Telangana Inter exam Fee: ఇంటర్ పరీక్ష ఫీజు తేదీలు ఖరారు, చివరి తేదీ ఎప్పుడంటే?
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో పాటు గతంలో ఫెయిలైన విద్యార్థులు, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిందిగా ఇంటర్ బోర్డు తెలిపింది.
తెలంగాణ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్‌కు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియ నవంబరు 14 నుంచి ప్రారంభంకానుంది. విద్యార్థులు నవంబరు 30 వరకు సంబంధిత కళాశాలలో పరీక్ష ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో పాటు గతంలో ఫెయిలైన విద్యార్థులు, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులు కూడా పరీక్ష ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు తెలిపింది. వచ్చే ఏడాది మార్చిలో ఇంటర్ వార్షిక పరీక్షలను నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
పరీక్ష ఫీజు వివరాలు ఇలా..
🔰 ఇంటర్ రెగ్యులర్ విద్యార్థులు రూ. 500 పరీక్ష ఫీజుగా చెల్లించాలి.
🔰 ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సైన్స్ గ్రూపుల విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షల నిమిత్తం అదనంగా రూ.210 చెల్లించాల్సి ఉంటుంది.
🔰 ఒకేషనల్ విద్యార్థులైతే రూ. 710 చెల్లించాలి.
🔰 నవంబరు 14 నుంచి 30 వరకు ఫీజు ఆలస్యరుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చు.
🔰 రూ. 100 ఆలస్య రుసుముతో డిసెంబర్ 2 నుంచి 6 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
🔰 రూ. 500 ఆలస్య రుసుంతో డిసెంబర్ 8 నుంచి 12 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
🔰 రూ.1000 ఆలస్య రుసుంతో డిసెంబర్ 14 నుంచి 17 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
🔰 రూ. 2000 ఆలస్య రుసుంతో డిసెంబర్ 19 నుంచి 22 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
పరీక్ష ఫీజుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
:: Also Read::
TSBIE: ఇంటర్ విద్య ప్రక్షాళన, సమూలంగా మారనున్న స్వరూపం!
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండే విధంగా ఇంటర్మీడియేట్ విద్యలో గణనీయమైన మార్పులు తేవాలని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. జాతీయ పరీక్షల సిలబస్‌ను ఇంటర్ సిలబస్‌లో మార్పులు తీసుకురావడంతోపాటు బోధన ప్రణాళికను సమూలంగా మార్చేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని తీర్మానించింది. సిలబస్ మార్పు, కొత్త సిలబస్ ఖరారుకు పాలకమండలి ఆమోదం లభించింది.
తీసుకున్న కొన్ని నిర్ణయాలివే:
🔰 వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ఇంగ్లిష్ సబ్జెక్టులోనూ 20 శాతం మార్కులను ప్రాక్టికల్స్‌కు కేటాయించనున్నట్లు పాలకమండలి తెలిపింది. రాత పరీక్షను 80 మార్కులకే పరిమితం చేస్తామని పేర్కొంది. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంచేందుకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి ప్రాక్టికల్స్‌ను అమలు చేస్తామని చెప్పింది.
🔰 ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో సిబ్బంది, విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరును ఈ విద్యా సంవత్సరమే అమలు చేయాలని నిర్ణయించింది.
🔰 ఎంపీసీ గ్రూపు రెండో ఏడాది గణితం- 2బిలో ఎక్కువ మంది విద్యార్థులు తప్పుతున్నారు. సిలబస్ అధికంగా, కఠినంగా ఉందనే భావన ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది కొంత మేర సిలబస్ తగ్గిస్తారు. అందుకు ఓ కమిటీని నియమిస్తారు.
🔰 ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు అనుగుణంగా నీట్, క్లాట్ తదితర పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా సిలబస్ రూపొందిస్తారు.
🔰 వచ్చే విద్యా సంవత్సరం(2023-24) ప్రథమ, 2024-25లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ద్వితీమ భాష సబ్జెక్టుల సిలబస్ మారుస్తారు. నైతికతను పెంచే పాఠాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు.
🔰 ఇంటర్ బోర్డులో 52 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని టీఎస్‌పీఎస్‌సీ ద్వారా భర్తీ చేస్తారు. ఒక్కో చోట మూడు ఉద్యోగాల చొప్పున 15 జిల్లాల్లోని నోడల్ అధికారుల కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేస్తారు.
🔰 కామర్స్‌ను కామర్స్ అండ్ అకౌంటెన్సీగా పిలుస్తారు.
🔰 అంధులు, మూగ, చెవిటి విద్యార్థులకు ఇప్పటివరకు పరీక్షల్లో సాధారణ విద్యార్థుల కంటే 30 నిమిషాల సమయం అధికంగా ఇచ్చేవారు. దాన్ని 60 నిమిషాలకు పెంచుతారు. ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు చేస్తారు.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాల పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..
TAFRC: ఇంజినీరింగ్ కాలేజీలకు స్ట్రాంగ్ వార్నింగ్, అలాచేస్తే ఫైన్ కట్టాల్సిందే!!
ఇంజినీరింగ్ కాలేజీలను తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) హెచ్చరించింది. టీఏఎఫ్‌ఆర్‌సీ నిర్ణయించిన ఫీజుల కన్నా ఎక్కువ వసూలు చేస్తే జరిమానా తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. జీవో నంబర్ 37 ప్రకారం అందులో సూచించిన ఫీజుల కన్నా ఎక్కువ వసూలు చేయకూడదని, ఏ ఇతర రూపాల్లోనూ డబ్బులు వసూలు చేయకూడదని కాలేజీలకు తేల్చి చెప్పింది.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..