెండో విడతలో అయినా విశాఖలో 5జీ సేవలు ప్రారంభించండి - కేంద్రమంత్రికి జీవీఎల్ లేఖ !

Durga Puja Pandal Kolkata: మహిషాసురిడిగా మహాత్ముడు- దుర్గా మాత మండపంలో గాంధీకి అవమానం!

Durga Puja Pandal Kolkata: మహిషాసురిడిగా మహాత్ముడు- దుర్గా మాత మండపంలో గాంధీకి అవమానం!

KTR Tweet: గాంధీని అవమానించడంపై కేటీఆర్ ఫైర్- ఎన్ని జన్మలెత్తినా సాధించలేరని ట్వీట్!

KTR Tweet: గాంధీని అవమానించడంపై కేటీఆర్ ఫైర్- ఎన్ని జన్మలెత్తినా సాధించలేరని ట్వీట్!

Central Information Commission: భర్త జీతం తెలుసుకునే హక్కు భార్యకు ఉంటుంది, ఆ చట్టంతో లెక్కలు తేల్చేయచ్చు!

Central Information Commission: భర్త జీతం తెలుసుకునే హక్కు భార్యకు ఉంటుంది, ఆ చట్టంతో లెక్కలు తేల్చేయచ్చు!